• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బాధితుడి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా

సత్యసాయి: కదిరి రూరల్ మండలం ఎగువపల్లి హరిజనవాడకు చెందిన వై.హరి ప్రమాదవశాత్తు మరణించడంపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిరుపేద కుటుంబానికి జరిగిన ఈ నష్టం తీరనిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

April 14, 2026 / 10:21 AM IST

‘అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి’

E.G: భారత రాజ్యాంగ రూపకర్త బీ.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా కడియం మండలం వేమగిరిలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ పూలమాల వేసి నివాళులుర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యత వంటి విలువలను సమాజానికి అందించిన అంబేద్కర్ ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.

April 14, 2026 / 10:20 AM IST

అంబేద్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం: సీఐ

NDL: ఆళ్లగడ్డ రూరల్ సీఐ బీవీ రమణ, ఎస్సై వరప్రసాద్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు అనన్య సామాన్యమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహానీయుడని తెలిపారు.

April 14, 2026 / 10:18 AM IST

‘మొక్కజొన్న రైతులకు కూటమి సర్కారు తీవ్ర అన్యాయం’

కోనసీమ: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు ఆరోపించారు. సోమవారం మండపేటలో అయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్‌లో కేవలం రూ.1700 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

April 14, 2026 / 10:13 AM IST

రాష్ట్ర క్రీడా అకాడమీలకు దరఖాస్తుల ఆహ్వానం

అన్నమయ్య: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి క్రీడా అకాడమీలలో ప్రవేశాలకు అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాధికారి చంద్రశేఖర్ తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో ఏప్రిల్ 26 నుంచి ఎంపికలు ప్రారంభం కానున్నాయి. 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులని ఆయన పేర్కొన్నారు.

April 14, 2026 / 10:13 AM IST

అంబేడ్కర్ ఆశయాలు అందరికీ మార్గదర్శకం

SKLM: రణస్థలం మండల కేంద్రంలోని డా. బీ ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి పురస్కరించుకుని మంగళవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వర రావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించే గొప్ప పునాది అని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు ప్రతిఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.

April 14, 2026 / 10:13 AM IST

ఘనంగా బెటాలియన్లో అంబేడ్కర్ జయంతి వేడుకలు

సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్లో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ రెడ్డి హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ అంబేడ్కర్ కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారన్నారు.

April 14, 2026 / 10:12 AM IST

సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానేత బి.ఆర్. అంబేద్కర్

VSP: బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు మల్లయ్యపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి CPI నేతలు నివాళులు అర్పించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.పైడిరాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎం.డి.బేగం, వి.సత్యనారాయణ, ఇ.అనిల్ తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 10:04 AM IST

పదికావస్తున్న ప్రారంభం కానీ గ్రామసభ

E.G: దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేస్తున్న గ్రామసభ నిర్వహణ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. దేవరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభలో అధికారులు హాజరు కాకపోవడంతో ప్రజల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

April 14, 2026 / 10:03 AM IST

నేండ్రగుంట హైవేపై పోలీసుల తనిఖీలు

TPT: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపినట్లు సీఐ చిన్న గోవిందు తెలిపారు. తిరుపతి SP సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నేండ్రగుంట హైవే పై అండర్ బ్రిడ్జి వద్ద వాహనాలను తనిఖీలు చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగి, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాణాలు చాలా విలువైనవని, తాగి వాహనం నడపడం చట్టరిత్యా నేరమన్నారు.

April 14, 2026 / 10:02 AM IST

‘తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి’

CTR: కార్వేటి నగరం మండలంలో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడతామని ఎంపీడీవో రాధిక తెలిపారు. మరమ్మతులకు గురైన చేతి బోర్లను బాగు చేసేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తాగునీటి సమస్యపై పంచాయితీ అభివృద్ధి అధికారులకు ఫిర్యా దు చేస్తే ప్రత్యామ్నాయ చర్యల ద్వారా సమస్యను పరిష్కరిస్తామని సూచించారు.

April 14, 2026 / 10:01 AM IST

ఉమ్మడి జిల్లాలో భగ్గుమంటున్న భానుడు

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. రెంటచింతలలో అత్యధికంగా 44 డిగ్రీల గరిష్ఠ, 27 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నరసరావుపేటలో 42, గుంటూరులో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెనాలిలో 38 డిగ్రీలు నమోదు కాగా.. బాపట్ల, చీరాలలో 36 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. భారీ ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

April 14, 2026 / 10:00 AM IST

‘బీసీ హాస్టళ్ల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు’

ELR: బీసీ హాస్టళ్ల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విషయంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. విద్యార్ధులతో కాసేపు ఆయన ముచ్చటించారు.

April 14, 2026 / 09:49 AM IST

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

SKLM: నరసన్నపేట స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డా.శాంతి హేమ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ గారి ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.

April 14, 2026 / 09:47 AM IST

అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన కలెక్టర్

ఏలూరు తంగెళ్లమూడిలోని అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ వెట్రి సెల్వి సందర్శించారు. ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆహర నాణ్యత, సిబ్బంది ప్రవర్తనను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి ఆహారాన్ని తింటూ వారి అభిప్రాయాలను అడిగారు. అనంతరం క్యాంటీన్‌ల పరిసరాలలో పరిశుభ్రతను పరిశీలించారు.

April 14, 2026 / 09:39 AM IST