• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు

SKLM: తిరుమల పవిత్రతను కాపాడే దిశగా TTD ఛైర్మన్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైసీపీ ఆమదాలవలస సమన్వయకర్త రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. BR నాయుడు TTDను అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఇవాళ YCP శ్రేణులు వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేయాలన్నారు.

April 4, 2026 / 07:24 AM IST

ధర్మాజీగూడెంలో ఆటోను ఢీ కొట్టిన లారీ

ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం సమీపంలో శనివారం ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. దీంతో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే రేషన్ కుమార్ వెంటనే స్పందించి హుటాహుటిన సంఘటన స్థలంలో దిగి క్షతగాత్రులకు ధైర్యం చెప్పి వారిని ఆసుపత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టారు.

April 4, 2026 / 07:15 AM IST

దేవస్థానం ఉద్యోగి సస్పెన్షన్

NDL: మహానంది దేవస్థానంలో పనిచేస్తున్న jr. అసిస్టెంట్ శ్రీనివాసులును సస్పెన్షన్ చేస్తూ EO శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారని ఆలయ AEO ఎరమల మధు తెలిపారు. శ్రీనివాసులు విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు నిర్లక్ష్యం వహించారని గుర్తించినట్లు చెప్పారు. విచారణ చేసిన EO క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు

April 4, 2026 / 07:15 AM IST

అత్తిలి ఎస్సైగా విశ్వనాథ్ బాధ్యతలు స్వీకరణ

W.G: అత్తిలి ఎస్సైగా కె.ఎన్.విశ్వనాధ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కూచిపూడి పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా పని చేసిన ఆయన అత్తిలికి బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు అత్తిలి ఎస్సైగా వ్యవహరించిన పి.ప్రేమరాజు భీమవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. శాంతిభద్రతలు కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

April 4, 2026 / 07:13 AM IST

నడక మైదానానికి పివిజి రాజు పేరు పెట్టాలి

VZM: స్థానిక 42వ డివిజన్‌ అయ్యన్నపేట జంక్షన్‌ వద్ద మున్సిపల్‌ నడక మైదానానికి గొప్ప దాత, విద్యాదాత పీవీజీ.రాజు పేరు పెట్టాలని ప్రముఖ సామాజికవేత్త త్యాడా రామకృష్ణ కోరారు. ఈ మేరకు శుక్రవారం MLA అతిది గజపతిరాజును కలసి వినతిపత్రం అందజేసారు. అనంతరం మాట్లాడుతూ.. పిల్లలకు క్రీడా పరికరాలు, యువతీ యువకులకు బహిరంగ వ్యాయామశాలా పరికరాలు ఎర్పాటు చేయాలని కోరామన్నారు.

April 4, 2026 / 07:12 AM IST

జిల్లాలో పోలీసుల ‘పల్లెనిద్ర’ కార్యక్రమం

CTR: జిల్లాలో పోలీసులు “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రజలకు సూచనలు అందించారు. ప్రజల సహకారంతో గ్రామాలను సురక్షితంగా మార్చడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు.

April 4, 2026 / 07:10 AM IST

గుర్తుతెలియని మృదేహం లభ్యం

KDP: బద్వేల్ మండలం పెద్ద చెరువు దగ్గర గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. దాదాపు 4 రోజుల క్రితం చనిపోయి ఉంటాడని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బద్వేల్ సీఐ రామకృష్ణ మృతుడి వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 4, 2026 / 07:05 AM IST

భక్తి ముందు ఓడిన గర్వం..!

తిరుమలలో తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి బంగారు పుష్పాలతో అర్చనలు చేస్తూ తనకన్నా గొప్ప భక్తుడు లేడని గర్వించేవాడు. ఒకరోజు శ్రీవారి పాదాల చెంత మట్టిపూలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన రాజుకు స్వామివారే కుమ్మరి దాసుడి భక్తిని వివరించారు. పేదవాడైన అతను భక్తితో మట్టిపూలు సమర్పించేవాడు. నిజమైన భక్తి సంపదలో కాదు, మనసులో ఉందని గ్రహించిన తొండమాన్ వినమ్రుడయ్యాడు.

April 4, 2026 / 07:04 AM IST

నేడు గవర్నర్ పర్యటన షెడ్యూల్ విడుదల

ATP: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ నెల 6న ఉ.9.25 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 10.10 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11.25 గంటలకు అనంతపురం జేఎన్‌టీయూకు చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం మ.1 గంటకు అనంతపురం నుంచి బయలుదేరి పుట్టపర్తికి చేరుకుని విజయవాడకు వెళ్తారు.

April 4, 2026 / 07:00 AM IST

6 నుంచి పది మూల్యాంకనం

E.G: టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ ) సోమవారం నుంచి బీవీఎం ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో జరుగనుందని డీఈవో కంది వాసుదేవరావు తెలిపారు. శుక్రవారం రాజమండ్రి బీవీఎమ్ పాఠశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. స్పాట్ వాల్యూయేషన్‌లో పని చేయుటకు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. 

April 4, 2026 / 07:00 AM IST

ఎన్నికలలో ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

SKLM: రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాసలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే శిరీష టీడీపీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ, ప్రజల సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై సమావేశం నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అని సూచించారు.

April 4, 2026 / 06:54 AM IST

సంతమాగులూరులో వేడి హెచ్చరిక

BPT: సంతమాగులూరు మండలంలో వచ్చే మూడు రోజుల పాటు తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలు, తేమ ప్రభావంతో వాతావరణం సుమారు 41 డిగ్రీల వరకు చేరే పరిస్థితి ఉండొచ్చని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

April 4, 2026 / 06:45 AM IST

‘చలో ఆకివీడు’కు అనుమతి లేదు: ఎస్సై

W.G: ఈ నెల 5వ తేదీన చేపట్టనున్న ‘చలో ఆకివీడు’ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని ఎస్సై హనుమంతు నాగరాజు స్పష్టం చేశారు. దత్త గుడి నుంచి రామాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మండలంలో ప్రస్తుతం 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

April 4, 2026 / 06:45 AM IST

ఆస్తి కోసం తండ్రి హత్య.. ముగ్గురు అరెస్ట్

KRNL: ఆస్తి వివాదం కారణంగా కన్న తండ్రి నన్నేసాబ్ను హత్య చేసిన ఇద్దరు కుమారులను, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుంటనహాల్ గ్రామంలో మార్చి 30న జరిగిన ఈ హత్య కేసులో, ఆస్తి విషయంలో తలెత్తిన వివాదమే కారణమని పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న పెద్దకుమారుడు నూర్ మహమ్మద్, జునైద్ పాటు అతని స్నేహితుడు రీహను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

April 4, 2026 / 06:45 AM IST

టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపడతాం

AKP: ఎస్ రాయవరం మండలం సోమిదేవుపల్లి వద్ద వరాహ నది గట్టుకు రక్షణ గోడ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ వై.శ్రీనివాసరావు తెలిపారు. రక్ష గోడ నిర్మాణానికి రూ.9.95 కోట్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన కోతకు గురైన వరాహనది గట్టును పరిశీలించారు. రక్షణ గోడ, గ్రోయిన్, రెండు మదుముల నిర్మిస్తామన్నారు.

April 4, 2026 / 06:42 AM IST