GNTR: గుంటూరులో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ ఘనంగా నిర్వహించింది. మార్కెట్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి తదితరులు నివాళులర్పించారు. అనంతరం విజ్ఞాన మందిరంలో సభ జరిగింది. దేశ ప్రగతిలో జగ్జీవన్ రామ్ పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. ఆయన జీవితం యువతకు ఎంతో ఆదర్శమని అన్నారు.
BPT: అద్దంకి సీఐ సుబ్బరాజు యువతకు క్రికెట్ బెట్టింగ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షలు పూర్తైన తర్వాత విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ పెంచాలని అన్నారు. బెట్టింగ్‌లలో పాల్గొంటే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
VSP: భీమిలిలోని చారిత్రక గంటస్తంభం, పైలాన్ వంటి వారసత్వ కట్టడాలు రాజకీయ ఫ్లెక్సీలతో కనుమరుగవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నియంత్రణ లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారసత్వ సంపదను కాపాడాల్సిన జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
W.G: కాళ్ల మండలం వేంపాడులో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అలుపెరుగనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉండి డీసీ ఛైర్మన్ తోట ఫణిబాబు, కూటమి నాయకులు భారీగా పాల్గొన్నారు.
W.G: భీమవరం బలుసుమూడిలోని వేంచేసి ఉన్న స్వయంభూ భైరవస్వామి వారిని ఇవాళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు దర్శించికుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుష్టశక్తులను సంహరించి భక్తులను రక్షించే దేవుడు కాల భైరవుడు అన్నారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
VSP: విశాఖ సాహితీ సంస్థ 56వ వార్షికోత్సవ వేడుకలు ద్వారకానగర్ గాయత్రి విద్యా పరిషత్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి వై.వి. అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తరాంధ్ర సాహిత్యానికి విశాఖ సాహితీ విశేష సేవలందిస్తోందని పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు సాహితీ కార్యక్రమాలను ప్రశంసించారు.
CTR: జీడినెల్లూరు మండలం వి.బందార్లపల్లెలో శ్రీపట్టాభి రామస్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గరుడ వాహన సేవ నిర్వహించారు. స్వామి వారిని గరుడ వాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. తర్వాత గ్రామంలో ఊరేగించారు. గ్రామస్తులు కాయాకర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
సత్యసాయి: యేసు క్రీస్తు సిలువ వేయబడి తిరిగి లేచిన పునరుత్థాన దినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని సీ అండ్ ఐజీ మిషన్ చర్చిలో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిని పూలతో అలంకరించి క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు లేచెను.. ఆదివారమున, జయ జయ యేసు జయ యేసు.. అంటూ ఈస్టర్ ప్రత్యేక గీతాలను ఆలపించారు. అనంతరం ఒకరికొకరు ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
TPT: తిరుపతిలో గ్రామీణ రుచులతో ‘ది విలేజ్ టచ్’ హోటల్‌ను తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ హోటల్ ద్వారా సంప్రదాయ పల్లెటూరి వంటకాలను ప్రజలకు అందించడం అభినందనీయమని అన్నారు. యువత సరికొత్త ఆలోచనలతో వ్యాపార రంగంలోకి రావడం సంతోషకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
గుంటూరు: జిల్లా పోలీస్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ హనుమంతు, ఇతర సిబ్బంది ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సామాజిక న్యాయం, సేవాభావంతో పోలీసులు విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
E.G: కొవ్వూరులోని సెయింట్ పాల్ లూధరన్ చర్చిలో ఆదివారం ఈస్టర్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. క్రైస్తవులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కంఠమని రామ కృష్ణ, దాయన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల ఆధునీకరణకు నిధులు తీసుకురావడంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రత్యేక శ్రద్ధ వహించారని కొత్తపేట మండలం బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఆదివారం వాడపాలెంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే బండారుని మర్యాదపూర్వ కలిసి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. లొల్ల లాకుల నిర్మాణంతో రైతుల సాగు నీటి సమస్యలు తీరుతాయన్నారు.
VZM: భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు ‘బాబూ’ జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎం.రామసుందరరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డా.br .అంబేద్కర్ గురుకుల పాఠశాలల విద్యార్ధులు ఆయన సేవలను నృత్య ప్రదర్శన ద్వారా చూపారు.
గుంటూరు: భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ జయంతిని తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, వివిధ విభాగాల ఉద్యోగులు సిబ్బంది పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళి అర్పించారు. సుధీర్ఘ కాలం పార్లమెంటేరియన్‌గా సేవలందించి దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పలువురు అధికారులు తెలిపారు.
ఎన్టీఆర్: తిరువూరు ఎస్సై శాతకర్ణి ఆదివారం మీడియాతో మాట్లాడారు. సీపీ ఆదేశాలతో ఏసీపీ సూచన మేరకు మైనర్లకు ద్విచక్ర వాహనాలు తల్లిదండ్రులు ఇవ్వరాదన్నారు. ఎవరైనా మైనర్లు బండి నడుపుతూ పట్టుబడితే బండి సీజ్ చేసి 5000 రూపాయల నుండి 10,000 రుపాయల జరిమానా విధిస్తామని ఎస్సై హెచ్చరించారు.