• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఇంటి పట్టాలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యేకు సీపీఎం వినతి

VZM: రామకృష్ణ నగర్‌లో నివాసముంటున్న పేద ప్రజలకు ఇంటి పట్టాలిఇవ్వాలని CPM కార్యదర్శి రెడ్డి శంకర్రావు కోరారు. మంగళవారం TDP జిల్లా కార్యాలయంలో MLA అతిధి గజపతిరాజుకి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. 25 ఏళ్లగా పాకలలో నివాసం ఉంటున్న వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని GO 30 ప్రకారం పట్టాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మాణానికి రూ.5 లక్షలు సహాయం అందించాలన్నారు.

April 21, 2026 / 01:08 PM IST

వామ్మో.. భారీ కొండచిలువ..!

CTR: కుప్పం (M) మల్లనూరు హైస్కూల్ వెనుక వైపు భారీ కొండచిలువ మంగళవారం స్థానికులను హడలెత్తించింది. సుమారు 12 అడుగుల పొడవైన భారీ కొండచిలువ చెట్ల మధ్య బుసలు కొట్టడంతో యువత పట్టుకున్నారు. దీంతో ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఎక్కడైనా కొండచిలువలు కనిపిస్తే సమాచారం ఇస్తే వాటిని సురక్షితంగా పట్టుకుని అడవిలో వదలాలని సూచించారు.

April 21, 2026 / 01:06 PM IST

‘కార్మికులకు బకాయి పడ్డ జీతాలను తక్షణమే చెల్లించాలి’

అనంతపురం: కార్మికులకు బకాయి పడ్డ ఒక నెల జీతం ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో స్థానిక వినాయక కూడలి వద్ద కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. చాలీచాలని జీతాలతో జీవితాలు నెట్టుకొస్తున్న కార్మికులకు నెల రోజులు అయినప్పటికీ జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

April 21, 2026 / 01:04 PM IST

చలివేంద్రాన్ని ప్రారంభించిన శాప్ ఛైర్మన్

తిరుపతి పట్టణంలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి దేవస్థానం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవస్థానం ఛైర్మన్ మహేష్ యాదవ్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

April 21, 2026 / 01:02 PM IST

ఇంద్రకీలాద్రిపై పవన్ కళ్యాణ్ కోసం చండీయాగం

NTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తూ ఇంద్రకీలాద్రి యాగశాలలో చండీ హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులు ఆయనకు దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమానికి ఆలయ బోర్డు సభ్యులు, మాజీ కార్పొరేటర్‌లు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

April 21, 2026 / 12:58 PM IST

ఎస్సైకి మద్దతుగా రైతుల ధర్నా

ATP: పెద్దవడుగూరు ఎస్ఐ ఆంజనేయులుకు మద్దతుగా రైతులు, గ్రామస్థులు మంగళవారం ధర్నా చేపట్టారు. వరుసగా గడ్డివాములకు నిప్పు పెడుతున్న సుధాకర్ అనే వ్యక్తిని ఎస్ఐ అదుపులోకి తీసుకొని కొట్టగా, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలకు సిద్ధమయ్యారు. దీంతో రైతులు రోడ్డుపైకి వచ్చి ఎస్ఐకి మద్దతుగా నిలిచారు.

April 21, 2026 / 12:58 PM IST

రైళ్లలో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు

ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఇవాళ ఈగల్ టీం పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఒడిస్సా రాష్ట్రం నుంచి వచ్చే రైళ్లపై ప్రత్యేక నిఘా ఉంచిన అధికారులు, అనుమానాస్పద వ్యక్తులను వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు, విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. వాటిని రవాణా చేస్తే చర్యలు తప్పవన్నారు.

