KRNL: పెద్దకడబూరు మండలం బాపులదొడ్డిలో తాగునీటి కష్టాలతో ప్రజలు అల్లాడుతున్నారు. గ్రామ శివారుల్లోని పొలాల్లోని బోర్ వద్దకు తోపుడు బళ్లతో వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. బాపులదొడ్డి గ్రామ ప్రజలు గుక్కెడు మంచినీళ్ళు కోసం ఇన్ని కష్టాలు పడుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడన్నట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.
కృష్ణా: పామర్రులో జల్ జీవన్ మిషన్ పథకం కింద రూ.2.30 కోట్లతో నిర్మించిన భారీ నీటి సరఫరా ప్రాజెక్ట్‌ను MLA వర్ల కుమార్ రాజా సోమవారం ప్రారంభించారు. గంగానమ్మ గుడి వద్ద 1.50 లక్షల లీటర్ల ట్యాంక్, పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. రూ.2.80 లక్షలతో పంప్‌హౌస్‌ను కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌తో గ్రామస్తుల తాగునీటి సమస్యలు పూర్తిగా తొలగుతాయని పేర్కొన్నారు.
PDL: కలెక్టర్ సోమవారం మజ్జిగ ప్యాకెట్లను కలెక్టరేట్ ప్రాంగణంలో పంపిణీ చేశారు. వేసవి తాపానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు అందించారు. 11 గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ప్రజలెవరు బయట రావద్దని ఆమె తెలిపారు. ఉష్ణోగ్రత రోజు రోజుకి పెరుగుతున్న సందర్భంగా ఎండ తీవ్రతకు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
KDP: సింహాద్రిపురంలో మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం మంగళవారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. సమావేశాన్ని ఎంపీడీఓ కార్యాలయం సభ భవనంలో ఏర్పాటు చేశామన్నారు. మండల స్థాయి అన్ని శాఖల అధికారులు వారి శాఖల వివరాలతో హాజరు కావాలన్నారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు.
బాపట్లలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం సోమవారం ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని బాపట్ల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు, వేగేశన ఫౌండేషన్ ఛైర్మన్ వేగేశన నరేంద్ర వర్మ రాజు సహకారంతో, స్థానిక టీడీపీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ATP: ఈనెల 25న జరగనున్న పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్‌వో ఎ. మాలోల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 31 కేంద్రాల్లో 9,745 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు.
E.G: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి ఆశిష్ లాల్ కొవ్వూరులోని ఆయన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ నవనిర్మాణ దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు.
KRNL: ఆదోని మండల MEO-2గా మధిరె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగన్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మధిరె పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఫ్యాప్టో నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. రంగన్న మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంపు, బోధన నాణ్యత మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.
NTR: కంచికచర్ల మోడల్ ప్రైమ్ స్కూల్‌లో బడిబాట ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బాలాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బడి ఈడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, అంగన్వాడీలో 5 సంవత్సరాలు పూర్తైన పిల్లలు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను కూడా ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ప్రకాశం: పెద్దారవీడు మండల పోలీస్ స్టేషన్ ఎస్సైగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సైదులు బాబు సోమవారం ఎస్పీ కార్యాలయంలోని డీఎస్పీ డాక్టర్ యూ. నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి పూల కుండీని అందజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలతో వచ్చే ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని తెలిపారు.
NDL: సీఎం చంద్రబాబు 76వ పుట్టిన రోజు సందర్భంగా నంది కొట్కూరు పట్టణం నందు సహకార సొసైటీ ఛైర్మన్ షేక్ మూర్తు జావలి ఉచిత చలివేంద్రం ఏర్పాటు చేశారు. MLA జయసూర్య హాజరై, రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండాకాలం ప్రజల దాహార్తి తీర్చడమే కూటమి లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
VZM: ఈనెల 22న చీపురుపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎస్‌ఎస్‌సి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన 18-35 ఏళ్ల నిరుద్యోగులు అర్హులని 13 కంపెనీలు పాల్గొంటాయని అధికారులు ఇవాళ తెలిపారు. ఆసక్తిగల వారు రిజిస్ట్రేషన్ చేసి అవసరమైన పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు.
PPM: అర్హులైన దివ్యాంగులకు వారి అవసరాల మేరకు ప్రభుత్వం తరపున సహాయక ఉపకరణాలను అందజేస్తున్నామని కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా, పెద గుడబకు చెందిన భాగ్య లక్ష్మికి వీల్ ఛైర్, అలాగే వెంకటరాయుడు పేటకు చెందిన డి. లక్ష్మణరావుకు బ్లైండ్ స్టిక్‌ను కలెక్టర్ పంపిణీ చేశారు.
SKLM: నేర బాధితులు, జైలులో ఉన్న వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలకు సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలవడమే ‘నల్సా స్పృహ-2025’ పథకం లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక న్యాయ సేవా సదన్‌లో న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. సమాజంలో అపవాదు ఎదుర్కొంటున్న ప్రభావిత వర్గాలకు ఈ పథకంతో బహుముఖ మద్దతు లభిస్తుందన్నారు.
ASR: అడవులు తగలబడితే మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని జీకేవీధి మండలం ఆర్వీ నగర్ అటవీ రేంజ్ అధికారి వెంకటరావు అన్నారు. సోమవారం ఆర్వీ నగర్ సంతలో అటవీశాఖ ఆధ్వర్యంలో బీట్ అధికారులతో కలిసి అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అడవులకు వెళ్లేవారు నిప్పులు వేయరాదని సూచించారు.