ప్రపంచ వ్యాప్తంగా అవతార్ 2 దండయాత్రకు రంగం సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిగతా దేశాల్లో ఏమో గానీ.. ఇండియాలో మాత్రం ఈ సినిమా పై భారీ క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టే ప్రస్తుతం పెద్ద సినిమాలు లేకపోవడం.. అవతార్2 కి బాగా కలిసొచ్చేలా ఉంది. హిందీతో పాటు సౌత్‌లో అవతార్ 2 భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 కోసం మల్టీప్లెక్స్‌లు.. సింగిల్ థియేటర్లు రెడీ అయ్యాయి. వరల్డ్ వైడ్‌గా 52000 వేల స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతూ.. ఆల్ టైం రికార్డు క్రియేట్ చేయగా.. ఇండియాలో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇండియాలో మొత్తం 6 భాషల్లో కలిపి 4000 పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతుందట. అందుకు తగ్గట్టే.. రికార్డ్స్ బ్రేక్ చేస్తూ సెన్సేషనల్ బుకింగ్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఏకంగా 4 లక్షల 40 వేలకి పైగా టికెట్స్ బుక్ అయ్యాయయట. ఈ నెంబర్‌తో అవతార్ 2.. కేజీయఫ్ 2 రికార్డ్స్‌ని బ్రేక్ చేసేసిందని అంటున్నారు. దాంతో ఇండియాలో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమంటున్నారు. అంతేకాదు రికార్డుల వేట మొదలైందని అంటున్నారు. ఇకపోతే.. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీమియర్స్ పడిపోయాయి. ముంబైలో ప్రీమియర్ షో చూసిన తర్వాత.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన రివ్యూ ఇచ్చాడు. నిన్న రాత్రి #AvatarTheWayOfWater చూశాను.. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంతో తాను ఇప్పటికీ స్పెల్బౌండ్గా ఉన్నానని చెప్పాడు. కామెరూన్ లాంటి మేధావి క్రాఫ్ట్ ముందు తలవంచాల్సిందేనని చెప్పాడు. దాంతో అవతార్2 పై అంచనాలు పెరిగిపోయాయి.