• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే ఉదారత.. రిక్షా బండి అందజేత

NTR: విజయవాడ శ్రీనగర్ రెండవ లైన్‌కు చెందిన లక్ష్మి ఇంటింటికి తిరుగుతూ, వాటర్ క్యాన్స్ సరఫరా చేయడానికి అద్దె బండితో కిరాయి కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి, రూ.35,000/ విలువచేసే రిక్షా బండిని లక్ష్మికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

April 11, 2026 / 07:29 PM IST

చదువే ఆయుధమని నమ్మిన మహానీయుడు పూలే: ఎమ్మెల్యే

కృష్ణా: పామర్రు టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చదువే సమాజం మార్పుకు ఏకైక ఆయుధమని నమ్మిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

April 11, 2026 / 07:02 PM IST

పూలే ఆశయాలను సాధిద్దాం: ఎమ్మెల్యే

KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమానీ ఘనంగా నిర్వహించారు. పూలే చిత్ర పటానికి పులా మాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంఘ సంస్కర్త, మహిళా విద్య, కుల నిర్మూలన కోసం పోరాడిన పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించారన్నారు. దళితులు, బడుగు బలహీన అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేశారని అన్నారు.

April 11, 2026 / 07:00 PM IST

కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఊంజల్ సేవ

TPT: శనివారం పురస్కరించుకుని తిరుపతి జిల్లా నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వాదాలు అందించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవను కళ్లారా తిలకించి తరించారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి.

April 11, 2026 / 07:00 PM IST

జ్యోతిరావు పూలే జయంతి వేడుకలో మాజీ ఎమ్మెల్యే

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూలే జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని మాజీ ఎమ్మెల్యే అన్నారు.

April 11, 2026 / 07:00 PM IST

ఖాజీపేట నిందితుడి కాలికి ఆసుపత్రిలో వైద్యం

KDP: ఖాజీపేటలో శుక్రవారం మైనర్ బాలికను వెంకటేశ్ అనే యువకుడు గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు నిందితుడిని పట్టుకొని జైలుకు తరలిస్తున్న సమయంలో నిందితుడు పోలీసులపై తిరుగుబాటు చేసి పారిపోతున్న సమయంలో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతడి మోకాలి కింది భాగంలో ఎముక విరిగింది. దానికి నేడు రిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేసి వైద్యం అందించారు.

April 11, 2026 / 07:00 PM IST

ఆసుపత్రి ఎదుట వైద్యుల నిరసన

ELR: ఏలూరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు శనివారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టారు. సీ.పీ.స్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతిని అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న డీ.ఏలు, సరెండర్ లీవ్ జీతం మంజూరు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికి 11వ పీ.ఆర్.సీ స్కేల్ ప్రకారం 100% గ్రాస్ జీతం అమలు చేయాలన్నారు.

April 11, 2026 / 07:00 PM IST

కొడవటికల్లులో సొసైటీ భవనం శంకుస్థాపన

NTR: చందర్లపాడు మండలం కొడవటికల్లులో రూ.45 లక్షల వ్యయంతో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని భూమి పూజ చేశారు. సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన ఆర్థిక సేవలు అందించడం ద్వారా వ్యవసాయ రంగం ఇంకా ఎదగాలని ఆమె కోరారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ రఘురాం పాల్గొన్నారు.

April 11, 2026 / 06:54 PM IST

బస్టాండ్‌లో కష్టాలు.. బస్సుల కోసం ఎదురుచూపులు..!

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ శనివారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వీకెండ్ కావడంతో మధ్యాహ్నం నుంచి ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్టాండ్‌కు తరలివచ్చారు. నిర్ణీత సమయానికి బస్సులు రాక పోవడంతో గంటల తరబడి పడిగాపులు కాశారు. ఎప్పటికో ఒకటి అర బస్సు వచ్చినప్పటికీ ఎక్కేందుకు వీలు లేక చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డుతున్నారు.

April 11, 2026 / 06:53 PM IST

ఉక్కు ప్రైవేటీకరణపై ఆందోళన కొనసాగింపు

VSP: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించే వరకు పోరాటం ఆగదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పడాల గోవింద్ హెచ్చరించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే దీక్ష 1838వ రోజుకు చేరిందని తెలిపారు. కేంద్రంపై కార్పొరేట్ అనుకూల విధానాల ఆరోపణలు చేశారు. ప్లాంట్‌కు గనులు, ప్యాకేజీ, కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

April 11, 2026 / 06:36 PM IST

కొండేపాడులో వైభవంగా దుర్గా మల్లీశ్వరి విగ్రహ ప్రతిష్టాపన

W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం బి. కొండేపాడులో శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో వభ్వోపేతంగా శనివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని, వేదపండితుల ఆశీర్వాదాలు పొందారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఉదయం బలుహరణ, సంప్రోక్షణ చేసి స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలు పొందారు.

April 11, 2026 / 06:31 PM IST

మండలంలో పెరుగుతున్న ఎండ తీవ్రత

KDP: సిద్ధవటం మండలంలో గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలతో పాటు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామల వీధులలో తిరుగుతూ పండ్లు, ఇతర వస్తువులు అమ్ముకునే వృద్ధులు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఎండ వేడిని తట్టుకోలేక వ్యాపారులు చెట్ల నీడన సేద తీరుతున్నారు.

April 11, 2026 / 06:30 PM IST

ఉపాధి హామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర: వెంకటరామిరెడ్డి

ATP: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. కొత్తగా తెచ్చిన వీబీ జీ రాంజీ చట్టం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుందన్నారు. శనివారం బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లి నుంచి అనంతసాగరం వరకు సీపీఐ చేపట్టిన పాదయాత్రకు ఆయన మద్దతు ప్రకటించారు.

April 11, 2026 / 06:20 PM IST

కొండలు దాటి సింగనికోటలో కలెక్టర్ పర్యటన

పోలవరం జిల్లా కలెక్టర్ కే.దినేష్ కుమార్ గుర్తేడు మండలం సింగనికోట గ్రామంలో శనివారం పర్యటించారు. ఐదు కిలోమీటర్ల కొండలు, వాగులు కాలినడకన దాటి గ్రామానికి చేరుకున్నారు. ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాలపై గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పండ్ల తోటల కోసం మొక్కలు అందిస్తామని హామీ ఇచ్చి, గ్రామాభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు.

April 11, 2026 / 06:20 PM IST

కూటమి బీసీలను దగా చేసింది: మాజీ ఎంపీ

KKD: కూటని ప్రభుత్వం బీసీలను దగా చేసిందని పిఠాపురం వైసీపీ ఇంఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు బీసీలకు కూటమి నాయకులు ఎన్నో హామీలు ఇచ్చారని ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆమె పేర్కొన్నారు. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని, బీసీల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తానన్న హామీలు నెరవేర్చలేదన్నారు.

April 11, 2026 / 06:10 PM IST