స్కిల్ స్కామ్‌లో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి కార్లతో ఐటీ ఉద్యోగులు ర్యాలీ తీస్తున్నారు. ఏపీ సరిహద్దు వద్ద భారీగా పోలీసులను మొహరించారు. విజయవాడలో ర్యాలీకి అనుమతి లేదని సీపీ స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నోరు జారారు. రైతులు ఆత్మహత్య చేసుకోవాలని మాట్లాడి.. నాలిక కరుచుకున్నారు. రైతులు ఆకలితో, ఆత్మహత్య చేసుకుని చావకూడదని చెప్పాల్సింది పోయి.. రైతులు ఆత్మహత్య చేసుకోవాలని కామెంట్ చేశారు.
బిగ్ బాస్ 7 సీజన్ మెల్లి మెల్లిగా ఆసక్తిని పెంచుతోంది. నిన్నటి ఎపిసోడ్లో ప్రిన్స్ యావర్ సేఫ్ అయ్యారు. అంతేకాదు గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు.
టికెట్ లేకుండా మెట్రోలో జర్నీ చేస్తానని చాలెంజ్ చేసి.. చివరికీ జర్నీ చేశాడు ఓ యూట్యూబర్. నెటిజన్లు మాత్రం అతనిని ఏకీపారేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తోన్నాయి. కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్, విజయవాడ నుంచి చెన్నై వరకు వందేభారత్ రైళ్లను రేపు (ఆదివారం) ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
గూగుల్‌కు పోటీగా ఫోన్ పే యాప్ తీసుకొస్తోంది. త్వరలో ఇండస్ యాప్ స్టోర్ అందుబాటులోకి రానుంది.
చంద్రబాబు తొలి రోజు సీఐడీ అధికారుల విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలపాటు చంద్రబాబును విచారించిన అధికారులు.. 50 ప్రశ్నలు వేశారు.
దళపతి విజయ్ న్యూ మూవీ లియోకు మల్టీప్లెక్స్ అందుబాటులో లేకుండా పోయాయి.
బాలకృష్ణకు ఓ న్యాయం.. ఇతరులకు ఓ న్యాయమా అని దగ్గుబాటి పురందేశ్వరినీ పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు.
లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చీరలో హోయలు బోతున్న ఫోటోలు కుర్రకారును ఫిదా చేస్తోంది.