• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అమరావతికి ఎమ్మెల్యే శ్రావణి దీపహారతి

ATP. రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభించడంపై ఎమ్మెల్యే బండారు శ్రావణి హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ కూటమి నేతలతో కలిసి ఆమె దీపాలు వెలిగించి వేడుకలు జరిపారు. ఇది ప్రజా ప్రభుత్వం సాధించిన విజయం అని కొనియాడారు. రాజధానిపై వైసీపీ నేతలు విషం కక్కడం మానాలని హితవు పలికారు.

April 5, 2026 / 06:59 AM IST

రోడ్డుపై భారీ కొండచిలువ హతం

NLR: మనుబోలు కండలేరు వద్ద కొంతకాలంగా తిరుగుతున్న 8 అడుగుల కొండచిలువను శనివారం రాత్రి గ్రామస్థులు కొట్టి చంపారు. ఈ కొండచిలువ తరచూ రోడ్డుపైకి వచ్చి వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోందని స్థానికులు తెలిపారు. కండలేరు ప్రాంతంలో కొండచిలువ రావడం వల్ల భయాందోళనకు గురయ్యామని, అందుకే కర్రలతో కొట్టి చంపాల్సి వచ్చిందని గ్రామస్థులు పేర్కొన్నారు.

April 5, 2026 / 06:50 AM IST

నేటి నుండి తలుపులమ్మ అమ్మ వారి జాతర

E.G: తుని మండలం తలుపులమ్మ లోవ దేవస్థానంలో అమ్మ వారి వార్షిక జాతర మహోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 17 వరకు జరుగుతాయని ఈవో విశ్వనాథరాజు తెలిపారు. ఆదివారం లోవ కొత్తూరు నుంచి గరగలను తీసుకువచ్చి పుట్టుదార వద్ద శుద్ధి, పూజలు చేయనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు

April 5, 2026 / 06:50 AM IST

మెళ్లూరు ప్రత్యేక అధికారిగా శ్రీనివాస్

E.G: బిక్కవోలు మండలం మెళ్లూరు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. పాలకమండలి పదవీకాలం ముగియడంతో ఆయనను నియమించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు చినబాబులు, శ్రీనివాస్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుదలకు, తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఎంపీడీవో పేర్కొన్నారు

April 5, 2026 / 06:47 AM IST

‘అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారు’

VZM: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడంపై రాజం MLA కొండ్రు మురళీమోహన్‌ హర్షం వెలిబుచ్చారు.ఈ సందర్భంగా తన నివాసంలో సతీసమేతంగా దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేసారు.అయన మాట్లాడుతూ ఇది రైతుల త్యాగాలతో సాధించుకున్న ప్రజా విజయమని, ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిందని అన్నారు.CM చంద్రబాబు అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారన్నారు.

April 5, 2026 / 06:46 AM IST

‘నేడు కలక్టరేట్‌లో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు’

PPM: జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో ఆదివారం భారత మాజీ ఉపప్రధాని డా.బాబూ జర్టీవన్‌ రామ్‌ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకర రెడ్డి తెలిపారు. దీనిపై శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, పట్డణ మెయిన్‌ రోడ్డులోని బాబు జర్టీవన్‌ రామ్‌ విగ్రహానికి అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పిస్తారని తెలుపారు.

April 5, 2026 / 06:45 AM IST

కోతుల దాడిలో గాయపడిన వృద్ధురాలు

AKP: ఎలమంచిలి పట్టణం జలాల వీధిలో కొండపల్లి రంగయ్యమ్మ అనే వృద్దురాలిపై శనివారం కోతులు దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె చేతికి గాయం అయింది. గత కొంతకాలంగా ఎలమంచిలి పట్టణంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కోతులతో పుర ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. నేరుగా ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను చిందరవందర చేస్తూ పాడు చేస్తున్నాయి.

April 5, 2026 / 06:36 AM IST

30 గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు వీరే

SKLM: ఆమదాలవలస మండలం పరిధిలోని 30 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకా ధికారులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం నియమించారు. ప్రత్యేకా ధికారులుగా వీరే – తోటాడ ఎస్. రామ్మోహన్ రావు (ఎంపీడీఓ), రామచంద్రాపురం- ఎస్. రాంబాబు (తహసీల్దార్), కొర్లకోట, తోగరాం ఎం .మోహన్ రావు (ఏవో ) వంజంగి, వంజంగి పేట ఏ .గోపాలరావు డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్నారు.

