ATP: గ్రామ స్వరాజ్య స్థాపనలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి కొనియాడారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని వైసీపీ తాజా మాజీ సర్పంచులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడంలో విశేష కృషి చేశారని ప్రశంసించారు.
CTR: ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి సూచించారు. అధిక లాభాల పేరుతో సోషల్ మీడియా ద్వారా మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు. నకిలీ యాప్‌లు, వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరితోనూ పంచుకోరాదని సూచించారు.
E.G: అనపర్తి రాయల్ సిటీ లేఔట్లో ఏప్రిల్ 12వ తేదీన జరగబోయే వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాట్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం పరిశీలించారు. ఎమ్మెల్యే కుమార్తె సనాతని, పాణ్యంఎమ్మెల్యే చరితారెడ్డి కుమారుడు జనార్దన్ రెడ్డిల వివాహం హైదరాబాదులో జరిగిన విషయం తెలిసిందే. అనపర్తికి సినీ, రాజకీయ ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చేయాలని కోరారు.
BPT: జిల్లా శాశ్వత కలెక్టరేట్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బాపట్ల-గుంటూరు రహదారిలో దీనికోసం 15 ఎకరాలు కేటాయించనున్నారు. ముందుగా 10 ఎకరాలు తీసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. అయితే మంత్రి పార్థసారథి స్థలాన్ని పరిశీలించి, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 15 ఎకరాలు ఎంపిక చేయాలని సూచించారు. త్వరలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు.
NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నైజాం గేట్ సెంటర్లో అమరావతి సంబరాలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాద్ మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తరం కాదని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి అంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ PGRSలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గంగానమ్మపేటలో వాటర్ టాక్స్ రద్దు, నందులపేటలో చేపల దుర్వాసన, అమరావతి ప్లాట్లలో పందుల సమస్యలపై అర్జీలు వచ్చాయి. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత శాఖలకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని తోట వారి వీధిలో సోమవారం దమయంతి (16) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఓ యువకుడితో చనువుగా మాట్లాడుతున్న విషయాన్ని గుర్తించిన తల్లితండ్రులు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు.
సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో సోమవారం ఏర్పాటు చేసిన ‘జలధార – నీటి భద్రత’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా జేసీబీ నడిపి పనులను ప్రారంభించడం విశేషం. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణలో సాగునీటి సంఘాల బాధ్యత కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
VSP: నగరంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నార్త్ జోన్ ఈఈ పద్మావతి తెలిపారు. జీవీఎంసీ పరిధిలో చలివేంద్రాలు, గ్రీన్ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడుతూ.. రానున్న మూడు రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
CTR: నగిరిలో పేదలకు ఇంటి స్థలాల కోసం సీపీఐ పార్టీ ధర్నా నిర్వహించింది. నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య అర్హులందరికీ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు స్వీపర్స్ కాలనీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీవో సమస్యలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ATP: కళ్యాణదుర్గం పట్టణ రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శ్రీకారం చుట్టారు. సొంత నిధులతో ప్రధాన కూడలి అయిన గాంధీ సర్కిల్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మహాత్ముని నూతన విగ్రహంతో పాటు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఆయా విగ్రహాల తయారీ సైతం పూర్తయింది.
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి సారవకోట మండలంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం పర్యటించారు. ఈ మేరకు సారవకోట తహసీల్దార్ నూతన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.1.75 కోట్ల నిధులతో కార్యాలయం నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక గ్రామస్తులు తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
SKLM: వజ్రపు కొత్తూరు మండలం గోవిందపురంలోనిప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు చేరాలని ప్రిన్సిపల్ బడా వెంకట్ మోహన్ విద్యార్థులకు అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులతో అడ్మిషన్ డ్రైవ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యతోపాటుగా క్రమశిక్షణ ఉంటుందన్నారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. భవిష్యత్తులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీల్లో పెరుగుతున్న అదనపు వార్డులపై నాయకులకు అవగాహన కల్పించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, బలోపేతంపై చర్చించారు.