కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్‌తో.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘వారిసు’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా తెలుగు స్టార్ హీరోలు మహేష్, రామ్ చరణ్‌తో ఈ సినిమాను చేయాలనుకున్నప్పటికీ.. వాళ్లు బిజీగా ఉండడంతో విజయ్ దగ్గరికెళ్లారు దిల్ రాజు. వంశీ పైడిపల్లి చెప్పిన కథకు సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశాడు విజయ్. తెలుగులో ఈ సినిమా వారసుడుగా డబ్బింగ్ కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు బాలయ్య ‘వీరసింహారెడ్డి’తో తలపడనున్నాడు విజయ్. అయితే తమిళ్‌తో మాత్రం అజిత్ ‘తునివు’తో గట్టి పోటీ ఉంది. అందుకే వారిసు సినిమాను అక్కడ, ఇక్కడా గట్టిగానే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి సాంగ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అవన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. దాంతో తాజాగా ట్రైలర్ టైం ఫిక్స్ చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన ‘తునివు’ ట్రైలర్ అదరహో అనేలా ఉంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి వారిసు ట్రైలర్ పైనే ఉంది. అసలే విజయ్, అజిత్ ఫ్యాన్స్‌కు పడదు. కాబట్టి ట్రైలర్‌తోనే సినిమా రిజల్ట్‌ను అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వారిసు టైం రానే వచ్చేసింది. థియేట్రికల్ ట్రైలర్ జనవరి 4 న సాయంత్రం 5 గంటలకు సన్ టీవీ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దాంతో ఆ సమయం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు దళపతి ఫ్యాన్స్. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి వారసుడు థియేటర్లో ఎలా సందడి చేస్తాడో చూడాలి.