• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నంలో కలెక్టర్ బాలాజీ పరిసరాలను శుక్రవారం శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా, శుభ్రంగా, పచ్చదనంతో నింపిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

April 4, 2026 / 08:31 AM IST

రాజధాని గ్రామాల్లో 4జీ సేవలు ప్రారంభం

GNTR: రాజధాని అమరావతి పరిధిలోని వైకుంఠపురం, అనంతవరం గ్రామాల్లో 4జీ సేవలు ప్రారంభమయ్యాయి. బీఎస్ఎన్ఎల్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్థానికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. 4జీ సిమ్ కోసం సమీప కస్టమర్ సర్వీస్ సెంటర్లు, తుళ్లూరు టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌ను సంప్రదించవచ్చని సంస్థ తెలిపింది. దీంతో డిజిటల్ సేవలు మెరుగుపడనున్నాయి.

April 4, 2026 / 08:30 AM IST

అరటి తోటల్లో ఏనుగుల సంచారం.. రైతులకు అలర్ట్

PPM: గవరమ్మపేట, ఎరుకులపేట, పెదమేరంగి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా అరటి తోటల వద్ద ఇవి తిరుగుతున్నాయని గుర్తించారు. దీంతో సమీప గ్రామాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఏనుగులను కవ్వించే చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు.

April 4, 2026 / 08:26 AM IST

అస్వస్థకు గురైన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే

శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురంలో కల్తీ బాదం పాలు తాగి 80 మంది అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధితులను ఎమ్మెల్యే గుండు శంకర్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. అస్వస్థతకు గురైన వారి నుంచి పలు వివరాలు సేకరించి, డిస్కౌంట్‌లో వస్తున్న బాదంపాలు తాగడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని బాధితులు ఎమ్మెల్యేకు తెలిపారు.

April 4, 2026 / 08:25 AM IST

రాజదాని పేరుతో టీడీపీ నాయకులు దోపిడీ చేస్తున్నారు: YCP

VZM: అమరావతి రాజధాని పేరుతో TDP నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారని YCP జిల్లా కార్యదర్శి ఇప్పిలి అనంతం ఆరోపించారు. శుక్రవారం చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి భూములలో వ్యాపారం చేయడానికి రూ.2 లక్షల కోట్లను బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా ఎందుకు పనికిరాని చోట అమరావతిని ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

April 4, 2026 / 08:24 AM IST

‘ఈ నిబంధనలు పాటించకుంటే ఇల్లు కట్టే వారికి జరిమానా’

విశాఖలో ఇల్లు నిర్మాణం చేసుకునే వారికి జీవీఎంసీ కమిషనర్ పలు సూచనలు చేశారు. ఇంటి నిర్మాణం చేసేటప్పుడు బిల్డింగ్ వ్యర్థాలను రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పారవేస్తే జరిమానాలు వేస్తామన్నారు. ఆ వ్యర్థాలు తరలించడానికి జీవీఎంసీకి ఆర్థికంగా భారం పడుతోందని పేర్కొన్నారు. బిల్డింగ్ వ్యర్థాలను గుర్తింపు పొందిన ప్రదేశాల్లో వేయాలని అధికారులు సూచించారు.

April 4, 2026 / 08:19 AM IST

పాలిసెట్ దరఖాస్తుకు గడువు పెంపు

KRNL: పాలిటెక్నికల్ కోర్సులో చేరేందుకు నిర్వహించే పాలిసెట్‌కు దరఖాస్తు గడువు ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించినట్లు ఆలూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటనారాయణ ఇవాళ తెలిపారు. పాలిసెట్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుండగా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు మరో 5 రోజులు అవకాశం కల్పించిందన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 4, 2026 / 08:16 AM IST

పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు: కారుమూరి

W.G: పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తణుకు వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ‘కారుమూరితో మేము’ కార్యక్రమంలో భాగంగా ఇరగవరం మండలానికి సంబంధించి పార్టీ గ్రామ అధ్యక్షులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ అధ్యక్షులు ఆయా గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

April 4, 2026 / 08:15 AM IST

నేటితో ముగియనున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ఘనంగా ముగియనున్నాయి. శనివారం ఉదయం 10.30 గంటల నుంచి 11:15 గంటల వరకు సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి, చక్రస్నానం జరిపించనున్నారు. అనంతరం రాత్రి 7 నుంచి 8 వరకు మహాపుర్నాహుతి, ధ్వజావరోహణం, కుంభప్రోక్షణ, ఆచర్య భాహుమనంతో ఉత్సవాలు ముగుస్తాయి.

