• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి’

VSP: భారతీయ జనతా పార్టీ 46సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆర్కేబీచ్ వద్ద జరిగింది. విశాఖలో ప్రతి వార్డులోనూ బీజేపీ జెండా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు.

April 9, 2026 / 12:24 PM IST

పుంగనూరు పోలీసులకు YCP నాయకుల ఫిర్యాదు

CTR: మహిళలను కించపరిచేలా వార్తలు రాయడం సరికాదని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. పుంగనూరు సీఐ సుబ్బారాయుడుకు గురువారం ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు మాట్లాడుతూ.. మహిళల పట్ల ఓ పత్రికాధినేత చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించే వారిపై చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

April 9, 2026 / 12:17 PM IST

కేజీబీవీలో ప్రవేశాలకు రేపే లాస్ట్

VZM: వంగర KGBV గురుకులంలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనున్నట్లు ప్రిన్సిపల్‌ రోహిణి గురువారం తెలిపారు. ఈ మేరకు 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌‌లో 40 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్‌ కార్డు, ఫొటోలు, ఇన్‌కమ్‌, క్యాస్ట్‌, ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూ...

April 9, 2026 / 12:15 PM IST

తిరుపతిలో ప్రత్యేక వినతుల స్వీకరణ

తిరుపతి కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినతుల స్వీకరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు, డీఆర్‌వో నరసింహులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు వినడంతో పాటు పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

April 9, 2026 / 12:13 PM IST

పంగులూరులో జనగణన శిక్షణ తరగతులు ప్రారంభం

బాపట్ల: పంగులూరు మండల కేంద్రంలోని APM వెలుగు కార్యాలయ మీటింగ్ హాల్‌లో జనగణన-2027 (Census 2027) శిక్షణ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తహసీల్దార్ సింగారావు మాట్లాడుతూ.. ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు క్షేత్రస్థాయిలో డేటా సేకరణపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయని, అన్నారు.

April 9, 2026 / 12:09 PM IST

ఎస్పీలుగా పలువురి పేర్లు పరిశీలన

గుంటూరు: జిల్లాలో పలువురు అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ఎస్పీల ప్యానెల్ జాబితాలో గుంటూరులో పనిచేస్తున్న పలువురు అదనపు ఎస్పీల పేర్లు ఉన్నాయి. గుంటూరు క్రైమ్స్ అదనపు ఎస్పీ కే. సుప్రజ, ఎల్ అండ్ ఓ అదనపు ఎస్పీ ఏ.టీ.వి రవికుమార్, అడ్మిన్ అదనపు ఎస్పీ జీ.వీ. రమణమూర్తి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

April 9, 2026 / 12:04 PM IST

ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక ‘ప్రజా దర్బార్‌’

E.G: ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక ‘ప్రజా దర్బార్‌’ అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎమ్మెల్యే ఫిర్యాదుల స్వీకరించారు. సమస్యను సంబంధిత అధికారికి బదిలీ చేసి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.

April 9, 2026 / 12:00 PM IST

ముగిసిన చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

NDL: బేతంచెర్ల పట్టణం గౌరీపేటలో వెలసిన చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి, పార్వేట, వసంతోత్సవ వేడుకలు నిర్వహించారు. స్వామి, అమ్మవారి కల్యాణంతో పాటు ప్రతిరోజూ ఊరేగింపులు నిర్వహించారు. భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.

April 9, 2026 / 12:00 PM IST

సారా కేసులో నలుగురు అరెస్ట్

ASR: నాటు సారా కేసుల్లో నలుగురు పాత ముద్దాయిలను ఎక్సైజ్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి మండలాల్లో పాత కేసులకు సంబంధించి వీరిని పట్టుకున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. నాటు సారా వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 9, 2026 / 11:59 AM IST

బ్యాక్‌లాగ్ పోస్టుల దరఖాస్తులకు గడువు పొడిగింపు

GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పొడిగించారు. గురువారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల 15 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. వివిధ శాఖల్లో 38 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన విభిన్న ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్గదర్శకాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

April 9, 2026 / 11:54 AM IST

గొలుగొండలో జనగణనపై శిక్షణ కార్యక్రమం

Akp: గొలుగొండ మండలంలోని చీడిగుమ్మల హైస్కూల్‌లో గురువారం జనగణన-2027కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు తహసీల్దార్ కే.నూకరాజు , ఏఎస్ఓ మీనా, మాస్టర్ ట్రైనర్లు ఎస్.నరసింహం, రమణమూర్తి మార్గదర్శకత్వంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో గణన విధానాలు, డేటా సేకరణపై వివరించారు.

April 9, 2026 / 11:54 AM IST

పాఠశాలలో ఎమ్మెల్యే బండారు శ్రావణి తనిఖీ

ATP: పుట్లూరు జెడ్పీ హైస్కూల్‌ను ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, మెరుగైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆర్.ఓ ప్లాంట్ మరమ్మతులు, బస్సుల కొరత, ప్రహరీ గోడ లేకపోవడం వంటి సమస్యలను విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వీటిని పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.

April 9, 2026 / 11:52 AM IST

మత్స్యకారులతో చర్చించనున్న కలెక్టర్

NLR: దక్షిణ తీర ప్రాంతాలైన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మత్స్యకారులుతో గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. నెల్లూరు టౌన్ హాల్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్లా పలు అంశాలపై చర్చించనున్నారు. మత్స్యకారుల రక్షణతో పాటు సముద్ర తీరాల భద్రతపై కలెక్టర్ సూచనలు ఇవ్వనున్నారు. సమీక్ష అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడనున్నారు.

April 9, 2026 / 11:52 AM IST

వేదాంత కంపెనీ ఎదుట నిరుద్యోగుల నిరసన

కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వద్ద వేదాంత ఆయిల్ కంపెనీ ఎదుట నిరుద్యోగ యువత బుధవారం రాత్రి రోడ్డుపై పడుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న యాజమాన్యం స్పందించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. యాజమాన్యం దిగి రాకపోతే మూడవ రోజు కూడా కంపెనీ కార్యక్రమాలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

April 9, 2026 / 11:52 AM IST

‘RTC డిపో అభివృద్ధికి అధికారుల నిర్లక్ష్యం’

E.G: నిడదవోలు RTC డిపో అభివృద్ధికి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని RTC డిపో సాధన సౌకర్యాల పోరాట కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు విమర్శించారు. గురువారం నిడదవోలులో ఆయన మాట్లాడుతూ నిడదవోలు డిపోలో 2006 సంవత్సరానికి ముందు 78 బస్సులు ఉండేవని కానీ ఇప్పుడు 34 బస్సులు మాత్రమే ఉన్నాయన్నారు. అందులో సగం కాలం చెల్లిన బస్సులు తిప్పుతున్నారన్నారని ఆయన పేర్కొన్నారు. 

April 9, 2026 / 11:47 AM IST