MNCL: సింగరేణి కార్మికుల శ్రమతో వచ్చిన లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆరోపించారు. బుధవారం నస్పూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సింగరేణి సాధించిన వాస్తవ లాభం రూ.4,701 కోట్లపై 33 శాతం కాకుండా నిధులు దారి మళ్లించి కేవలం రూ.796 కోట్లు కార్మికులకు లాభాల వాటా ఇవ్వడం సరికాదన్నారు.