MDK: కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ప్రజలకు వరం అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. బుధవారం హవేలీ ఘనపూర్ మండలంలోని ఓ గార్డెన్లో మండలంకు సంబంధించి లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటానని అన్నారు.