April 21, 2026 / 12:54 PM IST

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ

BPT: చందోల్ మండల పరిధిలో వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. మంగళవారం చందోలు పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శివకుమార్ రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తమ ఫోన్లను తిరిగి అప్పగించిన ఎస్సైకి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

April 21, 2026 / 12:43 PM IST

DCCB అభివృద్ధిపై ప్రశంసలు

విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB) సమష్టి కృషితో అభివృద్ధి పథంలో సాగుతోందని ఏపీ స్టేట్‌కో ఆపరేటివ్ బ్యాంక్ (APCOB) మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.వి.రామకృష్ణ DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జునను ప్రశంసించారు. ఎన్‌పీఏలను గణనీయంగా తగ్గించడం ద్వారా బ్యాంకు ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో నాగార్జున , సిబ్బంది కలిసి పనిచేసిన తీరు ప్రశంసనీయమన్నారు.

April 21, 2026 / 12:38 PM IST

సమస్యలపై కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే శ్రావణి

ATP: శింగనమల MLA బండారు శ్రావణి జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను కలిశారు. నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. బుక్కరాయసముద్రం ఇళ్ల పట్టాలు, జంబులదిన్నె ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం, పుట్లూరు బ్రిడ్జి పనుల వేగవంతంపై చర్చించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీర్చాలని కోరారు. స్పందించిన కలెక్టర్, సంబంధిత శాఖాధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

April 21, 2026 / 12:34 PM IST

కరెంటు ఉచ్చుకు మరో వన్యప్రాణి బలి

అన్నమయ్య: పీలేరు నియోజకవర్గం యర్రావారిపాలెం మండలం కోటకాడపల్లి సమీపంలో కరెంటు ఉచ్చుతో మరో వన్యప్రాణి మృతి చెందడం కలకలం రేపింది. నెల క్రితం రెండు ఏనుగులు మృతి చెందిన ఘటన మరువకముందే ఈ సంఘటన చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. రైతులు, వేటగాళ్లు కరెంటు తీగలు వేసి వన్యప్రాణులను చంపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

April 21, 2026 / 12:34 PM IST

‘కూలీల వివరాలు త్వరగా నమోదు చేయండి’

గుంటూరు జిల్లాలో ఉపాధి హామీ పనుల వద్ద స్వీయ గణన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచనలతో శిక్షణ పొందిన సిబ్బంది ఈ పనిని ముందుకు తీసుకెళ్తున్నారు. 2 లక్షలకు పైగా కూలీల వివరాలు త్వరగా నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌లో నమోదు అవకాశం ఉంది. కలెక్టర్ స్వయంగా నమోదు చేసి ఆదర్శంగా నిలిచారు.

April 21, 2026 / 12:33 PM IST

‘ఎండ వడదెబ్బలకు గురి కావద్దు’

SKLM: ఎండ వడ దెబ్బలకు గురి కావద్దని తెంబూరు ప్రభుత్వహోమియో వైద్యాధికారి డాక్టర్ ఎస్. ఉమాగౌరీ అన్నారు. మంగళవారం పాతపట్నం మండలం బొమ్మిక ఆశ్రమపాఠశాలలో వడదెబ్బ నివారణకు కావలసిన జాగ్రత్తలును వివరించారు. వాటికి సంబంధించిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఉచిత వైద్యశిబిరంలో పాఠశాల HM త్రినాధరావు, పీడీ రాజ్యలక్ష్మి, పార్మ్సిస్ట్ దివ్యారెడ్డి రెడ్డి ఉన్నారు.

April 21, 2026 / 12:30 PM IST

చిరుధాన్యాల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో చిరుధాన్యాల ప్రాధాన్యతను ప్రజలకు చేరువ చేసే దిశగా జె.ఎస్ ఫుడ్స్ మిల్లెట్స్ నూతన దుకాణాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఇవాళ ప్రారంభించారు. శివకృష్ణ థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ దుకాణం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.

April 21, 2026 / 12:23 PM IST

డోన్‌లో బుగ్గన మార్నింగ్ వాక్

NDL: డోన్ పట్టణంలోని నెహ్రూ నగర్ పార్కులో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి మంగళవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో కలిసి నడుస్తూ ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి అంశాలపై వారు వినిపించిన అభిప్రాయాలను శ్రద్ధగా విని చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి హామీ ఇచ్చారు.

April 21, 2026 / 12:18 PM IST