April 4, 2026 / 08:08 AM IST

సాక్షర సేవల్లో జిల్లా రెండో స్థానం

చిత్తూరు జిల్లాలోని సాక్షర సేవా కేంద్రాల్లో నాణ్యమైన సేవలు అందుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాక్షర సేవలు లక్ష్యం 12 వేలుగా నిర్ణయించగా, 9,866 మంది రైతులకు గాను 9,275 హెక్టార్లకు సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలు ముందు వరుసలో ఉండగా, చిత్తూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు.

April 4, 2026 / 08:07 AM IST

ఓబులంపల్లిలో చోరీకి యత్నం

NDL: ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లిలో అర్ధరాత్రి ధాన్యం దొంగతనాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్లాట్ల వద్ద ఆరబోసిన పొద్దుతిరుగుడు విత్తనాలను సంచులలో నింపుకొని పారిపోతున్న వ్యక్తులను పట్టుకున్నారు. గత వారం రోజులుగా మినుము బస్తాలు మాయమవుతుండటంతో రైతులు అప్రమత్తమయ్యారు. పట్టుబడ్డ నిందితులపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

April 4, 2026 / 08:05 AM IST

తిరుమలలో ‘ఓడు ప్రసాదం’ గురించి తెలుసా?

TPT: పేద కుమ్మరి దాసుడు శ్రీవేంకటేశ్వరుడిపై అపారమైన భక్తి కలిగినవాడు. నిశ్చలమైన మనస్సు, మట్టిపూలతో శేషమూర్తికి పూజ చేసేవాడు. అతని భక్తికి మెచ్చిన శ్రీహరి, అతను తయారు చేసిన పగిలిన మట్టి కుండలోనే నైవేద్యం స్వీకరిస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి ఆ ప్రసాదాన్ని “ఓడు ప్రసాదం”గా పిలుస్తున్నారు. ఈ కథ మనకు భక్తి విలువను, అహంకారం లేకుండా సేవ చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

April 4, 2026 / 08:05 AM IST

నేడు బయ్యవరంలో ఉరుసు ఉత్సవం

AKP: కసింకోట మండలం బయ్యవరంలో ఇవాళ హజరత్ మదీనా ఔలియా ఉరుసు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలను ప్రతి ఏటా జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలకు పలు ప్రాంతాల నుంచి ముస్లింలతో పాటు హిందువులు కూడా వచ్చి మొక్కుల తీర్చుకుంటారని తెలిపారు.

April 4, 2026 / 08:04 AM IST

కాసేపట్లో పెళ్లి.. వరుడు మృతి

ATP: అనంతపురానికి చెందిన లోకేశ్(29) హైదరాబాద్ కేపీహెచ్‌బీ పరిధిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఫార్మా కంపెనీలో పనిచేసే యువతితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఆయన, పెళ్లికి సిద్ధమయ్యారు. పెళ్లి దుస్తులు ధరించి, భోజనం తీసుకురావాలని ప్రియురాలిని బయటకు పంపారు. ఆమె తిరిగి వచ్చేసరికి ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

April 4, 2026 / 08:04 AM IST

గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లో అగ్నిప్రమాదం

KKD: సామర్లకోటలో రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. సామర్లకోట, వేట్లపాలెం గ్రామాల ప్రజలు అగ్ని ప్రమాదం పట్ల ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక బృందాలు, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ సిబ్బంది మంటల్ని అదుపు చేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్లాంట్‌లో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. వేట్లపాలెం, కొత్తూరు,సామర్లకోట వరకు పొగ వ్యాపించింది.

April 4, 2026 / 08:03 AM IST