• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి’

SKLM: ఆమదాలవలస కృష్ణాపురం మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాల పరిధిలో కాంపెయినింగ్ నిర్వహించినట్లు హెచ్ ఎం ఎస్ ధనుంజయరావు శుక్రవారం తెలిపారు. విద్యార్థులకు ఒత్తిడి లేని బోధనతోపాటు ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు, బ్యాగు, యూనిఫాం, మిడ్ డే మీల్స్ వంటి సదుపాయాలు కల్పిస్తుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.

April 17, 2026 / 11:46 AM IST

బియ్యం గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేసిన DRDO

VZM: జిల్లా రెవెన్యూ డివిజనల్ అదికారి ( DRDO) ఎం.సుధారాణి శుక్రవారం రేగిడి ఆముదాలవలస మండలంలోని MLS రైస్‌ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాంలోని స్టాక్‌ నిల్వల పరిస్థితి, నిల్వ విధానాలు, రికార్డుల నిర్వహణ, పంపిణీ ప్రక్రియ, స్టాక్‌ రిజిస్టర్లు పరిశీలించారు. తూనికలు, కొలతల పరికరాలను తనిఖీ చేసి వాటి కచ్చితత్వాన్ని నిర్ధారించారు.

April 17, 2026 / 11:41 AM IST

29 నుంచి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

NDL: అవుకులోని పురాతన లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈనెల 29 నుంచి మే 7 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్ననట్లు శుక్రవారం ఆలయ నిర్వాహకులు తెలిపారు. 29న అంకురార్పణ, 30న స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. మే 1 నుంచి 5 వరకు వివిధ వాహన సేవలు, 6న రథోత్సవం, 7న వసంతోత్సవంతో వేడుకలు ముగుస్తాయని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

April 17, 2026 / 11:41 AM IST

అదనపు బస్సు లేక గ్రామస్థుల ఇబ్బందులు

KDP: లింగాల నుంచి ఉదయాన్నే వెళ్లే మొదటి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం గ్రామస్థులు, విద్యార్థులు, కూలీలు, ఉద్యోగస్థులు ప్రయాణాలు సాగిస్తుంటారు. దీంతో ఆ బస్సులో అడుగు తీసి అడుగు పెట్టాలంటే కష్టంగా మారిందన్నారు. RTC DM స్పందించి ప్రయాణికుల అవస్థలను గమనించి అదనపు బస్సును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

April 17, 2026 / 11:41 AM IST

అమరావతి నిర్మాణానికి రూ.1,5,200 విరాళం

కృష్ణా: గుడివాడకు చెందిన అట్లూరి లక్ష్మీ కుమారి, కాట్రగడ్డ నిర్మల, నందమూరి పద్మజ, త్రిపురనేని సుజాత, పొట్లూరి శేషుబాబు, మేక ప్రమీలారాణి సీఎం చంద్రబాబును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.1,5,200 చెక్కును సీఎం చంద్రబాబుకు వారు అందజేశారు. వారిని సీఎం చంద్రబాబు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

April 17, 2026 / 11:41 AM IST

భర్తపై భార్య కేసు.. మనస్తాపంతో ఆత్మహత్య..!

KKD: తాళ్లరేవు మండలం సీతారామపురంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో వివాదాల కారణంగా కేసు నమోదు కాగా, మనస్తాపంతో సెల్ఫీ వీడియో, లేఖ రాసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. తన 14 ఏళ్ల కుమారుడిని తల్లి వద్దే ఉంచాలని వీడియోలో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

April 17, 2026 / 11:40 AM IST

ప్రజల ఇబ్బందుల పట్ల నిర్లక్ష్యం వద్దు: ఎమ్మెల్యే జేసీ

ATP: తాడిపత్రిలోని 32వ వార్డు బిందెల కాలనీలో ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అక్కడికక్కడే మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజల ఇబ్బందుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.

