• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిమ్‌ను ప్రారంభించిన ఎస్పీ

CTR: చిత్తూరు సాయుధ దళ కార్యాలయంలో ఆధునిక సదుపాయాలతో నవీకరించిన జిమ్‌ను ఎస్పీ తుషార్ శనివారం ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి శారీరిక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణ, విధి నిర్వహణలో మరింత సమర్థత సాధించేందుకు ఈ జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.

May 30, 2026 / 06:26 PM IST

49 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక

తూ.గో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో శనివారం రాజమండ్రిలోని జిల్లా ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 125 మంది అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరుకాగా 49 మంది ఎంపిక అయ్యారని వివరించారు.

May 30, 2026 / 06:20 PM IST

‘లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు’

W.G: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఇటువంటి పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.గీతాబాయి హెచ్చరించారు. సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.

May 30, 2026 / 06:14 PM IST

తుంగభద్ర నదిలో ఐదురుగు గల్లంతు

KRNL: తుంగభద్ర నదిలో శనివారం ఈతకు వెళ్లి ఐదురుగు గల్లంతయ్యారు. సత్యనారాయణ స్వామి పూజకు హాజరైన బంధువులు పూజ అనంతరం నదికి వెళ్లారు. నీటి లోతు అంచనా వేయలేక ప్రమాదానికి గురయ్యారు. గల్లంతైన వారిలో హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర, సతీశ్ (35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర(25), ధను(23), ఉరవకొండకు చెందిన సంధ్య (22) ఉన్నారు.

May 30, 2026 / 06:13 PM IST

‘కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి’

ELR: జిల్లాలో మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు విజయవంతంగా ముగిశాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వర్చువల్ విధానంలో క్లస్టర్ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

May 30, 2026 / 06:13 PM IST

నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి: ఎమ్మెల్యే

NTR: కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించబడిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం సందర్శించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆమె స్వామివారిని ప్రార్థించారు.

May 30, 2026 / 06:13 PM IST

ఘనంగా వీడ్కోలు పోలీసులకు కార్యక్రమం

 NTR: జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన 14 మంది పోలీసు అధికారులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులను శాలువాలతో సత్కరించారు. సుదీర్ఘకాలం ప్రజాసేవ చేసిన వారి సేవలను డీసీపీ కొనియాడారు.

May 30, 2026 / 06:11 PM IST

‘కార్యకర్తలకు అండగా ఉంటా’

NDL: చాగలమర్రిలో TDP కార్యకర్తలకు అండగా ఉంటానని ఆళ్లగడ్డ నియోజకవర్గం సీనియర్ నాయకుడు భార్గవ్ రామ్ అన్నారు. మండలంలోని చిన్న వంగలి గ్రామానికి చెందిన లక్కిరెడ్డి నరేంద్ర రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం భార్గవ్ రామ్ చిన్న వంగలి చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

May 30, 2026 / 06:07 PM IST

రైలు చోరీ కేసును చేదించిన పోలీసులు

BPT: చీరాల రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో చోరీకి పాల్పడిన నిందితుడిని చీరాల జీఆర్పీ పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. నిందితుడు సందీపన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అతడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు గొలుసు,సెల్ఫోన్‌తో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలు, దర్యాప్తు ద్వారా కేసును త్వరగా ఛేదించినట్లు పోలీసు చెప్పుకొచ్చారు.

May 30, 2026 / 06:05 PM IST

జూన్ 2న మోగా జాబ్ మేళా

SKLM: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జూన్ 2 న ప్రభుత్వ డీఎల్‌టీసీ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. సుధ శనివారం తెలిపారు. ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని, మొత్తం 240 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

May 30, 2026 / 06:02 PM IST

విశాఖకు రూ.1,500 కోట్ల ప్రాజెక్టులు: ఎంపీ

VSP: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖకి రూ.1,500 కోట్ల విలువైన మూడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మంజూరయ్యాయని ఎంపీ ఎం. శ్రీభరత్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన దిశా సమావేశంలో మాట్లాడారు. మధురవాడలో అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటల తాగునీటి సరఫరా,సెమీ బల్క్ వాటర్ సప్లై అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు.

May 30, 2026 / 06:02 PM IST

ఆదివాసీలకు తీరని అన్యాయం: సీపీఎం

ASR: కూటమి ప్రభుత్వంలో ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్స ఆరోపించారు. శనివారం అరకులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిన్న పాడేరు పర్యటనకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గిరిజన వికాసంపై ప్రకటన ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల హామీల అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

May 30, 2026 / 06:01 PM IST

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి

సత్యసాయి: ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కమిషనర్ శ్రీనివాసులతో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతి అర్జీకి సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

May 30, 2026 / 06:00 PM IST

పోలీస్ అధికారులతో ఎస్పీ సమీక్ష సమావేశం

KRNL: నేర నియంత్రణే లక్ష్యంగా గట్టిగా పని చేయాలని, IPL ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలపాలపై గట్టి నిఘా ఉంచాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

May 30, 2026 / 05:54 PM IST

జనసేన పార్టీలోకి ఎస్సీ, ఎస్టీ నాయకుల చేరికలు

E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో కోరుకొండ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై నాయకులు పార్టీలో చేరడం సంతోషకరమని ఎమ్మెల్యే బత్తుల పేర్కొన్నారు

May 30, 2026 / 05:50 PM IST