Indus App store: ఫోన్‌పే కొత్తగా ఇండస్ యాప్‌స్టోర్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌స్టోర్ మనదేశం అభివృద్ధి పరిచింది. అయితే ఇది గూగుల్ ప్లే స్టోర్‌కి పోటీగా నిలవనుంది. యూపీఐ పేమెంట్స్ యాప్‌గా అందరికీ బాగా తెలిసిన ఫోన్‌పే కంపెనీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం ఇండస్ యాప్‌స్టోర్‌ను ప్రారంభించింది. ఇండస్ యాప్‌స్టోర్‌లో దాదాపు 4 లక్షల యాప్‌లు ఉన్నాయి. వీటిని 12 భారతీయ భాషల్లో సెర్చ్ చేయవచ్చు. ఇండస్ యాప్‌స్టోర్ యాప్ ప్రస్తుతం కంపెనీ వెబ్సైట్లో సిద్ధంగా ఉంది.
వినియోగదార్లు డౌన్లోడ్ చేసుకుని, తమ స్మార్ట్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ-మెయిల్ ఖాతతో సంబంధం లేకుండా మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యే విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే నోకియా, లావా వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తర్వాత ఆయా ఫోన్లలో యాప్‌స్టోర్‌ను ఇంటిగ్రేట్ చేయనుంది. ఇన్-యాప్ కొనుగోళ్లపై ఎటువంటి ఫీజూ వసూలు చేయడం లేదు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్స్టోర్లు 15-30% వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. తొలి ఏడాది యాప్‌ల నమోదు ఉచితమని, తర్వాత కూడా తక్కువ వార్షిక ఫీజులే ఉంటాయని ఫోన్‌పే ఇప్పటికే తెలిపింది.