Multiplexes Are Against To Play Vijay Leo In Hindi
Vijay: దళపతి విజయ్ యాక్షన్ ఫిల్మ్ LEOతో వస్తున్నాడు. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఫుల్ ప్రిపరేషన్ మోడ్‌లో టీమ్ ఉంది. ఈ మూవీని లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ మూవీ సక్సెస్ అయ్యింది.
బాహుబలి, కేజీఎఫ్, పుష్ప తర్వాత సౌత్ సినిమాలకు ఉత్తర భారతదేశంలో మార్కెట్ బాగా పెరిగింది. సౌత్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామా కూడా హిందీ మార్కెట్‌ని పట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. తాజా పరిణామాలతో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
లియో హిందీ వెర్షన్ జాతీయ మల్టీప్లెక్స్ చైన్లలో విడుదలకు అవకాశం లేదు. PVR, INOX, Cinepolis హిందీ వెర్షన్ కోసం 8 వారాల థియేట్రికల్ విండో లేకుండా చిత్రాన్ని ప్రదర్శించడానికి వెనుకాడారని తెలిసింది. 4 వారాల థియేట్రికల్ రన్ తర్వాత దక్షిణ భారత సినిమాలు OTT ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వస్తాయి.
‘లియో’ విషయంలో, అధికారిక పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ భాగస్వామి అయిన నెట్‌ఫ్లిక్స్ అన్ని వెర్షన్ల కోసం 4 వారాల స్ట్రీమింగ్ డీల్‌ను పొందినట్టు తెలుస్తోంది. 3 ప్రధాన జాతీయ మల్టీప్లెక్స్ చైన్లు సినిమా OTT విడుదలతో 8 వారాల గ్యాప్‌ని అంగీకరించే వరకు ఏ భారతీయ చిత్రం హిందీ వెర్షన్‌ను ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నాయి. సమస్య పరిష్కరించబడే వరకు లియో.. బాలీవుడ్లో విడుదలయ్యేది అనుమానమే. ఈ మూవీ అక్టోబర్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.