• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి

PPM: రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ 5వ తేదీ ఆదివారం జిల్లాలో పర్యటిస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 2:00గంటలకు పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కావున కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

April 4, 2026 / 06:36 PM IST

యువతకు పీఎం ఇంటర్న్‌షిప్‌

GNTR: నిరుద్యోగులకు పీఎం ఇంటర్న్‌షిప్ మంచి అవకాశమని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. 18-25 ఏళ్ల లోపు టెన్త్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ చదివిన వారు అర్హులు. వీరికి 6-9 నెలల పాటు నెలకు రూ.9 వేల స్టైపెండ్‌, అదనంగా రూ.6వేలు, బీమా ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు, రూ.12 లక్షలు దాటిన ఆదాయం ఉన్నవారు ఏప్రిల్ 21లోపు pminternship.mca.gov.inలో దరఖాస్తు చేయాలి.

April 4, 2026 / 06:35 PM IST

కుక్కల నియంత్రణపై కమిషనర్ ఆదేశాలు

కర్నూలులో వీధి కుక్కల సమస్య నివారణకు చర్యలు వేగవంతం చేయాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను శనివారం ఆదేశించారు. డాగ్ షెల్టర్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. గార్గేయపురం డంప్ యార్డ్‌ను పరిశీలించిన ఆయన బయో మైనింగ్ వేగవంతం చేయాలని, స్వచ్ఛ సర్వేక్షన్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు.

April 4, 2026 / 06:31 PM IST

సీఐను సత్కరించిన బీజేపీ నాయకులు

ప్రకాశం: ఇటీవల రాయవరం దగ్గర జరిగిన బస్సు ప్రమాదం జరిగిన సమయంలో సకాలంలో స్పందించి ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన సీఐ సుబ్బారావును బీజేపీ నాయకులు శనివారం సత్కరించారు. సమాచారం అందుకున్న సీఐ సకాలంలో స్పందించి సహాయ చర్యలలో పాల్గొని పలువురు ప్రాణాలు కాపాడారు అంటూ ఆయనను అభినందిస్తూ శాలువాలు కప్పి సత్కరించారు.

April 4, 2026 / 06:30 PM IST

విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన

CTR: మిట్టూరు ప్రాంతంలోని ర్యాంకర్స్ స్కూల్‌లో శనివారం జరిగిన వార్షిక క్రీడోత్సవంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నిత్యబాబు పాల్గొని విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. సుమారు 400 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఆయన,హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు.

April 4, 2026 / 06:30 PM IST

ఆసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్

కడపలో గంజాయి, మత్తు పదార్థాల వాడకం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. టూ టౌన్ సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దాడుల నుంచి తప్పించుకునే వారిని పట్టుకోవడానికి అత్యాధునిక డ్రోన్లతో నిఘా పెట్టి జల్లెడ పడుతున్నారు.

April 4, 2026 / 06:30 PM IST

‘దళితుల సంక్షేమం కొరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి’

ELR: దేశవ్యాప్తంగా అనేక వివక్షలు ఎదుర్కొన్న దళితులపై నేటికీ దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఏలూరు ప్రజా సంఘాల కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దళితులకు రక్షణ కల్పించవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను సవరిస్తూ దళితుల రక్షణను ప్రశ్నార్ధకం చేస్తున్నారని ఆరోపించారు.

April 4, 2026 / 06:24 PM IST

రేపు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న మంత్రి

VZM: రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖపట్నం నుంచి పార్వతీపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

April 4, 2026 / 06:22 PM IST

గ్యాస్ ఏజెన్సీని పరిశీలించిన కలెక్టర్

SKLM: మండల కేంద్రంలోని సార్వకోట ఇండియన్ గ్యాస్ కంపెనీ తీరుపై కలెక్టర్ స్వప్నల్ దినకర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ పంపిణీ జరగాలని, ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయనతో పాటు తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో మురళీ, అధికారులు పాల్గొన్నారు.

April 4, 2026 / 06:18 PM IST

జిల్లాలో 8,013 చెరువుల అభివృద్ధి

VZM: భూగర్భ, ఉపరితల జలమట్టాలు పెంచేందుకు ప్రభుత్వం ఈ నెల 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల ‘జలధార’ కార్యక్రమం చేపడుతోందని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. చెరువుల పునరుద్ధరణ, కాలువల శుభ్రపరచడం, చెక్‌డ్యామ్‌లు, వంటి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలోని 8,013 చెరువులను అభివృద్ధి చేయాలన్నారు.

April 4, 2026 / 06:17 PM IST

కలెక్టర్‌తో ఎమ్మెల్యే రామాంజనేయులు భేటీ

GNTR: గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన సీ.ఎం.సాయికాంత్ వర్మను శనివారం కలెక్టరేట్‌‌లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే ప్రత్యేకంగా చర్చించారు.

April 4, 2026 / 06:11 PM IST

పన్నుల వసూళ్లలో తాడిగడపకు మొదటి స్థానం

కృష్ణా: తాడిగడప మున్సిపాలిటీ పన్నుల వసూళ్లను వేగవంతంగా నిర్వహించి, రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది. ఈ క్రమంలో పెనమలూరు మండలం పోరంకి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మున్సిపల్ సిబ్బందిని శనివారం అభినందించారు. తాడిగడప మున్సిపాలిటీలో నివాసం ఉంటున్న ప్రజలు సకాలంలో ఆస్తి పన్నులు చెల్లించి, మొదటి స్థానంలో నిలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు.

April 4, 2026 / 06:10 PM IST

టీటీడీ ఛైర్మన్‌పై వైసీపీ ఆగ్రహం

KRNL: టీటీడీ ప్రతిష్టకు మచ్చ తెచ్చిన వ్యక్తిని ఛైర్మన్‌గా కొనసాగించడం దారుణమని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి విమర్శించారు. తప్పు చేసిన కూటమి నేతలపై చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు వైఫల్యం చెందారన్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

April 4, 2026 / 06:10 PM IST

ఎమ్మెల్యే MS రాజు పీఏ ఇంట్లో తీవ్ర విషాదం

సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు వ్యక్తిగత సహాయకుడు రవికుమార్ తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయులు వీ.ఎన్. అంజినప్ప అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అంజినప్ప నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పుత్రశోకంతో ఉన్న రవికుమార్‌ను, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

April 4, 2026 / 06:10 PM IST

భూగర్భ జలాల పెంపుపై కలెక్టర్ ఆదేశాలు

NDL: జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు అమలు చేయాలని కలెక్టర్ రాజకుమారి శనివారం సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన, మ్యాపింగ్, వర్షపు నీటి నిల్వ, ప్రజల భాగస్వామ్యం కీలకమన్ని పేర్కొన్నారు. ఈనెల 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

April 4, 2026 / 06:08 PM IST