• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీ ముస్తాబుకు డిమాండ్

పార్వతీపురం మున్సిపాలిటీ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుద్ధ్య పనులు 24/7 నిర్వహణ, చెత్త డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, ఆక్రమణల తొలగింపు, రోడ్లు-కాలువల నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రత్యేక అధికారి పాలనలో పట్టణాన్ని ముస్తాబు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

April 5, 2026 / 05:11 PM IST

రేపు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’

VSP: విద్యుత్ సమస్యల వేగవంత పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ ప్రతి సోమవారం ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తోందని ఇమ్మడి పృథ్వి తేజ్ తెలిపారు. సోమవారం ఉదయం 10.30-11.30 వరకు విశాఖ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.  వినియోగదారులు 8688400499కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.

April 5, 2026 / 05:11 PM IST

నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ

ASR: జిల్లా నూతన కలెక్టర్‌గా టి.నిశాంతి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మోదకొండమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక పూజలతో కార్యాలయంలో ప్రవేశించి సంతకం పెట్టి బాధ్యతలు స్వీకరించారు. ఐటీడీఏ పీవో శ్రీపూజతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేశారు.

April 5, 2026 / 05:11 PM IST

తండ్రిని హతమార్చిన కుమారుడు..!

SKLM: కన్న కొడుకే తండ్రిని హత్య చేసిన ఘటన మందస మండలం లోహరిబంద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్ల లక్ష్మీనారాయణ(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తరచూ తల్లిదండ్రులకు డబ్బులు అడుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో డబ్బులు లేవని తండ్రి చెప్పడంతో కోపంతో తండ్రిని కొట్టగా తలకు తీవ్ర గాయాలై మరణించాడు. దీనిపై ఎస్సై కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేశారు.

April 5, 2026 / 05:11 PM IST

మంత్రిని కలిసిన ఎంపీ నాగరాజు

KRNL: ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, బీసీ సంక్షేమ పథకాల అమలు, విద్యార్థుల వసతి సదుపాయాల మెరుగుపై చర్చించారు. ఎంపీ సూచనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

April 5, 2026 / 05:10 PM IST

భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు

NDL: మహానంది ఆలయంలో వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లతో పాటు భక్తుల కాళ్లు కాలకుండా కొబ్బరి పీచుతో తయారు చేసిన మ్యాట్లు వేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు చేపట్టామని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. వేసవికాలం ముగిసే వరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని పేర్కొన్నారు.

April 5, 2026 / 05:04 PM IST

‘దళితులను వేధిస్తే పతనం ఖాయం’

GNTR: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌ రామ్ జయంతి నిర్వహించారు. నేతలు వెలంపల్లి, మల్లాది విష్ణు ఆయనకు నివాళులర్పించారు. కూటమి పాలనలో దళితులపై దాడులు, వేధింపులు పెరిగాయని వారు మండిపడ్డారు. ఓ దళితుడిపై స్పీకర్‌ అయ్యన్న దాడి చేయడమే ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు. దళితుల కన్నీళ్లకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని నేతలు హెచ్చరించారు.

April 5, 2026 / 04:50 PM IST

వైసీపీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

KRNL: ఆదోనిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్‌ఛార్జ్ సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు విగ్రహనీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆయన సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన సేవలను స్మరించారు. గతంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధిని కొనియాడారు.

April 5, 2026 / 04:48 PM IST

అల్తాఫ్ హుస్సేన్‌ను పరామర్శించిన మంత్రి సతీమణి

NDL: బనగానపల్లెకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు అల్తాఫ్ హుస్సేన్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిర రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం పొందాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

April 5, 2026 / 04:45 PM IST

బాబు జగజ్జివన్ రావు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: జీలుగుమిల్లి మండలలో ఆదివారం బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబు జగ్జివన్ రామ్ ఉప ప్రధానిగా చేసిన సేవలు ఎంతో కీలకమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

April 5, 2026 / 04:40 PM IST

ఏప్రిల్ 6న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అన్నమయ్య: ప్రజల నుంచి వచ్చిన సమస్యలను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవారం PGRS కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం మదనపల్లిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు.

April 5, 2026 / 04:22 PM IST

గుంటూరు పశ్చిమలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ గారి సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.

April 5, 2026 / 04:20 PM IST

పాటిల్ తిమ్మమ్మ @100 ఇయర్స్

ATP: బెలుగుప్పలో పాటిల్ తిమ్మమ్మ 100వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ అరుదైన మైలురాయిని పురస్కరించుకుని ఉరవకొండ వైసీపీ ఇంఛార్జ్ విశ్వేశ్వర రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. వందేళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటం స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

April 5, 2026 / 04:20 PM IST

ఏయూలో స్వచ్ఛ వారోత్సవ్ ప్రారంభం

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్వచ్ఛ వారోత్సవ్ కార్యక్రమాన్ని వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ ప్రారంభించారు. అవుట్‌గేట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆచార్యులతో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. విశ్వవిద్యాలయాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు, అధ్యాపకులు పాల్గొని స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.

April 5, 2026 / 04:17 PM IST

11 సీసీ కెమెరాలు ఏర్పాటు

AKP: ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమన్నపాలెం, లైనుకొత్తూరు, మర్రిబంధ గ్రామాల్లో ముఖ్య జంక్షన్లలో గ్రామ పెద్దల సహకారంతో 11 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు రూరల్ ఎస్సై ఉపేంద్ర తెలిపారు. సీసీ టీవీ కెమెరాలు నేరాలు నియంత్రణకు దోహదపడతాయన్నారు. నేరాలు జరిగితే నిందితులను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.

April 5, 2026 / 04:17 PM IST