AP: విధ్వంసాలు సృష్టించేవాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. క్రిమినల్ ఆలోచనతో వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నేరాలు చేయాలని చూస్తే అదే చివరి రోజు అవుతుందని సూచించారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని చెప్పారు.