బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌తో సమావేశమయ్యారు. సైలెంట్ గా ఉండాల్సిన సమయాన్ని హింసాత్మకంగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌పై నేటి ఉదయం నుంచి పెద్ద హైడ్రామా నడుస్తోంది. తమ భూభాగంలో ఉన్న సాగర్ లోని 13 గేట్లను స్వాధీనం చేసుకున్నామని ఏపీ సర్కార్ చెబుతోంది. మరోవైపు సాగర్‌పై ఏర్పాటు చేసిన బారికేడ్లను, ముళ్ల కంచెలను తొలగించాలని తెలంగాణ పోలీ
తమిళనాడు రాజధాని చెన్నై సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం రాష్ట్రంలోని పలుచోట్ల పిడుగులు, తుపాను, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అభిషేకం పాలతోనో, తేనేతోనో చేస్తారని అందరికీ తెలుసు. కానీ కారంతో అభిషేకం చేయడాన్ని చాలా మంది చూసుండరు. అయితే ఇక్కడొక స్వామికి మాత్రం భక్తులు ఏకంగా 60 కేజీల కారంతో పూజలు చేశారు.
ఓటు వేసే ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గోపూజ చేశారు. అలాగే మరో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ గ్యాస్ సిలిండర్‌కు పూజ చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓ రోగి ఆక్సిజన్ సిలిండర్ వెంటేసుకొని మరి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తనకు ఓటు విలువ తెలుసు అని, అందుకే 1966 నుంచి కంటిన్యూగా ఓటు వేస్తున్నానని తెలిపారు.