»Flipkart Big Billion Days Sale 2023 Date Grab Upto 80 Percent Discount In Flipkart Sale
Flipkart Big Billion Days Sale: బిగ్ బిలియన్ డేస్ రాబోతున్నాయ్.. కోరికల చిట్టా రెడీ చేస్కోండి
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023.. త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్ తేదీలను ప్రకటించలేదు. కానీ సేల్ బ్యానర్ ఫ్లిప్‌కార్ట్ యాప్, వెబ్సైట్లో మాత్రం కనిపిస్తుంది.
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023.. త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్ తేదీలను ప్రకటించలేదు. కానీ సేల్ బ్యానర్ ఫ్లిప్‌కార్ట్ యాప్, వెబ్సైట్లో మాత్రం కనిపిస్తుంది. మీరు కొత్త ఫోన్, ల్యాప్‌టాప్ లేదా ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువును కూడా కొనుగోలు చేయాలనుకుంటే.. లేదా మరేవైనా వస్తువులు తక్కువ ధరకు కొనాలనుకుంటే ఇప్పటి నుంచే వాటి జాబితా సిద్ధం చేసుకోండి.
Apple, OnePlus, Samsung, Realme, Xiaomi వంటి పెద్ద కంపెనీల స్మార్ట్ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చౌకగా విక్రయించబడతాయి. రాబోయే సేల్ కోసం ప్రత్యేక మైక్రోసైట్ సిద్ధం చేయబడింది. ఇది డిస్కౌంట్లలో ఏ ఉత్పత్తులను విక్రయించబడుతుందనే సమాచారాన్ని అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ టైంలో బెస్ట్ సెల్లింగ్ టాబ్లెట్లపై 70 శాతం వరకు తగ్గింపు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై 50 శాతం నుండి 80 శాతం వరకు తగ్గింపును పొందుతారు. ప్రతిసారీ మాదిరిగానే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు సేల్కు ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. ఫ్లిప్ కార్ట్ ఈ సారి ఏ బ్యాంక్ తో విక్రయానికి చేతులు కలిపింది అన్న సమాచారం అందలేదు. కానీ ప్రతిసారీ లాగానే ఈ సారి షాపింగ్ చేసేటప్పుడు బ్యాంక్ డిస్కౌంట్, EMI, నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ప్రయోజనాలను పొందుతారు.
ఈ సారి సేల్ లో స్మార్ట్ టీవీ మోడళ్లపై 75 శాతం వరకు తగ్గింపు, రిఫ్రిజిరేటర్లపై 70 శాతం వరకు తగ్గింపు, ఇతర ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపు ప్రయోజనం పొందుతారు. ఇది కాకుండా, మీరు ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్ ఉత్పత్తులను కొనుగోలు చేయడంపై 60 శాతం వరకు తగ్గింపు ప్రయోజనం పొందుతారు. ఈ సేల్ సందర్భంగా ఈసారి 6 కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. Motorola, Vivo, Samsung, Realme, Infinix ఇతర కంపెనీల నుండి చౌక ధరలకు స్మార్ట్ఫోన్లను పొందుతారు.