ముందుగా జనవరి 11న వారసుడు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు దిల్ రాజు. కానీ లాస్ట్ మినిట్‌లో చిరు, బాలయ్య కోసం త్యాగం చేస్తున్నట్టు.. అందరూ బాగుండాలని.. తెలుగు హీరోలే ఫస్ట్ థియేటర్లోకి రావాలని.. జనవరి 14కి వారసుడు మూవీని పోస్ట్ పోన్ చేశాడు. కానీ తమిళ్ వెర్షన్ మాత్రం అనుకున్న సమయానికే రిలీజ్ అయిపోయింది. ఇక అక్కడ ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ ఫ్యాన్స్‌తో పాటే దిల్ రాజు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమాను థియేటర్లో చూసి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ ఫ్యాన్స్‌ను చూసి.. ‘హిట్ కొట్టేశాం’ అంటూ కాలర్ ఎగరేశారు దిల్ రాజు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే.. బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు దిల్ రాజు, వంశీపైడిపల్లిని సోషల్ మీడియలో ట్రెండ్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. అయితే దిల్ రాజు కాలర్ ఎగరేయడంతో.. ఇక తమిళ్లో హిట్ అయిపోయింది.. తెలుగులో చూసుకుందాం.. అన్నట్టే ఉంది వ్యవహారం. అంతేకాదు చిరు, బాలయ్యకు సవాల్ విసురుతున్నట్టే ఉందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కానీ దిల్ రాజు ముందే.. చిరు, బాలయ్య సినిమాలకు నా సినిమా పోటీ కాదు.. వారసుడు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఈ సినిమాపై నాకు నమ్మకం ఉంది.. ఎప్పుడు రిలీజ్ చేసినా ప్రాబ్లం లేదని చెప్పేశాడు. కానీ హిట్ టాక్ వచ్చిందన్న సంబరంలో.. దిల్ రాజు తగ్గేదేలే అంటున్నట్టే ఉంది. అయితే అక్కడ తమిళ తంబీలు విజయ్‌ని కొత్తగా చూశారు కాబట్టి కనెక్ట్ అయ్యారు. కానీ తెలుగులో ఆ సినిమా ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది.. ఇప్పుడే చెప్పలేం. మరి వారసుడు.. చిరు, బాలయ్యను తట్టుకొని నిలబడతాడేమో చూడాలి.