• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డిజిటలైజేషన్‌లో విశాఖ దక్షిణకు 5వ స్థానం

విశాఖ దక్షిణ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన క్యాడర్ డిజిటలైజేషన్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆశీలమెట్టలో పార్టీ శ్రేణులతో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. కార్యకర్తల కృషితో ఈ ఫలితం సాధ్యమైందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

April 5, 2026 / 08:14 PM IST

రాజవొమ్మంగి ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ

ASR: రాజవొమ్మంగి ఎస్సైగా వెంకటరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బధిలీల్లో రంపచోడవరం ఎస్సైగా చేస్తున్న వెంకటరావును రాజవొమ్మంగి ఎస్సైగా నియమిస్తూ ఎస్పీ అమిత్ బర్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం రాజవొమ్మంగి ఎస్సైగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

April 5, 2026 / 08:14 PM IST

డీఈఓకు ఫ్యాప్టో నాయకుల ధర్నా నోటీసు

KRNL: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలులో ఉద్యమం మరింత ఉద్ధృతమవుతోందని ఫ్యాప్టో నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లా విద్యాధికారికి ఫ్యాప్టో నాయకులు ధర్నా నోటీసు అందజేశారు. మూల్యాంకనం విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు రేపటి నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని తెలిపారు.

April 5, 2026 / 08:07 PM IST

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

BPT: ఈ నెల 9న బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు ముఖ్యమంత్రి రానున్నారు. ఈ నేపథ్యంలో సూరేపల్లెలో పర్యటన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్‌ వి.వినోద్ కుమార్, జేసీ భావన వశిష్ట, ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు. భద్రత, ప్రోటోకాల్ అంశాలను పర్యవేక్షించి స్థానిక అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి లోపాలు లేకుండా సీఎం పర్యటనను సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు.

April 5, 2026 / 08:01 PM IST

నరసరావుపేటలో జగ్జీవన్ రామ్ జయంతి

PLD: మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం నరసరావుపేటలో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సంజన సిన్హా ఆయన కలెక్టరేట్లోని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని జేసీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 5, 2026 / 08:00 PM IST

రేపు చిత్తూరులో పర్యటించనున్న మంత్రి నారాయణ

CTR: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ సోమవారం చిత్తూరులో పర్యటిస్తారని ఎమ్మెల్యే గురజాల కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 8:30 గంటలకు బీవి రెడ్డి కాలనీలోని ఎమ్మెల్యే నివాసానికి మంత్రి చేరుకుంటారని అందులో పేర్కొన్నారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు పర్యటన విజయవంతం చేయాలని వారు కోరారు.

April 5, 2026 / 08:00 PM IST

మద్యం దుకాణం వద్ద దారుణ హత్య

GNTR: తాడికొండ శివారు పరిమి రోడ్డులోని ఓ మద్యం దుకాణం వద్ద దారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో ఉన్న నూతక్కి మరియదాసు (34) అనే వ్యక్తిపై కొందరు దుండగులు ఇటుకలతో తీవ్రంగా దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు.

April 5, 2026 / 08:00 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

SKLM: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 5, 2026 / 07:57 PM IST

బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శాలు అందరికీ స్ఫూర్తి

అన్నమయ్య: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని, ఆయన చూపిన మార్గంలో నడవడం మనందరి కర్తవ్యం అని మదనపల్లె వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా మదనపల్లె టౌన్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

April 5, 2026 / 07:56 PM IST

కేసులతో వేధిస్తే ఊరుకోం: పిన్నెళ్లి

PLD: సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పదవీకాలం ముగిసిన సర్పంచ్‌లను సన్మానించారు. అక్రమ కేసులతో వేధిస్తే ఊరుకోమని, వచ్చే ఎన్నికల తర్వాత ‘జగనన్న 2.0’ చూస్తారని హెచ్చరించారు.

April 5, 2026 / 07:38 PM IST

అమరావతికి మద్దతుగా బైక్ ర్యాలీ

PPM: సాలూరు నియోజకవర్గంలో అమరావతి రాజధానికి మద్దతుగా మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా బైక్ ర్యాలీ చేపట్టారు. సాలూరులోని మంత్రి కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ సాగింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి త్వరతగతిన పూర్తవుతుందని తెలిపారు.

April 5, 2026 / 07:33 PM IST

పేకాట గ్యాంగ్‌పై పోలీసుల దాడి 10 మంది అరెస్ట్

KRNL: మంత్రాలయం సీఐ రామానుజులు ఆధ్వర్యంలో మాధవరం ఎస్సై విజయ్ కుమార్ సిబ్బందితో కలిసి ఇవాళ సింగరాజనహళ్లి గ్రామం వెలుపల ఖాళీ స్థలంలో పేకాట జూదం ఆడుతున్న గ్యాంగ్‌పై దాడి చేశారు. అందర్-బహార్ ఆటలో పాల్గొంటున్న 10 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,41,000 నగదు, 52 పేకముక్కలు, 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

April 5, 2026 / 07:33 PM IST

సుంకులమ్మ హుండీకి రూ.2.36 లక్షలు

NDL: సుంకులమ్మ వీధిలోని శ్రీ సుంకులా పరమేశ్వరీ దేవస్థానంలో ఆదివారం హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ ద్వారా రూ.2 లక్షల 36 వేలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఛైర్మన్ డాక్టర్ రవికృష్ణ తెలిపారు. ఈ నిధులను దేవాలయ అభివృద్ధికి వినియోగిస్తామని పేర్కొన్నారు. భక్తుల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

April 5, 2026 / 07:30 PM IST

పైపు లైన్ లీకు.. మంచినీటి సరఫరాకు అంతరాయం

GNTR: తెనాలి పట్టణ పరిధిలోని సీబీఎన్ కాలనీలో ట్యాంకు వద్ద పైపు లైన్ లీకు ఏర్పడిన కారణంగా సోమవారం పలు వార్డుల్లో మంచినీటి సరఫరా నిలిచిపోతుందని కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. పట్టణంలోని 21, 22, 23 వార్డులకు ఉదయం నుంచి మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

April 5, 2026 / 07:30 PM IST

బస్సు దగ్ధం ఘటనపై మంత్రి స్పందన

KDP: జిల్లాలో బస్సు దగ్ధం ఘటనపై రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఘటనపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

April 5, 2026 / 07:25 PM IST