»Sandeep Reddy Vanga It Is Not A School To Learn By Watching A Movie
Sandeep Reddy Vanga: సినిమా చూసి నేర్చుకోవడానికి అది పాఠశాల కాదు!
యానిమల్ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చిన భారీ విజయాన్ని అందుకుంది. ఈచిత్రంపై చాలామంది విమర్శలు చేశారు. అయితే ఇటీవల ఈ విమర్శలపై యానిమల్ డైరక్టర్ సందీప్ వంగా స్పందించారు.
Sandeep Reddy Vanga: సందీప్ వంగా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో డైరక్టర్గా ఎంట్రీ ఇచ్చిన వంగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సందీప్ వంగా కాంబోలో ఇటీవల వచ్చిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లు కుల్లగడుతోంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాపై భారీగా విమర్శలు వచ్చాయి. అయిన సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంపై వస్తోన్న విమర్శలపై తాజాగా వంగా స్పందించారు.
విమర్శల వల్ల సినిమాపై ప్రతికూలత ఏర్పడుతుంది. ఒక అబద్ధాన్ని ఎక్కువసార్లు చెబితే అదే నిజమనిపిస్తుంది. సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. యానిమల్ సినిమా కలెక్షన్లు రూ.350 కోట్ల దగ్గరే ఆగిపోయినట్లయితే విమర్శకులంతా దీన్ని ఫ్లాప్ అని ప్రకటించేవాళ్లని అన్నారు. రూ.100 కోట్లు బడ్జెట్తో తీసిన సినిమా రూ.140 కోట్లు వసూల్ చేసిందంటే అది నా దృష్టిలో హిట్ అయినట్లే. కానీ విమర్శకులు మాత్రం ప్రేక్షకాదరణ పొందలేదని ప్రచారం చేస్తుంటారు.
సినిమా చూసి అన్ని నేర్చుకోవడానికి అది పాఠశాల కాదు కదా. తల్లిదండ్రులు, తరగతి గదుల్లో మంచి చెడులు తెలుసుకోలేని వాళ్లు సినిమా చూసి నేర్చుకుంటారని భావించను. దేవుడి దయ, నేను పడ్డ కష్టం వల్ల మూడు సినిమాలు విజయం సాధించాయి. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. అందుకే నా సినిమాలను కూడా ఆ స్థాయి వాటితోనే పోల్చుకుంటాను. విమర్శలపై దృష్టి పెట్టనని వంగా తెలిపారు.