కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విజయ్.. తన భార్య సంగీతతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు పుకార్లు హలచల్ చేస్తున్నాయి. అసలు 23 ఏళ్ల తర్వాత విజయ్, సంగీత విడిపోవడమేంటి.. అది కూడా కొడుకు జేసన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్న సమయంలో.. అనేది కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. విజయ్ నటిస్తున్న వారిసు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు చైన్నైలో ‘వారిసు’ ఈవెంట్గాని గ్రాండ్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు విజయ్ భార్య సంగీత రాలేదు. అంతకు ముందు.. డైరెక్టర్ అట్లీ, ప్రియ దంపతుల సీమంతం వేడుకకు కూడా సంగీత రాలేదు. దాంతో.. విజయ్ విడాకులు తీసుకోబోతున్నారని.. అందుకే సంగీత దూరంగా ఉందనే టాక్ ఊపందుకుంది. కానీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం సంగీత తన పిల్లలతో కలిసి అమెరికాలో ఉన్నారని సమాచారం. అందుకే విజయ్‌తో పాటే కనిపించడం లేదని అంటున్నారు. వారిసు రిలీజ్ తర్వాత విజయ్ కూడా అమెరికాకి వెళ్లనున్నాడని టాక్. అయితే వారిసు రిలీజ్ సమయంలో ఈ న్యూస్ విజయ్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. కానీ విజయ్ ఫ్యాన్స్ దృష్టి మరల్చడానికి.. విడాకుల వార్తలను కావాలనే కొంతమంది క్రియేట్ చేశారని అంటున్నారు. అయితే.. ఇటీవలె ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు.. పైగా డివోర్స్ సెలబ్రిటీస్‌కు కొత్త కాదు.. దాంతో విజయ్ విడాకుల వ్యవహారం.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరి దీని పై విజయ్ స్పందిస్తాడేమో చూడాలి.