»How Much Fare Of Kacheguda To Yesvantpur And Vijayawada To Chennai
Vande Bharat Express: కాచిగూడ-యశ్వంత్ పూర్, బెజవాడ- చెన్నై టికెట్ ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తోన్నాయి. కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్, విజయవాడ నుంచి చెన్నై వరకు వందేభారత్ రైళ్లను రేపు (ఆదివారం) ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
How Much Fare Of Kacheguda To Yesvantpur And Vijayawada To Chennai
Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్, విజయవాడ నుంచి చెన్నై రేపు స్టార్ట్ కాబోతుంది. హైదరాబాద్ నుంచి బెంగళూర్ వెళ్లే వారికి ప్రయాణ సమయం తగ్గనుంది. అలాగే విజయవాడ (Vijayawada) నుంచి చెన్నై వెళ్లే వారికి కూడా టైమ్ రిడ్యూస్ అవుతుంది.
కాచిగూడ యశ్వంతపూర్ వందేభారత్ రైలు బుధవారం తప్ప అన్నీ రోజులు అందుబాటులో ఉంటుంది. ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ జంక్షన్ వద్ద దింపుతుంది. 610 కిలోమీటర్ల ప్రయాణం కేవలం 8.30 గంటల్లో పూర్తి అవుతుంది. 6.49కి పాలమూరు, 8.24కి కర్నూలు సిటీ, 10.44కి అనంతపురం, 11.14కి ధర్మవరం జంక్షన్ స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడ నుంచి యశ్వంతపూర్ చైర్ కార్ టికెట్ ధర రూ.1600 కాగా.. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.2915గా ఉంది.
మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంతపూర్ నుంచి రైలు బయల్దేరుతుంది. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరనుంది. 4.59 గంటలకు ధర్మవరం, 5.29 గంటలకు అనంతపురం, 7.50 గంటలకు కర్నూలు సిటీ, 9.34 గంటలకు మహబూబ్ నగర్ స్టేషన్లలో నిమిషం చొప్పున ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో చైర్ కార్ ధర రూ.1540 కాగా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.2865గా ఉంది.
విజయవాడ నుంచి చెన్నైకి 517 కిలోమీటర్ల దూరం 6.40 గంటల్లో చేరుతుంది. మంగళవారం తప్ప మిగిలిన ఆరు రోజులు రైలు అందుబాటులో ఉంటుంది. ఉదయం 5.30 గంటలకు చెన్నైలో బయల్దేరుతుంది. మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుతుంది. 7.05 గంటలకు రేణిగుంట, 8.39 గంటలకు నెల్లూరు, 10.09 గంటలకు ఒంగోలు, 11.21 గంటలకు తెనాలి స్టేషన్లలో ఆగుతుంది. చైర్ కార్ టికెట్ ధర రూ.1320 కాగా ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.2540గా ఉంది. మధ్యాహ్నాం 3.20 గంటలకు విజయవాడ నుంచి చెన్నై తిరుగు ప్రయాణమై రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. చైర్ కార్ టికెట్ ధర రూ.1420 కాగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2630గా ఉంది. అన్నీ స్టేషన్లలో నిమిషం ఆగుతుంది. రేణిగుంటలో 5 నిమిషాలు ఆగుతుంది.