చిత్తూరు జిల్లాలోని సాక్షర సేవా కేంద్రాల్లో నాణ్యమైన సేవలు అందుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాక్షర సేవలు లక్ష్యం 12 వేలుగా నిర్ణయించగా, 9,866 మంది రైతులకు గాను 9,275 హెక్టార్లకు సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలు ముందు వరుసలో ఉండగా, చిత్తూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు.
AKP: కసింకోట మండలం బయ్యవరంలో ఇవాళ హజరత్ మదీనా ఔలియా ఉరుసు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలను ప్రతి ఏటా జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలకు పలు ప్రాంతాల నుంచి ముస్లింలతో పాటు హిందువులు కూడా వచ్చి మొక్కుల తీర్చుకుంటారని తెలిపారు.
E.G: డా.బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఏప్రిల్ 5న, అంబేడ్కర్ 135వ జయంతి ఏప్రిల్ 14 వేడుకలను రాష్ట్ర స్థాయి కార్యక్రమాలుగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. నగరంలో జరిగే ఈ కార్యక్రమాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కలెక్టర్ కోరారు.
ప్రకాశం: రాచర్ల (మం) నెమలిగుండ్లలో రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు. తెప్పోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామంలో బాదం పాలు తాగిన సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. జాతర సందర్భంగా తక్కువ ధరకు అమ్మిన పాలు తాగిన వారికి జ్వరం, వాంతులు, విరోచనాలు వచ్చాయి. బాధితులు స్థానిక క్లినిక్‌లకు చేరగా, అధికారులు వెంటనే స్పందించి క్లినిక్లను మూసివేసి వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ELR: దెందులూరు మండలం సింగవరం పరిధిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రం విలుప్పురం జిల్లాకు చెందిన అన్నామలై శివరాజ్ (37) దుర్మరణం చెందాడని SI శివాజీ తెలిపారు. తమిళనాడు నుంచి వరి కోత యంత్రంతో నల్లజర్ల వెళుతున్న వాహనంలో నుంచి దిగి రహదారి దాటుతుండగా ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ట్రాలీ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
AKP: మునగపాక మండలం కుంచవానిపాలెంలో పి.పారుపల్లి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు శుక్రవారం ఛేదించారు. పారుపల్లిని అతని భార్య పరమేశ్వరి హత్య చేసినట్లు విచారణలో పోలీసులు నిర్ధారించారు. మద్యానికి బానిసైన పారుపల్లి తనను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో ఈనెల 1వ తేదీ రాత్రి గొంతు నిలిమి హత్య చేసినట్లు ఆమె అంగీకరించిందని ఎస్సై సీఐ ధనుంజయ నాయుడు తెలిపారు.
KDP: కొండాపురం మండల పరిధిలోని తాళ్ల ప్రొద్దుటూరు గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మంజునాథ శుక్రవారం తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. గురువారం రాత్రి పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని నరసింహా, దేవిరెడ్డి పవన్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కౌంటర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
సత్యసాయి: హిందూపురంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో ఆదివారం జిల్లా జూనియర్ బాలికల ఫుట్‌బాల్ జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు జేవీ అనిల్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మండల ఫుట్‌బాల్ క్లబ్ నుంచి ధ్రువపత్రం తీసుకురావాలని సూచించారు. వివరాలకు కార్యదర్శి మహమ్మద్ సలీమ్‌ను నంబర్ 8099598958 ను సంప్రదించాలని కోరారు.
W.G: భీమవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శుక్రవారం పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని అన్నారు. 9 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం: మద్దిపాడు(మం) గుండ్లపల్లిలో శుక్రవారం దూదేకుల కాశం అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రానైడ్ ఫ్యాక్టరీలో స్టోన్ కటింగ్ ఆపరేటర్‌గా పని చేస్తున్న కాశం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
AKP: తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ జిల్లాలో ఇవాళ అన్ని ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మాట్లాడుతూ.. ఆలయ ఛైర్మన్ బీఆర్ నాయుడుని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అన్ని నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ATP: ఏపీఎస్పీడీసీఎల్‌లో నకిలీ ఐటీఐ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లపై వేటు పడింది. ఐటీఐ చదవకుండానే సర్టిఫికెట్లు సమర్పించినట్లు విచారణలో తేలడంతో వారిని తొలగించాలని సీఎండీ శివశంకర్ లోతేటి ఆదేశించారు. వీరిలో అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు. అత్యధికంగా కడపలో 38 మందిపై చర్యలు తీసుకున్నారు.
SKLM: తిరుమల పవిత్రతను కాపాడే దిశగా TTD ఛైర్మన్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైసీపీ ఆమదాలవలస సమన్వయకర్త రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. BR నాయుడు TTDను అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఇవాళ YCP శ్రేణులు వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేయాలన్నారు.
విశాఖపట్నం-రాయ్ పూర్ మధ్య ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సంబల్‌పూర్ డివిజన్‌లోని మునిగూడ-బిస్సాంకటక్ మధ్య వంతెన ఆధునీకరణ పనులు చేపట్టడమే దీనికి కారణమన్నారు. ఏప్రిల్ 9, 11, 13, 20, 23, 25 తేదీల్లో రైలు నంబర్లు (58528/58527) రెండు వైపులా నడవవని తెలిపారు.