CTR: శాంతిపురం మండలం టి. కొత్తూరు గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సీఐ శ్రీ మల్లేష్ యాదవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రహదారి భద్రతా నియమాలు, మహిళల భద్రత, నేరాలు, మత్తుపదార్థాల దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ నైతిక విలువలు కలిగి ఉండాలని సీఐ వివరించారు.
TPT: సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏడు మండలాల అధ్యక్షులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనిపాక లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
KRNL: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తుగ్గలి మండలం లంకాయపల్లి గ్రామానికి చెందిన హరికృష్ణను పత్తికొండ మాజీ MLA కంగాటి శ్రీదేవమ్మ ఇవాళ పరామర్శించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆమె వెంట పార్టీ నాయకులు అమర్నాథ్ రెడ్డి, తాండా బాబు నాయక్ తదితరులు ఉన్నారు.
పల్నాడు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడం కట్టమైతే, ఇంటి నుంచే మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కడపలోని బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. SV. ఇంజనీరింగ్ కాలేజీ, బాలాజీ నగర్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 27 నుంచి మే 16 వరకు కంప్యూటర్ శిక్షణతో పాటు డ్రాయింగ్, డాన్స్, మ్యాజిక్, పాటలు వంటి వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ప్రకాశం: కొండపి (M) నేతివారి పాలెం పంట పొలాల్లో పేకాట శిబిరంపై ఆదివారం స్థానిక పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 49,320, 8 బైకులు, 7 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకాలానికి ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై త్యాగరాజు హెచ్చరించారు.
W.G: భీమవరం పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో యనమదుర్రు ట్రైన్ వంతెన కింద ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక శకటంతో పాటు సిబ్బంది చేరుకొని మంటలను నియంత్రణలోకి తెచ్చారు. అగ్నికీలలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ వ్యాపించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ELR: పేద విద్యార్ధుల విద్యాభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి చేయూతనివ్వాలని MLC జయమంగళ వెంకటరమణ తెలిపారు. ఓ ట్రస్ట్ ఛైర్మన్ అట్లూరి భవాని ప్రసాద్ ఆర్థిక సహకారంతో మండలంలోని పులపర్రుకు చెందిన బీటెక్ విద్యార్ధిని జాహ్నవికి MLC జయమంగళ వెంకటరమణ లాప్ టాప్ బహుకరించారు. విద్యార్ధులు, గ్రామస్థులకు సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు.
SKLM: రసాయన ఎరువులు వాడకం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, సేంద్రియ వ్యవసాయమే ఆరోగ్యానికి రక్షణ అని ధరణిపుత్ర ఆర్గానిక్స్ డెవలప్మెంట్ ఫార్మర్స్ సొసైటీ ఛైర్మన్ ఉమామహేశ్వరరావు అన్నారు. నరసన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. రసాయన రహిత వ్యవసాయం, జీవామృతం, ఘన జీవామృతం వంటి పద్ధతులను అవలంబించాలని రైతులకు సూచించారు.
VZM: జిల్లా పోలీసు శాఖలో డీ.సీ.ఆర్.బీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తూ, గుండె పోటుతో ఆకస్మికంగా మరణించిన ఎ. జగదీశ్వర రావు భౌతికకాయాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సందర్శించారు. అనంతరం పూలమాల వేసి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. రూ.లక్ష కుటుంబ సభ్యులకు అర్థిక సహాయం అందించారు.
GNTR: వట్టిచెరుకూరు మండల కేంద్రంలోని అద్దంకమ్మ అమ్మవారి దేవాలయంలో తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించగా భక్తులు భారీగా తరలి వచ్చి దర్శనం చేసుకున్నారు. గ్రామంలోని మహిళలు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
PLD: కారంపూడి మండల కేంద్రంలోని టూ టౌన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ముఖ్యమని పేర్కొంటూ.. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఆలయ సమీపంలో 5.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం భక్తుల కోసం నిత్యన్నదాన సత్రాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా పోలవరంలోకి ప్రవేశించిన పెద్దపులి జాడలను అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. రేడియో ట్రాకింగ్ ద్వారా దాని గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఒంటరిగా అటవీ ప్రాంతంలో ప్రజలు సంచరించవద్దని , పొలాల్లో పశువులు మేపే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. పెద్దపులి గమనానికి చెందిన ట్రాకింగ్ చిత్రాలను విడుదల చేశారు.
కృష్ణా: నాగాయలంకలో దేవాదాయ శాఖ సీజీఎఫ్ నిధులు రూ.60 లక్షలు, భక్తుల విరాళాలు రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీ భూనీళా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, లిఖిత ఇన్ఫ్రా ఛైర్మన్ గడ్డిపాటి శ్రీనివాసరావు, శీలం అశ్విన్ కుమార్ విచ్చేసి మహోత్సవంలో భాగస్వాములయ్యారు.