ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టిని చూసేందుకు సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో అవతార్ 2 థియేటర్లోకి రాబోతోంది. మేకర్స్ కూడా అవతార్ 2 ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు. అందుకే ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతోంది. ఒక్క తెలుగులోనే ఈ సినిమా వంద కోట్ల బిజినెస్ చేసిందని టాక్. ఇంత క్రేజ్ ఉన్న సినిమాతో పాటు.. మరో సినిమా ట్రైలర్ వేస్తే ఖచ్చితంగా జనాలకు రీచ్ అవుతుంది. ఈ క్రమంలో యంగ్ హీరో నిఖల్ నటిస్తున్న ’18 పేజెస్’ మూవీ ట్రైలర్‌ని ‘అవతార్ 2’ ఇండియన్ స్క్రీన్స్‌లో యాడ్ చేస్తున్నారట. కార్తికేయ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ఈ సినిమాను.. డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌లో వస్తున్న ఈ సినిమాకు.. కుమారి 21f ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కోసం.. యాక్టర్ కమ్ రచయిత అయిన అవసరాల శ్రీనివాస్‌తో డైలాగ్స్ రాయించారట. సన్నివేశాలకు తగ్గట్లుగా తన కలంకు పదును పెట్టి.. మంచి డైలాగ్స్ రాశాడట అవసరాల. ఇప్పటికే నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ప్రూవ్ చేసుకున్నాడు అవసరాల శ్రీనివాస్. దాంతో అవతార్ 2 తెలుగు డైలాగ్స్ కూడా అదరహో అనేలా ఉండడం పక్కా అంటున్నారు. మరి అవతార్2 టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలా సందడి చేస్తుందో చూడాలి.