ఫ్లిప్కార్ట్ ఇటీవల రూ.11కే ఐఫోన్ 13 అంటూ ఓ ఆఫర్ ప్రకటించింది. 22న రాత్రి 11 గంటలకు ఈ డీల్ ఉంటుందని ముందుగానే తెలిపింది. అయితే సంస్థ చెప్పిన సమయానికి ‘బై’ ఆప్షన్ కనిపించకుండానే ‘సోల్డ్ అవుట్’ సందేశాలు కనిపించాయని.. ఇదో పెద్ద స్కామ్, మార్కెటింగ్ స్ట్రాటజీ అంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫ్లిప్కార్ట్ స్పందించింది. తాము ముందుగా క్లిక్ చేసిన ముగ్గురు యూజర్లకు ఐఫోన్ 13ని రూ.11కే అందించినట్లు తెలిపింది.