• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కళలకి పుట్టినిల్లు పాలకొల్లు: హీరో

W.G: కళలకు పుట్టినిల్లు పాలకొల్లు అని సినీ హీరో శ్రీకాంత్ అన్నారు. శనివారం రాత్రి పాలకొల్లులో ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నటుడికి శిక్షణ ఎంతో అవసరమన్నారు. పాలకొల్లులో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పి యువతను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.

April 12, 2026 / 10:26 AM IST

వేగంగా తుంగభద్ర జలాశయం మరమ్మతులు

ATP: జిల్లాకు సాగు, తాగునీరు అందించే తుంగభద్ర జలాశయం మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి. హోస్పేటలో చివరి క్రెస్ట్ గేటు తయారీ పనులు తుది దశకు చేరుకున్నాయి. 33 గేట్లలో ఇప్పటికే 26 అమర్చగా, మిగిలిన 7 గేట్లను ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే సీజన్ నాటికి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటి నిల్వకు సిద్ధం కానుందన్నారు.

April 12, 2026 / 10:25 AM IST

ఐపీఎల్ బెట్టింగ్‌కు యువత దూరంగా ఉండాలి: ఎస్ఎఫ్ఐ

PPM: గుమ్మలక్ష్మీపురంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి బి. అనిల్ మాట్లాడుతూ 2026 ఐపీఎల్ సీజన్ ప్రారంభంతో యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తెలిపారు. క్రికెట్‌ను ఆస్వాదించడమే కాకుండా కొంతమంది బెట్టింగ్‌లకు పాల్పడి డబ్బులు కోల్పోతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

April 12, 2026 / 10:23 AM IST

ఉపాధి పనుల్లో అక్రమాల వెలుగు..!

అన్నమయ్య: గాలివీడు మండలంలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలు బయటపడటంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ వెంకటరత్నం హెచ్చరించారు. సామాజిక తనిఖీల్లో ఉపాధి పనుల్లో రూ.17.29 లక్షలు, పంచాయతీరాజ్ పనుల్లో రూ.40 వేల అక్రమాలు గుర్తించగా, ఇప్పటివరకు రూ.55 వేల వసూలు చేశామన్నారు. మిగిలిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

April 12, 2026 / 10:21 AM IST

జిల్లాలో నేడు మాంసం ధరలు ఎలా ఉన్నాయంటే ?

పల్నాడు: నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ. 120 ఉండగా, స్కిన్ కేజీ రూ. 240-260, స్కిన్ లెస్ రూ. 270-280 వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 900-1000 మధ్య ఉంది. 100 కోడిగుడ్లు రూ. 600లుగా ఉన్నాయి. దాదాపు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఇదే ధరలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

April 12, 2026 / 10:19 AM IST

నేడు కోటవురట్లలో తగ్గిన చికెన్ ధరలు

AKP: కోటవురట్ల పరిసరాల్లో కోళ్ల ఉత్పత్తి పెరగడంతో చికెన్ ధరలు తగ్గాయి. ఆదివారం మార్కెట్‌లో బ్రాయిలర్ లైవ్ కిలో రూ.130, చికెన్ రూ.230, స్కిన్‌లెస్ రూ.240కు అమ్ముతున్నారు. బండ కోడి ధరలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. గత వారంతో పోలిస్తే కిలోకు రూ.40 నుంచి రూ.50 వరకు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. ఫారం కోడి గత వారం రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.160కు లభిస్తోంది.

April 12, 2026 / 10:17 AM IST

పాత వేదాయపాలెంలో రూ.5.03 కోట్లతో అభివృద్ధి పనులు

NLR: రూరల్ 22వ డివిజన్ పాత వేదాయపాలెంలో TDP నేత గిరిధర్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఈ డివిజన్ అభివృద్ధికి రూ.5.03 కోట్లు కేటాయించిందని, MLA శ్రీధర్ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గవ్యాప్తంగా వందల కోట్లతో పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నీటి సమస్య పరిష్కారానికి త్వరలోనే ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు.

April 12, 2026 / 10:16 AM IST

తిరుమలలో మహిళ అదృశ్యం

TPT: హైదరాబాద్‌కు చెందిన ఎన్. జానకి (58) శనివారం తిరుమలలో అదృశ్యమైంది. సాయంత్రం దర్శనం ముగించుకుని SKHT వెళ్లే 5358 నంబర్ బస్సు ఎక్కిన తర్వాత ఆమె ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు ఉండడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జానకిని ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే 8121842103 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

April 12, 2026 / 10:14 AM IST

శ్రీకాకుళం మీదుగా ప్రత్యేక రైళ్లు

SKLM: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఈ సందర్భంగా చర్లపల్లి-సంత్రగచి (నం.07517/18) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైలు ఈ నెల 16, 23, 30వ తేదీల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ రైలు జిల్లాలో శ్రీకాకుళం రోడ్డు, పలాస వంటి రైల్వే స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది.

April 12, 2026 / 10:12 AM IST

విజయవాడలో రేపు జాబ్ మేళా.. అర్హతలివే!

ఎన్టీఆర్: MG రోడ్డులోని పద్మజ సుజుకి కంపెనీలో ఈ నెల 13న కంపెనీ స్పెసిఫిక్ జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన 18-30 ఏళ్ల అభ్యర్థులు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13,000-25,000 వేతనం ఉంటుంది. మొత్తం 90 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

April 12, 2026 / 10:11 AM IST

రైలు ఎక్కుతూ జారిపడి.. నుజ్జు నుజ్జు అయిన కాలు..!

గుంటూరు: తెనాలి చినరావూరు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతూ జారిపడి చుండూరు మండలం వామనగుంటపాలెంకు చెందిన వెలగా శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో డెల్టా ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారీ పడడంతో ఆయన కాలు నుజ్జునుజ్జు అయింది. అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు గమనించి శ్రీనివాసరావును తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు.

April 12, 2026 / 10:07 AM IST

ప్రత్తిపాడు అభివృద్ధికి చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే

KKD: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులతో శనివారం సమీక్షా సమావేశం జరిగింది. నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చలు జరిగాయి. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

April 12, 2026 / 10:06 AM IST

సంతమాగులూరులో ‘చదవటం మాకు ఇష్టం’

బాపట్ల: సంతమాగులూరులో మండల కేంద్రంలోని స్థానిక శాఖ గ్రంథాలయంలో ఆదివారం ‘చదవటం మాకు ఇష్టం’ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథపాలకుడు బాదం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

April 12, 2026 / 10:02 AM IST

ఈనెల 20 వరకు దరఖాస్తుల గడువు పెంపు

CTR: జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో ఆరవ తరగతి, ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈనెల 20 కి పొడిగించినట్టు సమగ్ర శిక్ష ఏసీపీ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని ఏడు కేజీబీవీ పాఠశాలల్లో10 తేదీ వరకు ఆరవ తరగతికి 693, ఇంటర్ ఫస్టియర్‌కు 670 దరఖాస్తులు అందినట్టు ఆయన వెల్లడించారు. గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 12, 2026 / 10:02 AM IST

‘అంబేద్కర్ జయంతికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి’

కోనసీమ: పీ.గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బురుగుంట గ్రామంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు శనివారం రాత్రి పోలీసులు సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 14న జరగబోయే అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా SC నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులతో చర్చించి తగు సూచనలు అందించారు.

April 12, 2026 / 10:01 AM IST