W.G: పెంటపాడు ప్రజాసంఘాల కార్యాలయం వద్ద సోమవారం రైతు సంఘం జిల్లా నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. డీజిల్, పెట్రోల్ కొరత కొద్దిరోజుల నుంచి ఉందని, గత శనివారం, ఆదివారంలో తీవ్ర రూపం దాల్చిందని ఈ కొరత వల్ల ట్రాక్టర్లు, కోత మిషన్లు, లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారు పెట్రోల్, డీజిల్ కొరత నివారించాలిని కోరారు.
W.G: పెంటపాడు గ్రామంలో జీవి కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఆయన అభినందించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ధర్మవరంలో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నియోజకవర్గ ఇంఛార్జ్ హరీష్ బాబు ఈ శిబిరాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు అవసరమైన పరికరాల ప్రాముఖ్యతను వివరించారు. వికలాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా వైద్య నిపుణులు కొలతలు సేకరిస్తున్నారు.
KRNL: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని రెండు రోజుల క్రితం ఆదోని 2 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై రామ్ నాథ్ సమయస్ఫూర్తితో కాపాడారు. రేడియో టవర్ ఎక్కిన యువకుడిని కౌన్సెలింగ్ ఇచ్చి చాకచక్యంగా కిందకు దించారు. ప్రాణాలు కాపాడిన పోలీసులను ఇవాళ హోళగుంద హెచ్ఎం ముత్తన్న ఘనంగా సన్మానించారు. కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ధర్మపాలన, దానగుణం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రత్యేకంగా ప్రసంగించారు.
ELR: ఉంగుటూరు నియోజకవర్గంలోని కూరెళ్లగూడెం, పూళ్ల, కైకరం గ్రామాల్లో ఉన్న పెట్రోల్ బంకులను సోమవారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంకుల్లో ఇంధన నిల్వలును ఇన్‌లెట్–అవుట్‌లెట్ వివరాలపై నిర్వాహకులను ప్రశ్నించి పరిస్థితిని సమీక్షించారు. అవసరానికి మించి ఇంధనం నిల్వ ఉంచితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.
PPM: ఏబీఎన్ ఛైర్మన్ రాధాకృష్ణపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ మహిళా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధా కృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని వారు కోరారు. మహిళలు అంటే కూటమి నాయకులకు గౌరవం లేదన్నారు.
NTR: కంచికచర్లలో ఇల్లు లేని పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం, ఇల్లు నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఒకే ఇంటిలో పలువురు కుటుంబాలు నివసిస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
AKP: అచ్యుతాపురం మండలం ఉప్పరంలో ఉపాధి హామీ పనులు నిలిపివేయడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము తెలిపారు. ఈ మేరకు సోమవారం అచ్యుతాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి హామీ పథకం వేతనదారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉపాధి కల్పించాలని లేదా భృతి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
VZM: బొబ్బిలి పట్టణంలోని వైశ్య భవనంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్ర ప్రదర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పి.రాజేశ్వరరావు కేవలం పెన్సిల్‌తో పేపర్ మీద ఎన్టీఆర్ నటించినటు వంటి వెయ్యి చిత్రాలను ప్రదర్శించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ASR: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం అమరావతి సంస్థానాధీశులు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాద్రి నాయుడు కేవలం ఒక జమీందారు మాత్రమే కాదని ఆయన ఒక గొప్ప సామజిక సంస్కర్త, కళాపోషకులు అని వైస్ ప్రిన్సిపాల్ కొండబాబు కొనియాడారు. అలాగే, ఆయన గొప్ప పరిపాలన దక్షుడని పేర్కొన్నారు.
SKLM: ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీ కూర్మనాథ స్వామిని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆయనను ఆశీర్వదించారు.
NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. 44 వినతులు స్వీకరించినట్లు అధికారులు తెలియజేశారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి పాల్గొని వినతి పత్రం అందజేశారు. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమైతే సంబంధిత వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సోమవారం వైసీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవికి వినతిపత్రం అందజేశారు. నాయకులు ఖలీల్, జింకల రామాంజనేయులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో డ్రైనేజీ, శానిటేషన్, సమస్యలు ఉన్నాయన్నారు. అధికారులు స్పందించి వార్డులో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.