• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఈనెల 19న సామూహిక అక్షరాభ్యాసం

CTR: కాణిపాకంలో ఈనెల 19న సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు దేవస్థాన ఆస్థాన మండపంలో కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఇందులో పాల్గొనేవారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

April 17, 2026 / 08:11 AM IST

రాజానగరంలో మద్యం ‘ధరల’ దోపిడి

E.G: రాజానగరం నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. ప్రతి బాటిల్‌పై MRP కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్మిట్ రూమ్‌లలో లూజ్ మద్యం అమ్మకాలు, బిల్లులు ఇవ్వకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న సిండికేట్లపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

April 17, 2026 / 08:09 AM IST

నేడే విజయనగరంలో మినీ జాబ్ మేళా…

VZM: నేడు విజయనగరంలోని MR కాలేజ్లో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్స్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీలు సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. 10వ తరగతి, డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణులై, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వాళ్ళు అర్హులని పేర్కొన్నారు.

April 17, 2026 / 08:01 AM IST

ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రహదారుల అభివృద్ధి, పరిశ్రమలకు నీటి సరఫరా లభ్యతపై ప్రత్యేకంగా చర్చించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా లభించిన ఉద్యోగ అవకాశాలపై నివేదిక ఇవ్వాలని కోరారు.

April 17, 2026 / 08:00 AM IST

మైనర్ బాలికపై లైంగిక దాడి.. కేసు నమోదు

ఏలూరు 1వ పట్టణానికి చెందిన చింటూ అనే వ్యక్తి మైనర్ బాలికపై లైంగికపై దాడికి పాల్పడినట్లు రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. అలంకరణ పనులు చేసే నిందితుడు, ఏప్రిల్ 2న బాలికను విజయవాడ తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

April 17, 2026 / 07:52 AM IST

‘ఓటరు జాబితాలను పరిశీలించాలి’

AKP: ఓటరు జాబితాలను పరిశీలించి తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరి చేయించాలని పాయకరావుపేట పట్టణ పార్టీ అధ్యక్షుడు వై. వరహాల బాబు సూచించారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివరాం పాల్గొన్నారు.

April 17, 2026 / 07:48 AM IST

13 మద్యం బాటిళ్లు స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

KDP: సిద్దవటం పరిధిలోని లింగంపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 13 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు SI హారిక తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. అక్రమ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో గురువారం దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు.

April 17, 2026 / 07:42 AM IST

కూటమి పాలనలో రైతుకు కన్నీరే: కాకాణి

NLR: కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని గురువారం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలో వరిగొండలో పర్యటించిన ఆయన గతంలో ధాన్యం పుట్టి రూ.25 వేలుంటే, గిట్టుబాటు ధర లేక రూ. 16 వేలకు అమ్మి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

April 17, 2026 / 07:41 AM IST

మహిళా రక్షణే లక్ష్యం: సీఐ తిరుమలరావు

VSP: మహిళలు, విద్యార్థినుల భద్రతే పోలీసుల ప్రాధాన్యమని సీఐ తిరుమలరావు అన్నారు. కేజీబీవీ పాఠశాలలో గురువారం జరిగిన అవగాహన సదస్సులో సైబర్ నేరాలు, ఈవ్‌టీజింగ్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘దిశ’ యాప్ అత్యవసర సమయంలో రక్షణగా పనిచేస్తుందని వివరించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. అనుమానాస్పద ఘటనలను 100/112కు తెలియజేయాలని చెప్పారు.

April 17, 2026 / 07:40 AM IST

ఇద్దివానిపాలెం ఓటర్లకు అలర్ట్.. లిస్ట్ వచ్చేసింది!

SKLM: ఇద్దివానిపాలెంలో గురువారం ప్రత్యేక గ్రామసభనిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక అధికారి కె. శ్రీనివాసరావు, సెక్రటరీ పంచాయతీ తుది ఓటర్ జాబితాను విడుదల చేశారు. గ్రామ ప్రజల సమక్షంలో లిస్ట్ను ప్రదర్శించి వివరాలను చూపించారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు, మార్పుల గురించి చర్చించారు.

April 17, 2026 / 07:36 AM IST

సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల కట్టడిపై ప్రజలకు అవగాహన

CTR: పుంగనూరు మండలం బయలుగానిపల్లిలో ప్రజలకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల కట్టడిపై పోలీసులు అవగాహన కల్పించారు. ఎస్సైలు ఆన్సర్ బాషా, కేవీ రమణ మాట్లాడుతూ.. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

April 17, 2026 / 07:31 AM IST

కమీచనర్ ఆద్వర్యంలో ఎమ్మెల్యే‌కు సెల్ఫ్ ఎన్యూమరేషన్

VZM: రాజాం MLA కొండ్రు మురళీమోహన్ గురువారం స్దానిక TDP కార్యాలయంలో మునిసిపల్ కమీషనర్ రామచంద్రరావు ఆద్వర్యంలో జనగణన-2027లో భాగంగా సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి జనాభా గణన అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్ల స్దితిగతులు, వసతులు, ఇతర కుటుంబ వివరాలను ఎటువంటి భయం లేకుండా అధికారులకు ఖచ్చితంగా తెలియజేయాలని అన్నారు.

April 17, 2026 / 07:31 AM IST

స్డాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్

KKD: డిప్యూటీ సీఎం పవన్, నిహారికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్‌ను కాకినాడ వన్‌ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జనసేన కార్యకర్త వెంకటకృష్ణ ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 62/2026 U/S 356(2), 353(2), 79 BNS, 67 ITA యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జోక్స్ పేరుతో ఎవరినైనా కించపరిస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు.

April 17, 2026 / 07:20 AM IST

విజయవాడ వెస్ట్ బైపాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

క‌ృష్ణా: విజయవాడ వెస్ట్ బైపాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. కానూరుకి చెందిన జగదీష్ HYDలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సెలవుల నిమిత్తమై ఇంటికి వచ్చి HYD వెళుతుండగా గురువారం ఉదయం వెదురుపావులూరు టోల్ గేట్ దాటిన తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

April 17, 2026 / 07:20 AM IST

‘భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు’

SKLM: భార్యను తుపాకీతో చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం జడ్జి కె. కిషోర్ బాబు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. మెళియాపుట్టి M భరణికోటకి చెందిన ఎస్ .పద్మను భర్త జగ్గారావు 2021 లో నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు SP తెలిపారు.

April 17, 2026 / 07:18 AM IST