April 5, 2026 / 06:36 AM IST

పేదరిక నిర్మూలనే లక్ష్యం: డీఆర్డీఏ పీడీ

KDP: పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో బిజినెస్ రిసోర్స్ సెంటర్ (బీఆర్సీ) మేనేజ్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశం శనివారం జరిగింది. డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. గ్రామీణ మహిళా సంఘాల వ్యాపారాలను ప్రోత్సహించాలని సభ్యులకు సూచించారు. ఏపీఎంలు, సీసీలు, సీఆర్పీలు సమన్వయంతో పనిచేసి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 5, 2026 / 06:35 AM IST

జిల్లాలో మాంసం ధరలు ఎంతంటే..?

అన్నమయ్య: రాయచోటిలో ఇవాళ నాన్‌వెజ్ ధరలు వెల్లడయ్యాయి. చికెన్ ధరలు స్వల్పంగా తగ్గి కేజీ రూ.230, స్కిన్‌లెస్ చికెన్ రూ.250గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900గా స్థిరంగా కొనసాగుతోంది వ్యాపారులు తెలిపారు. చేపలలో కొరమేను రూ.450, రాగండి రూ.200, బొచ్చెలు రూ.230గా ఉన్నాయి. చికెన్ ధరలు స్వల్పంగా తగ్గడంతో వినియోగదారులు కొంత ఊరట పొందుతున్నారని వెల్లడించారు.

April 5, 2026 / 06:33 AM IST

మహిళా సాధికారతకు పది సూత్రాలు: మంత్రి

KRNL: మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికను రూపొందించిందని శనివారం మంత్రి సత్యకుమార్ తెలిపారు. వివక్షను తొలగించి, మహిళలకు సమాన ఆర్థిక, సామాజిక అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యం అన్నారు. గర్భధారణ నుంచి శిశు సంరక్షణ వరకు అండగా ఉంటూ.. జనాభా స్థిరీకరణలో వారిని భాగస్వాములను చేస్తామన్నారు. స్త్రీ శక్తితోనే ప్రగతి సాధ్యమని మంత్రి పేర్కొన్నారు.

April 5, 2026 / 06:30 AM IST

వాహనదారులు నిబంధనలు పాటించాలి: ఎస్సై

NDL: ప్రధాన రహదారుల్లో ప్రయాణించే సమయంలో వాహనదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సంజామల ఎస్సై రమణయ్య హెచ్చరించారు. శనివారం మండలంలోని నొస్సం సమీపంలో ఆయన వాహనాల తనిఖీ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ డ్రైవర్ లైసెన్సు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.

April 5, 2026 / 06:30 AM IST

విశాఖలో పర్యటించనున్న కేంద్ర సమాచారకమిషనర్

VSP: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈనెల 6, 7వ తేదీల్లో సమాచార కమిషనర్ సుధారాణి రేలంగి పర్యటించనున్నారు. 6న ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకోనున్నారు. 7న ఉదయం 10 గంటలకు DSNLUలో జరిగే దక్షిణ ప్రాంత లా రివ్యూ కన్సల్టేషన్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యటనకు అధికారులు భద్రత, రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు.

April 5, 2026 / 06:28 AM IST

జట్టీ నిర్మాణానికి స్థల పరిశీలన

AKP: నక్కపల్లి మండలం బోయపాడు తీర ప్రాంతంలో జట్టి నిర్మాణానికి స్థలాన్ని మత్స్యశాఖ అధికారులు TDP నాయకులు శనివారం పరిశీలించారు. నక్కపల్లి మండలం తీర ప్రాంతంలో ప్రభుత్వం జట్టీ మంజూరు చేసింది. రూ.32 కోట్ల వ్యయంతో జట్టీ నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. హోంమంత్రి ఆదేశాల మేరకు అధికారులు నక్కపల్లి మండలంలో తీర ప్రాంతంలో పర్యటించారు.

April 5, 2026 / 06:27 AM IST

మానవత్వం చాటుకున్న మంత్రి బీసీ

NDL: విజయవాడ పిన్నమనేని సిద్ధార్థ కాలేజీ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద శనివారం సాయంత్రం లారీ ఢీకొని వృద్ధ దంపతులు గాయపడ్డారు. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెంటనే స్పందించి, కాన్వాయ్ ఆపి బాధితులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

April 5, 2026 / 06:20 AM IST