• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘చెరువుకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలి’

SS: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎములపల్లి చెరువు సమీపంలో రహదారి పరిస్థితి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. చెరువు పక్కన ఉన్న మట్టి క్రమంగా దిగజారిపోవడంతో రోడ్డు అంచు బలహీనపడింది. రక్షణ గోడ లేకపోవడంతో వాహనదారులు చెరువులో పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెరువుకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

April 12, 2026 / 03:10 PM IST

దాతల సహకారం తో ట్రాఫిక్ స్టాపర్ బోర్డులు

E.G: దాతల సహకారంతో ట్రాఫిక్ స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం డీఎస్పీ బి.విద్య అన్నారు. ఆదివారం మండపేట టౌన్ పోలీస్టేషన్ వద్ద వీటిని ఆమె ప్రారంభించారు. డీఎస్పీ విద్య మాట్లాడుతూ.. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు దాతల సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

April 12, 2026 / 03:08 PM IST

అమరావతి వోఆర్ఆర్‌లో 19 ఇంటర్‌చేంజ్‌లు

GNTR: అమరావతి 190 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ మార్గంలో వాహనాలు ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి వీలుగా కేవలం 19 చోట్ల ఇంటర్‌చేంజ్‌లు నిర్మించనున్నారు. మొదట 17 పాయింట్లను ప్రతిపాదించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆ సంఖ్యను 19కి పెంచారు. ప్రస్తుతం ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలన దశలో ఉంది.

April 12, 2026 / 03:04 PM IST

తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ‘ఈబస్’ సిస్టమ్..!

VSP: పెద్ద వాల్తేరు ప్రభుత్వ చెస్ట్ ఆస్పత్రిలో రూ.1.5 కోట్ల విలువైన ‘ఈబస్’ (EBUS) సిస్టమ్‌ను మంత్రి సత్య కుమార్ ప్రారంభించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇన్ఫెక్షన్ల గుర్తింపునకు ఇది ఎంతో కీలకం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి అధునాతన సదుపాయం రావడం ఇదే తొలిసారి అని సూపరింటెండెంట్ సునీల్ కుమార్ తెలిపారు.

April 12, 2026 / 03:00 PM IST

బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన ఎంపీ

SKLM: ఎచ్చెర్ల మండలం జరజాం పంచాయతీలో టీడీపీ కార్యకర్త జరుగుల్ల లక్ష్మణరావు భార్య అన్నపూర్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆమెకు సీఎంఆర్ఎఫ్ కింద రూ.1,28,000 చెక్కును ఆదివారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

April 12, 2026 / 03:00 PM IST

‘వైసీపీ ఊసరవెల్లి ఆరోపణలు ప్రజలు నమ్మరు’

VZM: మాజీ సీఎం జగన్‌పై గతంలో బొత్స, ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలను గుర్తు చేస్తూ ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు చేస్తున్న ఊసరవెల్లి ఆరోపణలను ప్రజలు నమ్మరని, అందుకే ప్రజలకు మరోసారి గుర్తు చేస్తిన్నామన్నారు.

April 12, 2026 / 03:00 PM IST

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల

మార్కాపురంలోని కొండేపల్లి రోడ్డులో శ్రీ పట్టాభిరామస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తుల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కందుల నారాయణరెడ్డి తన సతీమణి వసంతమ్మతో కలిసి పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు.

April 12, 2026 / 02:56 PM IST

రేపల్లెలో CMRF చెక్కుల పంపిణీ

BPT: రేపల్లెలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో 33 మందికి CMRF మంజూరైంది. మంజూరైన మొత్తం రూ.32,82,393 చెక్కులను స్థానిక టీడీపీ నేతలు లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఆపత్కాలంలో ఆదుకున్న ప్రభుత్వానికి, మంత్రికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

April 12, 2026 / 02:42 PM IST

విడపనకల్లప్ప స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

ATP: విడపనకల్‌లో కురుబల ఆరాధ్యదైవం విడపనకల్లప్ప స్వామి గుడికట్ల ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. సాంప్రదాయ ఉత్సవాలు భక్తిభావంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

April 12, 2026 / 02:40 PM IST

మడికి గ్రామంలో సీఐ వాహన తనిఖీలు

కోనసీమ: ఆలమూరు మండలం మడికి గ్రామంలో ఆదివారం మధ్యాహం సీఐ విద్యాసాగర్ హైవే మొబైల్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. హైవేపై రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి ట్రాఫిక్ నిబంధనలు వివరించి, చట్టపరంగా చర్యలు తీసుకుని సరైన మార్గంలో వెళ్ళమని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలో అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 12, 2026 / 02:35 PM IST

ఉగాది పురస్కార గ్రహీత రమణమూర్తికి సత్కారం

NDL: ఇటీవల ప్రభుత్వంచే ఉగాది పురస్కారం అందుకున్న నంద్యాలకు చెందిన సాహితీవేత్త వైష్ణవ వెంకటరమణ మూర్తిని కళారాధన సాంస్కృతిక సంస్థ కార్యాలయంలో కళారాదన, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. రమణమూర్తి అనేక వాక్యాలు రచించడమే కాకుండా పద్య సాహిత్య ప్రచురియానికి చేసిన సేవలు విశిష్టమైనవని ప్రశంసించారు.

April 12, 2026 / 02:32 PM IST

‘చందనోత్సవ టికెట్ల టెక్నికల్ సమస్యను పరిష్కరిస్తాం’

VSP: ఏప్రిల్ 20న సింహాచలం చందనోత్సవానికి సంబంధించి టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులు కొనుగోలు చేస్తున్నట్లు ఈవో వెంకట్రావు తెలిపారు. అయితే టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసే సమయంలో టెక్నికల్ సమస్య ఏర్పడినట్లు భక్తులు తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఈ విషయంపై టెక్నికల్ టీమ్‌తో సంప్రదింపులు జరిపామని, భక్తులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.

April 12, 2026 / 02:31 PM IST

మల్లాపల్లిలో రేపు ఉషశ్రీ చరణ్ పర్యటన

SS: జిల్లా వైసీపీ అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీ చరణ్ సోమవారం గోరంట్ల మండలంలోని మల్లాపల్లి పంచాయతీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటనను జయప్రదం చేయాలని మండల కన్వీనర్ పగడాల వెంకటేష్, టౌన్ కన్వీనర్ మేదర శంకర పిలుపునిచ్చారు.

April 12, 2026 / 02:31 PM IST

గ్రామ దేవత మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: పోలాకి మండలం కోరాడ లచ్చయ్య పేట గ్రామం శ్రీ శ్రీ శ్రీ గ్రామదేవత అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఆదివారం గ్రామస్థుల ఆహ్వానంతో ఎమ్మెల్యే రమణమూర్తి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు ఉన్నారు.

April 12, 2026 / 02:30 PM IST

గంజాయిపై గ్రామస్తులకు అవగాహన

VZM: ఎస్.కోట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్డవరంలో గంజాయి కట్టడిపై సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఆదివారం అవగాహన కల్పించారు. గ్రామాల్లో అక్రమంగా గంజాయి రవాణా చేసినా, విక్రయించిన, సేవించిన చట్టరీత్య నేరం అని తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

April 12, 2026 / 02:30 PM IST