నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఆ సమయంలో ఢిల్లీలో కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని.. అందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ మేరకు కృత్రిమ వర్షాలకు అనుమతివ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాశారు. చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మంత్రి విడుదల చేశారు.