కృష్ణా: ఉయ్యూరులో ఓ ప్రైవేట్ దంత వైద్యశాలలో దోపిడీ జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక పన్ను పీకటానికి రూ.3 వేలు వసూలు చేస్తుండగా, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మెడికల్ సేవల పేరుతో అధిక రుసుములు తీసుకుంటున్నప్పటికీ, రోగులకు సరైన సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
NDL: డోన్ తారకరామనగర్ కాలనీలో బుజ్జికృష్ణకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ఇవాళ తెలిపారు. గేదెల పెంపకంతో జీవనం సాగించిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. బ్యాంకు రుణాల భారం తగ్గించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.
NTR: నందిగామ మండలంలోని రుద్రవరం, గొళ్లమూడి గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను జాయింట్ కలెక్టర్ ఇలాకీయా పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్ల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రీ-సర్వే నిర్వహించి, ప్రత్యేక క్యూఆర్ కోడ్, రాజముద్రతో డిజిటల్ పాస్‌పుస్తకాలను రూపొందించి అందిస్తోందని తెలిపారు.
అన్నమయ్య: ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు. ‘యువగళం’ పుస్తకాన్ని అందజేసిన లోకేష్, రాష్ట్ర అభివృద్ధి మరియు యువత సాధికారతపై చర్చించారు. రవాణా సేవల మెరుగుదల, రోడ్డు భద్రత, క్రీడా అభివృద్ధిపై కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్టీసీ బలోపేతం, సేవల విస్తరణపై కూడా చర్చించారు. మెరుగైన పాలన అందించాలనే దిశగా నిర్ణయించారు.
అన్నమయ్య: ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు. ‘యువగళం’ పుస్తకాన్ని అందజేసిన లోకేష్, రాష్ట్ర అభివృద్ధి మరియు యువత సాధికారతపై చర్చించారు. రవాణా సేవల మెరుగుదల, రోడ్డు భద్రత, క్రీడా అభివృద్ధిపై కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్టీసీ బలోపేతం, సేవల విస్తరణపై కూడా చర్చించారు. మెరుగైన పాలన అందించాలనే దిశగా నిర్ణయించారు.
BPT: యాజిల్ గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి భట్టిప్రోలు మండలంలో జరిగిన సీఎం సభలో కోటి రూపాయలు గ్రామ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు అందజేశారు. P4లో భాగంగా తమ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకునేందుకు తన వంతు సహాయం అందజేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు.
TPT: సత్యవేడు నియోజకవర్గంలో దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్‌ను కోరారు. గురువారం తిరుపతికి వచ్చిన ఛైర్మన్‌కు స్వాగతం పలికిన అనంతరం, జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలు జారీ చేసి దళితులకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు.
విశాఖలో 20 మంది ట్రాన్స్జెండర్లు గురువారం పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. జీవీఎంసీ స్వీపర్ ఉద్యోగాల్లో చేరిన వారికి 72 రోజుల జీతం జమ కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. సీపీని పూలమాల, శాలువాతో సత్కరించారు. ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే గౌరవప్రద జీవనం సాధ్యమని సీపీ అన్నారు.
KRNL:‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా సి.బెలగల్‌లో జిల్లా కలెక్టర్ సిరి, JC నూరుల్ ఖమర్ చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. నాగమ్మ చెరువును సందర్శించి నీటి నిల్వ పరిస్థితులపై అధికారులతో చర్చించారు. సాగునీటి సదుపాయాల మెరుగుదలకు అవసరమైన సూచనలు చేశారు. రైతులకు నీటి వినియోగం, భూగర్భ జలాల పరిరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు చిన్నచౌక్ ఎస్ఐ రాజరాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా పరిమితికి మించి ఎక్కించకూడదని, యూనిఫామ్ ధరించడం తప్పనిసరి అని సూచించారు.
కృష్ణా: పెనమలూరు MLA బోడే ప్రసాద్‌కు గౌహతిలో టీడీపీ శ్రేణులు గురువారం ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారదర్శకమైన పరిపాలన సాగుతుందని, అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించడం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.
W.G: రబీ పంట కొనుగోలుకు ప్రభుత్వం కొత్త గోనెసంచులు ఇవ్వాలని, గత ఖరీఫ్ పంటకు రైతాంగానికి రావల్సిన రూ.15 కోట్లపై బడి రవాణా వాహన ఛార్జీలు వెంటనే ఇవ్వాలని ఏపీ కౌలురైతుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మార్టేరులో గురువారం జిల్లా కమిటీ సమావేశాన్ని అధ్యక్షుడు శ్రీనివాసరావు నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చే చిరిగిన గోనె సంచులతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటురన్నారు.
GNTR: తెనాలి బుర్రిపాలెం రోడ్‌లోని గుప్త కళాశాలలో తొలివిడత జనగణన శిక్షణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు ఆధ్వర్యంలో గురువారం జరిగినది. ఈ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్స్ విచ్చేసి సెక్రటరీలకు, టీచర్స్‌కు జనగణనపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతుందని వారు తెలిపారు.
GNTR: తెనాలి బుర్రిపాలెం రోడ్‌లోని గుప్త కళాశాలలో తొలివిడత జనగణన శిక్షణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు ఆధ్వర్యంలో గురువారం జరిగినది. ఈ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్స్ విచ్చేసి సెక్రటరీలకు, టీచర్స్‌కు జనగణనపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతుందని వారు తెలిపారు.
KRNL: ఈ నెల 26, 27, 28వ తేదీల్లో తిరుపతిలో జరిగే ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఎన్.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు కార్మికులకు పిలుపునిచ్చారు. పత్తికొండలోని చదువుల రామయ్య భవన్లో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.