• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టులకు రేపు ఉచిత వైద్య శిబిరం: కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తిలోని షాదీ మహల్‌లో ఈనెల 9న అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి రక్త పరీక్షలు, ఈసీజీతో పాటు జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ వంటి నిపుణులు సేవలు అందిస్తారని ఆయన పేర్కొన్నారు.

April 8, 2026 / 10:44 AM IST

పోలీసుల అవగాహన సదస్సు

ELR: జంగారెడ్డిడెంలోని 6, 7, 8 వార్డులకు సంబంధించిన ప్రజలతో నిన్న రాత్రి ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేవిధంగా అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సుభాష్, ఎస్సై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

April 8, 2026 / 10:38 AM IST

డి.ఎడ్ కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం

అన్నమయ్య: 2026–27 విద్యా సంవత్సరానికి డి.ఎడ్ కోర్సు ప్రవేశాల కోసం DEECET-2026 నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ డా. కె. సుబ్రహ్మణ్యం తెలిపారు. రాయచోటి బాలిక ఉన్నత పాఠశాలలో పోస్టర్లను ఆవిష్కరించారు. దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 15 కాగా, పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయన్నారు.

April 8, 2026 / 10:32 AM IST

మాజీ సర్పంచ్ దంపతులకు ఘన సత్కారం

AKP: ములకలాపల్లి గ్రామ పంచాయితీ మాజీ సర్పంచ్ అన్నపూర్ణ, రామ కొండలరావు దంపతులను గ్రామ యువత,పెద్దలు ఘనంగా సత్కరించారు. పదవీకాలం ముగియడంతో మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఉప సర్పంచ్ కర్రి బలరాం,వార్డు సభ్యులను సాలువాలతో అభినందించారు. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను గ్రామస్తులు కొనియాడారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.

April 8, 2026 / 10:29 AM IST

కాళ్ల మండలంలో డ్రోన్లతో నిఘా: ఎస్ఐ

W.G: కాళ్ల మండలంలోని అనుమానిత ప్రాంతాల్లో నిన్న డ్రోన్లతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఏలూరుపాడు, సీసలి, కాళ్ల తదితర గ్రామాల్లో ఈగల్ బృందంతో కలిసి తనిఖీలు నిర్వహించినట్లు ఎస్ఐ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పేకాట, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు.

April 8, 2026 / 10:23 AM IST

మార్కెట్ యార్డ్ బడ్జెట్‌‌పై కీలక సమావేశం

ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాలపై బుధవారం కీలక సమావేశం నిర్వహించింది. మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాబోయే ఏడాదికి సంబంధించిన ఆదాయ వ్యయాల గురించి కూలంకషంగా చర్చించారు. రైతుల సంక్షేమం, యార్డ్ అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని ఛైర్‌పర్సన్ తెలిపారు.

April 8, 2026 / 10:23 AM IST

పిచ్చికుక్క దాడి .. ముగ్గురికి తీవ్రగాయాలు

SKLM: పొందూరు మండలం కేంద్రంలో పిచ్చికుక్క దాడిలో పట్టణానికి చెందిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం సాయంత్రం వీధి కుక్క వారి పై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పొందూరు ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. 2 రోజుల కిందట పిచ్చికుక్క దాడిలో 9 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

April 8, 2026 / 10:09 AM IST

జిల్లాలో రూ.29 కోట్ల విద్యుత్ బకాయిలు.!

KDP: జిల్లాలో 4 విద్యుత్ డివిజన్‌ల పరిధిలో ప్రస్తుతం 9,50,675 విద్యుత్ సర్వీసుల నుంచి రూ.29 కోట్ల బకాయిలు ఉన్నాయి. డివిజన్‌ల వారీగా ఉన్న కడపలో 2,83,976 సర్వీసుల నుంచి రూ.10.11 కోట్లు, మైదుకూరులో 2,26,892 సర్వీసుల నుంచి రూ.8కోట్లు,  ప్రొద్దుటూరులో 3,01,810 సర్వీసుల నుంచి రూ.10.60 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిపారు.

April 8, 2026 / 10:08 AM IST

గోపాలపురం యూనిట్ APJAC ఛైర్మన్‌గా వెంకటేశ్వరరావు

E.G: గోపాలపురం యూనిట్ APJAC పున:వ్యవస్తీకరణ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జోడాల వెంకటేశ్వరరావు ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అలాగే సెక్రటరీగా బి.బుచ్చిబాబు, ట్రెజరర్ పి.పాపారావు, వైస్ ఛైర్మన్లుగా డి.మనోజ్ కుమార్, బి.ఐ.బెనర్జీ, డి.ప్రసన్న కుమార్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక జిల్లా APJAC ఛైర్మన్ మీసాల మాధవరావు సమక్షంలో జరిగింది.

April 8, 2026 / 09:59 AM IST

రేపు కాకినాడలో జాబ్ మేళా

కాకినాడ భానుగుడి కూడలిలోని సైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఈ నెల 9న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డైరెక్టర్ జంగం బాజ్జీ తెలిపారు. టీవీఎస్ మోటార్స్, టాటా ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ట్రెండ్స్, కందుకూరి సిల్క్స్‌లో వివిధ పోస్టులకు ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు.

April 8, 2026 / 09:58 AM IST

నేడు పి.గన్నవరంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

కోనసీమ: పి.గన్నవరంలో నేడు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలను పార్టీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10:30 గంటలకు అంబాజీపేటలోని గంగలకుర్రు గ్రామ పంచాయతీ వద్ద రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేస్తారు. ఉదయం 11:30 గంటలకు అయినవిల్లిలో పోతుకుర్రు గ్రామ పంచాయతీ వద్ద పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు.

April 8, 2026 / 09:57 AM IST

నేడు బీజేపీ క్రియాశీలక సభ్యులతో ఎంపీ సమావేశం

AKP: జిల్లాకు చెందిన బీజేపీ క్రియాశీలక సభ్యులతో ఎంపీ సీఎం రమేష్ బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యాచరణ, గ్రామస్థాయి బాధ్యతలు తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు.

April 8, 2026 / 09:56 AM IST

లాప్‌టాప్ చోరీలపై ప్రయాణికులకు అవగాహన

VZM:  రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు లాప్ టాప్ చోరీలకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయాణికులకు విజయనగరం రైల్వేస్టేషనులో జీఆర్పీ ఎస్ఐ వి. బాలాజీరావు మంగళవారం అవగాహన కల్పించారు. లాప్‌‌టాప్‌లో విలువైన సమాచారం పాడవకుండా, గోప్యంగా ఉండేందుకు లాక్ చేసుకునే విధానంపై ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేశారు .కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

April 8, 2026 / 09:48 AM IST

‘ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలి’

VZM: రాజకీయ పార్టీ నాయకులు ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలని ఎమ్మార్వో ఎం.శ్రీను, ఎన్నికల డీటీ బి.గౌరీశంకర్ కోరారు. బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. నూతన ఓటర్ల చేర్పునకు, నకిలీ, డబుల్ ఎంట్రీ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగింపునకు సహకరించాలని పేర్కొన్నారు. 

April 8, 2026 / 09:46 AM IST

శాంతియుతంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

E.G: ధర్మవరంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి మంగళవారం సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా బాబా సాహెబ్ ఆశయాలను పాటించాలన్నారు. పిల్లలకు అంబేడ్కర్ సిద్ధాంతాలపై పరీక్షలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని గ్రామస్థులకు తెలిపారు. ఆయన గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు.

April 8, 2026 / 09:42 AM IST