బాలయ్య, ప్రభాస్.. అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే షో తాలుకు ఫోటోలు మంచి వైరల్‌గా మారాయి. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. అది చూసిన తర్వాత ప్రభాస్ ఎపిసోడ్ అంతకుమించి అనేలా ఉంటుందని చెప్పొచ్చు. త్వరలోనే దీని ప్రోమోని రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది ఆహా టీమ్. అయితే మోస్ట్ అవైటేడ్గా మారిన ఈ షోలో చరణ్ కూడా సందడి చేసినట్టు తెలుస్తోంది. అన్ స్టాపబుల్2 ఎపిసోడ్లో ప్రభాస్, చరణ్ సంభాషణ హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ప్రభాస్‌తో రామ్ చరణ్ మాట్లాడిన వీడియో కాల్ ఈ సీజన్‌కే హైలెట్ అంటున్నారు. ఈ సందర్భంగా.. ప్రభాస్ ముందు బాలయ్య పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చారట.. అయితే ఎప్పటిలాగే ప్రభాస్ మాట దాటేసే ప్రయత్నం చేయగా.. చరణ్ అసలు విషయం చెప్పేశాడట. ప్రభాస్ ఏం చెప్తున్నావ్ డార్లింగ్ అని అంటున్నా.. మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకోనున్నారని రామ్ చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది. గోపీచంద్ కూడా వచ్చే ఏడాది తప్పకుండా ప్రభాస్ పెళ్లి ఉంటుందని చెప్పారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అసలు మ్యాటర్ తెలియాలంటే.. ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. డిసెంబర్ 31న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని సమచారం. త్వరలోనే ఆహా టీమ్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఏదేమైనా బాలయ్య, ప్రభాస్ కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు.