WhatsApp: మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp కాల్ల సమయంలో వినియోగదారుల IP చిరునామాలను రక్షించే లక్ష్యంతో కొత్త ఫీచర్ పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ వాట్సాప్ వినియోగదారులకు వారి కమ్యూనికేషన్లకు అదనపు భద్రత, గోప్యతను అందిస్తోంది. సెక్యురిటీ సెట్టింగ్‌ల స్క్రీన్‌లో కొత్త “అడ్వాన్స్ డ్” ఆప్షన్ ఉంచింది. ఈ విభాగంలో వినియోగదారులు “ప్రొటెక్ట్ IP అడ్రస్ ఇన్ కాల్స్ ” ఎంపికను యాక్సెస్ చేయవచ్చు, ఇది వాయిస్, వీడియో కాల్ల భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫీచర్ యాక్టివేట్ అయినప్పుడు, కాల్లో పాల్గొనే ఇతర వ్యక్తులు మీ జియోలొకేషన్, IP చిరునామాను అర్థం చేసుకోకుండా నిరోధించడానికి WhatsApp మరింత పటిష్టమైన చర్యలు తీసుకోనుంది. మీ పరికరం నుండి వచ్చే అన్ని కాల్లు ప్లాట్‌ఫారమ్ సర్వర్ల ద్వారా సేఫ్ చేయబడతాయి.
ఇంకా, ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేయడం వల్ల ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌లో మీ సమాచారం రక్షించబడుతుంది. కమ్యూనికేషన్లు సురక్షితంగా, ప్రైవేట్‌గా ఉండేలా చూస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు నమ్మకం లేని వ్యక్తులతో పరస్పర చర్యలకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ IP అడ్రస్ ప్రొటెక్షన్ ఫీచర్ ప్రస్తుతం టెస్ట్‌ఫ్లైట్ యాప్ ద్వారా iOS కోసం తాజా WhatsApp బీటా అప్డేట్ను ఇన్స్టాల్ చేసిన బీటా టెస్టర్ల ఉపసమితికి అందుబాటులో ఉందని గమనించాలి.