April 17, 2026 / 11:40 AM IST

మార్కాపురం కోర్టుకు లాయర్లు విధుల బహిష్కరణ

ప్రకాశం: నేడు మార్కాపురం కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలీ జహీర్ ఆధ్వర్యంలో లాయర్లు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.. అనంతపురం బార్ అసోసియేషన్ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా బహిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురంలో 116 మంది లాయర్లు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

April 17, 2026 / 11:37 AM IST

సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీవో

అన్నమయ్య: పీలేరు(M) ముడుపుల వేముల గ్రామ సచివాలయాన్ని RDO శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.రికార్డులను పరిశీలించి, హాజరు వివరాలు తెలుసుకున్నారు. గైర్హాజరైన సిబ్బందిపై విచారణ చేపట్టారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో గ్రామ రెవెన్యూ అధికారి వెంకటేష్ పాల్గొన్నారు.

April 17, 2026 / 11:35 AM IST

బెట్టింగులకు పాల్పడిన 8 మంది అరెస్ట్

NDL: కొలిమిగుండ్ల మండలం నందిపాడులో IPL క్రికెట్ బెట్టింగుకు పాల్పడుతున్న 8 మంది యువకులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సీఐ రమేశ్ బాబు వెల్లడించారు. పలువురు క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో కొందరిని విచారించామన్నారు. వారిలో 8 మంది బెట్టింగుకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి రూ.24వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

April 17, 2026 / 11:28 AM IST

రైతులు పంట రుణాలు రెన్యువల్ చేసుకోండి

ATP: ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతులు తమ పంట రుణాలు రెన్యువల్ చేసుకోవాలని కెనరా బ్యాంక్ మేనేజర్ గురుమూర్తి కోరారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, వన్ బి అడంగల్ తీసుకొని రైతులు తమ పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.

April 17, 2026 / 11:26 AM IST

నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్

NLR: ఆత్మకూరు మండలం, కరటంపాడు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ఆటోలో ఓ మహిళా ప్రయాణికురాలు ఫోన్ మరిచి వెళ్లిపోయినట్లు గుర్తించిన ఆటో డ్రైవర్ విజయ్ కుమార్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎస్సై జిలానికి అందించాడు. ఎస్సై జిలాని మాట్లాడుతూ.. ఈ ఫోన్‌కి సంబంధించిన ఆధారాలు చూపించి ఫోన్ తీసుకెళ్లాలని సూచించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ను ఎస్సై అభినందించారు.

April 17, 2026 / 11:24 AM IST

ఆర్టీసీ బస్టాండ్‌లో దుకాణాల అద్దెకు ఆహ్వానం

సత్యసాయి: జిల్లాలోని పుట్టపర్తి ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఖాళీగా ఉన్న దుకాణాలను అద్దెకు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిరుద్యోగులు, వ్యాపారస్తులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక పుట్టపర్తి డిపో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

April 17, 2026 / 11:21 AM IST

అగ్నిప్రమాద బాధితుడికి అండగా వైసీపీ నేతలు

KRNL: పెద్దకడబూరులోని లక్ష్మీపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసె దగ్ధమయి సర్వం కోల్పోయి వీధిన పడ్డ జెల్లి అంజినయ్య కుటుంబానికి వైసీపీ నేతలు అండగా నిలిచారు. శుక్రవారం వైసీపీ నేతలు రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివరామరెడ్డి, విజయేంద్ర రెడ్డి బాదిత కుటుంబాన్ని పరామర్శించి, నిత్యవసర వస్తువులు, రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

April 17, 2026 / 11:19 AM IST

జనగణన వివరాలు నమోదు చేసిన కలెక్టర్

PLD: పల్నాడు కలెక్టర్ కృతిక శుక్లా తన జనగణన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. శుక్రవారం se.census.gov.in వెబ్‌సైట్ ద్వారా స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యుమరేషన్) పూర్తి చేశారు. ఇందులో 33 ప్రశ్నలకు వివరాలు అందించారు. ఈ నెల 30 వరకు ప్రజలు తమ ఇళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లా ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.

April 17, 2026 / 11:17 AM IST