• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ధర్నా

ATP: గుత్తి వీరారెడ్డి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

April 13, 2026 / 01:41 PM IST

ముదునూరులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

W.G: పెంటపాడు మండలం ముదునూరులో అద్దంకి విజయరత్నం ఆధ్వర్యంలో ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ వడ్డీ రఘురామ్ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే అంబేద్కర్ ఆశయ సాధనాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.

April 13, 2026 / 01:39 PM IST

చింతలచెరువులో జలధారపై కలెక్టర్ సమీక్ష

KDP: బద్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కె.రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ కలెక్టర్ డా. చేకూరి శ్రీధర్ బద్వేల్ మండలం చింతలచెరువు గ్రామానికి రానున్నట్లు రితేష్ తెలిపారు. ‘జలధార’ ప్రాజెక్టుపై మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమీక్ష సమావేశానికి ఆయకట్టు ఛైర్మన్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

April 13, 2026 / 01:27 PM IST

‘గ్రంథాలయాన్ని ఆధునికరించండి’

ELR: ద్వారకాతిరుమలలో 1986లో స్థాపించబడిన ప్రభుత్వ గ్రంథాలయం నిధుల కొరతతో అభివృద్ధి కుంటుపడుతోందనీ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భవనం కూడా పూర్తిగా శిధిలమయ్యే స్థాయికి చేరిందని పుస్తక ప్రేమికులు తెలియజేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రంథాలయాన్ని ఆధునికరించి పుస్తక ప్రియులకు అందుబాటులోకి తెస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

April 13, 2026 / 01:21 PM IST

మంత్రాలయం సీఐ రామాంజులు బదిలీ

KRNL: మంత్రాలయం సీఐ రామాంజులు సాధారణ బదిలీల్లో భాగంగా ఇవాళ పులివెందుల ట్రాఫిక్ సీఐగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కర్నూలు వీఆర్‌లో ఉన్న దస్తగిరి బాబును మంత్రాలయం సీఐగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా నియమితులైన దస్తగిరి బాబు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

April 13, 2026 / 01:20 PM IST

రాజమండ్రి సౌత్‌ జోన్‌ డీఎస్పీగా శివ ప్రియ

E.G: రాజమండ్రి సౌత్‌ జోన్‌ డీఎస్పీగా శివ ప్రియ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విజిబుల్‌ పోలీసింగ్‌, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి ప్రాధాన్యం ఇస్తామని ఆమె వెల్లడించారు. జోన్‌లోని ఇబ్బందికర ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. అలాగే రాత్రి వేళల్లో గస్తీని పటిష్టం చేస్తామన్నారు.

April 13, 2026 / 01:19 PM IST

డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పాల శ్రీనివాస్

కృష్ణా: గుడివాడ డీఎస్పీగా పాల శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గుడివాడ పరిధిలో చట్టం, శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, నేరాల నివారణ, ట్రాఫిక్ యంత్రణపై దృష్టి సాధిస్తామన్నారు.

April 13, 2026 / 01:18 PM IST

GVMC ఆస్తుల టెండర్ రద్దు చేయాలి: పీతల మూర్తి యాదవ్

VSP: జీవీఎంసీ ఆస్తుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే టెండర్‌పై జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలవడం నిబంధనలకు విరుద్ధమని, ఇందులో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. టెండర్‌ను వెంటనే రద్దు చేసి, స్మార్ట్ సిటీ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

April 13, 2026 / 01:16 PM IST

తిరుమలలో వైభవంగా భాష్యకారుల ఉత్సవం

TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 19 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 22న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించనున్నారు. ఆయన జన్మనక్షత్రం అరుద్ర సందర్భంగా ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీరామానుజులవారిని బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో ఊరేగించారు.

April 13, 2026 / 01:15 PM IST

‘స్మశానానికి స్థలం కేటాయించాలి’

ప్రకాశం: కొండపి మండలం మూగచింతల గ్రామంలో సోమవారం ప్రజా చైతన్య బైక్ యాత్ర సంఘం సభ్యులు గ్రామస్తులతో కలిసి దళితులకు స్మశాన వాటిక కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. స్మశాన వాటిక లేకపోవడంతో దళితులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

April 13, 2026 / 01:14 PM IST

మంగళగిరిలో గ్రీవెన్స్‌కు భారీ స్పందన

GNTR: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా విన్నారు. వినతులను పరిశీలించిన మంత్రి, సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 13, 2026 / 01:11 PM IST

వైసీపీ నేత మృతి.. వెంకటరామిరెడ్డి నివాళి

ATP: శింగణమల మండలం ఆకులేడు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు రామచంద్రారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తోపుదుర్తి కవిత ఆకులేడు గ్రామానికి వెళ్లారు. అక్కడ రామచంద్రారెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

April 13, 2026 / 01:07 PM IST

బోగోలు నూతన ఎస్సైగా రామకృష్ణ నియామకం

NLR: బోగోలు మండలం బిట్రగుంట నూతన ఎస్సైగా డి.రామకృష్ణ నియమితులయ్యారు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తెలిపారు. సమస్య ఏమైనా ఉంటే నేరుగా తనకు చెబితే పరిష్కరిస్తానని చెప్పారు.

April 13, 2026 / 01:03 PM IST

పంటలకు మద్దతు ధర కోసం రైతుల ఆందోళన

గుంటూరు: జొన్న, మొక్కజొన్న పంటలకు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో తెనాలి తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన జరిగింది. మార్కెట్‌లో సరైన ధరలు లేక రైతులు నష్టాల్లో ఉన్నారని నేతలు తెలిపారు. ప్రభుత్వం త్వరగా స్పందించాలని డిమాండ్ చేశారు.

April 13, 2026 / 01:03 PM IST

ఆకట్టుకున్న మహిళల భక్తి సంగీత కార్యక్రమం

సత్యసాయి: తమిళ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సోమవారం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్‌లో సుందరం భజన బృందం మహిళలు భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. భగవంతుని ఉనికిని ప్రతి క్షణం గుర్తించేలా సాగిన ఈ ప్రదర్శన భక్తులను పరవశింపజేసింది. పలు భాషల్లోని భక్తి గీతాలు, కర్ణాటక సంగీత కీర్తనలు అద్భుతంగా ఆలపించారు.

April 13, 2026 / 12:58 PM IST