Phonepe: ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్.. ఇంట్లో స్మార్ట్ టీవీ మస్ట్‌గా ఉంటున్నాయి. సో.. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ కంపల్సరీగా ఉంటాయి. అందుల్లోంచి యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని వాడుకుంటున్నారు. ప్రస్తుతం రెండు యాప్ డెవలపర్స్ మాత్రమే ఉన్నాయి. దట్ టు.. ఐఫోన్ చాలా తక్కువ మంది వాడతారు. సో.. గూగుల్ ఆధిపత్యం కొనసాగుతోంది. దానికి కళ్లెం వేయాలని ఫోన్ పే భావిస్తోంది. అవును.. త్వరలో యాప్ డెవలపర్ తీసుకొస్తామని ప్రకటించింది.
ఇండస్ యాప్ (Phonepe) స్టోర్ ప్రారంభిస్తున్నామని ఫోన్ పే తెలిపింది. ఇందులో యాప్స్ లిప్ట్ చేయాలని డెవలపర్లను కోరింది. 12 స్థానిక భాషల్లో యాప్ స్టోర్ అందుబాటులోకి రానుంది. ఇండస్ యాప్ స్టోర్‌లో ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. www.indusappstore.com ద్వారా యాప్ అప్ లోడ్ చేయాలని సూచించింది. అంతేకాదు యాప్ డెవలపర్లకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది.
ఫస్ట్ ఇయర్ యాప్ డెవలపర్ల నుంచి ఎలాంటి ఫీజు తీసుకోబోం అని స్పష్టంచేసింది. తర్వాత ఏడాది స్వల్ప మొత్తంలో ఫీజు తీసుకుంటామని ప్రకటించింది. యాప్ డెవలపర్ల నుంచి ఫ్లాట్ పామ్ ఫీజు, ఇన్ యాప్ పేమెంట్స్‌కు కమీషన్ వసూల్ చేయబోమని స్పష్టంచేసింది. తమకు నచ్చిన పేమెంట్ గేట్ వేను ఉచితంగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని కోరింది. ఇన్ యాప్ పర్చేజీలపై గూగుల్, యాపిల్ స్టోర్లు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నాయి. పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఎంచుకోకుండా డెవలపర్లను కంట్రోల్ చేస్తున్నాయి. దీంతో వాటిపై యాప్ డెవలపర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో ఇండస్ యాప్ స్టోర్ ఆ రెండుకు ప్రత్యామ్నాయం కానుంది.