VZM: జమ్మూ పడాలపేటలో ఉన్న బేతని మిషన్ చర్చి ఆధ్వర్యంలో క్రీస్తు పునరుత్థాన ర్యాలీ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం పాస్టర్ డా. పాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పడాలపేట, నారాయణపురం, బీసీ కాలనీ, జమ్మూ, ఆనందపురం కాలనీ, సింగపూర్ సిటీ ప్రాంతాల మీదుగా కొనసాగింది. అనేక మంది క్రైస్తవులు ర్యాలీ సందర్భంగా స్తోత్ర గీతాలు పాడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
CTR: మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలో దళిత సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వెల్లడించారు.
PPM: బొబ్బిలి, రామభద్రాపురం వేగవతి నదిపై నిర్మిస్తున్న పారాది వంతెన నిర్మాణా పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి. సి.జనార్ధన రెడ్డి ఆదివారం పర్యవేక్షించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారును ఆదేశించారు. ఆనంతరం బొబ్బిలి వీణను స్థానిక ఎమ్మెల్యే రంగారావు బహుకరించారు.
NDL: రుద్రవరం మండలం చిన్న కంబలూరులో సోమవారం రాష్ట్రస్థాయి న్యూ కేటగిరి వృషభరాజ్యముల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ‘గుడ్ ఫ్రైడే-ఈస్టర్’ పర్వదిన వేడుకలను పురస్కరించుకొని గ్రామానికి చెందిన క్రైస్తవ సంఘపెద్దలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామని తెలిపారు.
KRNL: తుగ్గలి మండలంలోని ఎద్దులదొడ్డి గ్రామంలో ఇవాళ అన్నదమ్ముల మధ్య పొలం తగాదా కారణంగా ఘర్షణ చోటుచేసుకుంది. బోయ కొత్తికొండ రంగప్ప నాయుడు, వెంకటరాముడుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో రంగప్ప నాయుడు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గత కొంతకాలంగా పొలం విషయంలో తగాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
E.G: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రూడా చైర్మన్, తూ.గో జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన తెలియజేశారు.
ELR: ప్రజలు పోగొట్టుకున్నసెల్ఫోన్లను రికవరీ చేసేందుకు ఏలూరు రూరల్ పోలీసులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఇటీవల ప్రజలు పోగొట్టుకున్న 25 సెల్ఫోన్లను ఎస్సై నాగబాబు ఆధ్వర్యంలో రికవరి చేశారు. ఆదివారం బాధితుల వారి ఇళ్ల వద్దకు స్వయాన ఎస్సై నాగబాబు వెళ్లి సెల్ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ఎస్సైను అభినందించారు.
KDP: చెన్నూరు క్రాసింగ్ వద్ద ఇటుక బట్టీల పొగ, బూడిదతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ, కంటి వ్యాధుల ముప్పు ఉందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. నిబంధనల ప్రకారం జనావాసాలకు, హైవేకి 500 మీటర్ల దూరంలో బట్టీలు ఏర్పాటు చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో కిరణ్ మోహన్‌రావు, తదితరులు యజమానులకు నోటీసులు జారీ చేశారు
ATP: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. చిన్మయనగర్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ వైఖరిని నిరసించారు. లడ్డూ విషయంలో నివేదికలున్నా సీఎం చంద్రబాబు అనవసర వ్యాఖ్యలు చేసి అపచారం చేశారని మండిపడ్డారు.
పల్నాడు: పెదకూరపాడులో ఈస్టర్ పండుగను పురస్కరించుకొని సమాధుల తోటలను పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే తమ పితరుల సమాధుల వద్ద అగరవత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థన చేశారు. సుదూర ప్రాంతాల్లో నుంచి స్వగ్రామాలకు చేరుకొని సమాదుల తోటలో కొంత సమయం గడిపి తమ పితరులతో జ్ఞాపకాలను పంచుకున్నారు. కాగా నజరేయుడైన ఏసు పునరుద్దానుడై మూడవరోజు తిరిగి లేచాడని వారి నమ్మకం.
పల్నాడు: మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక న్యాయ పోరాట యోధుడిగా, విశిష్ట పార్లమెంటేరియన్‌గా, ప్రజాస్వామ్యవాదిగా పేరు గడించిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను స్మరించారు.
కోనసీమ: మండపేట ఏడిద కొత్తపేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా జడ్పీటీసీ కురిపూడి భవాని రాంబాబు మాజీ సొసైటీ అధ్యక్షులు రామిశెట్టి శ్రీ హరిబాబు హాజరయ్యారు. బాబు జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.
KRNL: రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం తెలిపారు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 3 వరకు ఓవర్ స్పీడ్ 2,299, హెల్మెట్ లేకుండా 2,072, సెల్‌ఫోన్ వినియోగం 567 కేసులు నమోదు చేశామన్నారు. అదనంగా 2,236 డ్రంక్ అండ్ డ్రైవింగ్, 4,318 ఓపెన్ డ్రింకింగ్ కేసులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
VZM: బొబ్బిలి,రామభద్రపురం మార్గంలో వేగావతి నదిపై నిర్మిస్తున్న పారాధి వంతెన నిర్మాణ పనులను ఆర్ & బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం స్వయంగా పర్యవేక్షించారు. బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. నాణ్యత ప్రమాణాల్లో రాజీపడకుండా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని మంత్రి సూచించారు.
KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్‌లో ఇవాళ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా కమాండెంట్ మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభ్యున్నతి అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం ఆయన కృషి చేశారన్నారు.