మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రెండు వారాల్లోగా వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
బస్సులో సీటు కాదు.. ఎక్కేందుకు చోటు కూడా లేదని.. ఓ విద్యార్థిని ఏడ్చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.
మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం టాప్ లేపింది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధిక విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది.
రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు, మహిళలకు రూ.2500, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500కు గ్యాస్ అంశాలపై పీఏసీ సమావేశంలో చర్చించారు. గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరగగా.. ఆ వివరాలను షబ్బీర్ అలీ మీడియాకు వెల్లడించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్పై సీపీఐ నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కన్నా ఎక్కువ తప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలో ఒక్కో చోట తమ పార్టీ పోటీ చేయనుందని వివరించారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’రెండు భాగాలుగా రూపొందింది. డిసెంబర్ 22వ తేదీన ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. జక్కన్న రాజమౌళి సలార్ మొదటి టిక్కెట్ను కొనుగోలు చేశాడు.
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. మధ్యలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు