ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు . ఆండ్రూ ఫింట్లాఫ్ కారు ప్రమాదానికి గురికావడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, కొంత ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. ప్రాణాప్రాయం లేదని వైద్యులు తెలిపారు.
బీబీసీ షో టాప్ గేర్ కోసం షూటిగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అతని ప్రమాదం గురించి బీబీసీ ముందుగా ప్రకటన విడుదల చేసింది.. టాప్‌గేర్ టెస్ట్ ట్రాక్ సమయంలో ఫ్లింటాప్ కు ప్రమాదం జరిగిందని, వెంటనే మెడికల్ బృందం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.
ఇంగ్లాండ్ తరుపున 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20 మ్యాచులు ఆడిన ఆండ్రూ ఫ్లింటాఫ్… అన్ని ఫార్మాట్లలో కలిపి 7315 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 400 వరకూ వికెట్లు పడగొట్టాడు. కొన్ని మ్యాచుల్లో ఇంగ్లాండ్‌కి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన ఆండ్రూ ఫ్లింటాఫ్.. గాయాలతో సుదీర్ఘ కెరీర్‌ని కొనసాగించలేకపోయాడు
ఆండ్రూ ఫ్లింటాప్ బీసీసీ టాప్ గేర్ షోలో వ్యాఖ్యాతగా ఉన్నారు. 2019 నుంచి ఈ షోతో అతనికి అనుబంధం ఉంది. 2009లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫింటాప్ 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేశాడు. 141 వన్డేలు ఆడిన ఫ్లింటాప్ 32 సగటుతో 3,394 పరుగులు చేశాడు. 160 వికెట్లు తీశాడు. అదేవిధంగా 79 టెస్టుల్లో ఆడిన ఆయన 3,845 పరుగులు చేశాడు. 226 వికెట్లు తీశాడు. ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడి 76 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు.