»Actor Akhil Akkineni Next Movie With Debut Director
Disaster తర్వాత ‘అఖిల్’ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు!?
ఇప్పటికే అఖిల్ కోసం ఓ అద్భుతమైన కథను రెడీ చేశాడట. కథా చర్చలు కూడా ముగిశాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని వినిపిస్తోంది. అంతేకాదు ఈ మూవీలో హీరోయిన్ను కూడా ఖరారు చేశారట.
యంగ్ హీరో అక్కినేని అఖిల్‌కు (Akhil Akkineni) గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏజెంట్ (Agent) కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డ కూడా.. ఘోరమైన ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటి షో నుంచే ఏజెంట్ మూవీ డిజాస్టర్ (Disaster) టాక్ సొంతం చేసుకుంది. దాంతో కలెక్షన్లు ఘోరంగా పడిపోయినట్టు తెలుస్తోంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.8 కోట్ల వరకు గ్రాస్ రాబట్టిన ఏజెంట్.. రెండో రోజు రూ.2 కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా అఖిల్ కెరీర్ (Career)లోనే దారుణంగా నిలిచేలా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో.. అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది.
సినీ పరిశ్రమ వర్గాల ప్రకారం.. మన అయ్యగారు ఓ కొత్త డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ‘ఏజెంట్’ సెట్స్ పై ఉన్నప్పుడే యూవీ క్రియేషన్స్‌లో అఖిల్ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయినట్టు వార్తలొచ్చాయి. ఈ చిత్రానికి అనిల్ కుమార్ (Anil Kumar) అనే ఓ కొత్త దర్శకుడు దర్శకత్వం చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ యంగ్ అప్ కమింగ్ డైరెక్టర్ గతంలో యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్ల లో తెరకెక్కిన సాహో, రాధే శ్యామ్ సినిమాలకు పని చేశాడట. ఇప్పటికే అఖిల్ కోసం ఓ అద్భుతమైన కథను రెడీ చేశాడట. కథా చర్చలు కూడా ముగిశాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని వినిపిస్తోంది. అంతేకాదు ఈ మూవీలో హీరోయిన్ను కూడా ఖరారు చేశారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ అనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం జాన్వీ ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా నటిస్తోంది. అయితే మరో వెర్షన్ ప్రకారం.. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) డైరెక్షన్లో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. గత సంక్రాంతికి వారసుడు సినిమాతో హిట్ కొట్టాడు వంశీ పైడిపల్లి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా ఫైనలైజ్ అవలేదు. దాంతో అఖిల్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరి అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో చూడాలి.