• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అమరావతి ఐకానిక్ టవర్లకు టెండర్లు

GNTR: అమరావతిలోని ఐదు ఐకానిక్ భవనాల పూర్తికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. టవర్ 1 నుండి 4 వరకు, జీఏడీ టవర్‌లలో విద్యుత్, ప్లంబింగ్, ఏసీ, ఫైర్ సేఫ్టీ (MEP) పనుల కోసం టెండర్లు పిలిచింది. రూ. 1,856 కోట్లకు పైగా అంచనాతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ పనులను 18 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల కీలక కార్యాలయాల భవనాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

April 19, 2026 / 11:12 AM IST

అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

KKD: అధికారులు మొక్కుబడి తంతుగా కాకుండా అంకిత భావంతో జల సంరక్షణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. పెద్దాపురం మండల పరిషత్‌లో శనివారం జలధార జల సంరక్షణపై అధికారులకు దిశ నిర్దేశం చేశారు. భావితరాల కోసం జలవనరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు.

April 19, 2026 / 11:12 AM IST

సమ్మర్ ఎఫెక్ట్.. ముంజెలకు పెరిగిన గిరాకీ

W.G: భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు తాటి ముంజెలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఆకివీడు ప్రాంతంలో ముంజెలకు డిమాండ్ అమాంతం పెరిగింది. వేసవిలో మాత్రమే లభించే ఈ ప్రకృతి ప్రసాదాన్ని ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో కాయ ధర రూ.25 వరకు పలుకుతుండగా, వ్యాపారులు ముంజెలను తీసి డజన్ల లెక్కన కూడా విక్రయిస్తున్నారు.

April 19, 2026 / 11:07 AM IST

శ్రీశైలానికి KRMB ఛైర్మన్ రాక

NDL: ఈనెల 21న శ్రీశైలం డ్యామ్‌ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఛైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్ పరిశీలించనున్నారు. 20న శ్రీశైలం చేరుకొని అక్కడే బస చేస్తారు. క్షేత్రస్థాయిలో డ్యామ్‌ను సందర్శించి, జల వనరుల శాఖ ఇరు రాష్ట్రాల అధికారులతో జలాశయం భద్రతపై సమీక్షించనున్నారు. అలాగే AP, TG రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి అంశంలో నెలకొన్న వివదంపైనా చర్చించనున్నారు.

April 19, 2026 / 11:04 AM IST

సీనియర్ పాత్రికేయుడు రాజేష్ అకాల మరణం

VZM: సీనియర్ పాత్రికేయుడు సుంకర రాజేష్(53) అనారోగ్యం కారణంగా ఈ తెల్లవారుజామున అకాల మరణం చెందారు. తొలుత ఈనాడు, తరువాత సాక్షి దినపత్రికలో ఆయన పని చేశారు. విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాల నరసింగరావు వారి నివాసానికి వెళ్లి రాజేష్ మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు.

April 19, 2026 / 11:03 AM IST

గోపులాపురంలో గుండెపోటుతో రైతు మృతి

కడప: కమలాపురం(M) గోపులాపురం గ్రామానికి చెందిన రైతు మీగడ నారాయణరెడ్డి (65) శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. వారి వివరాల మేరకు.. ఆయనకు అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు.

April 19, 2026 / 11:02 AM IST

ఆ గ్రామాలకు శాపంగా మారిన తాగునీటి సమస్య

KRNL: ఆదోని పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పగల్, పెసలబండ, ఆస్పరి, మండిగిరి వంటి స్కీంల పరిధిలో గ్రామాలకు సక్రమంగా నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కీంల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్లు 20-40% తక్కువ రేటుకు పనులు తీసుకుని, వర్కర్లకు జీతాలు సైతం ఇవ్వడం లేదన్నారు.

April 19, 2026 / 11:00 AM IST

శిథిల గ్రంథాలయం… భయంతో పాఠకులు!

VZM: గంట్యాడ మండల కేంద్రంలోని గ్రంథాలయం ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉంది. భవనం స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్న కారణంగా పాఠకులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశముండటంతో వెంటనే కొత్త భవనం నిర్మించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

April 19, 2026 / 10:47 AM IST

పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి

WG: పేరుపాలెం తీరం ఆదివారం సెలవు దినం కావడంతో జనసంద్రమైంది. జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన సందర్శకులు సముద్ర స్నానాలు చేస్తూ, ఇసుక తిన్నెలపై సరదాగా గడుపుతూ సేదతీరారు. తీరంలో యువత కేరింతలు కొడుతూ ఆటపాటలతో సందడి చేశారు. పర్యాటకులు సమీపంలోని కొబ్బరి తోటల్లో వన భోజనాలు ఏర్పాటు చేసుకుని ఆనందంగా గడిపారు.

April 19, 2026 / 10:37 AM IST

అవసరమైతే తప్ప బయటకి రావద్దు: కలెక్టర్

KRNL: ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఓ ప్రకటనలో సూచించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేల ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రావద్దన్నారు. ఏదైనా పని కోసం బయటికి వస్తే ఉదయం 10 గంటల్లోగా ముగించుకొని వెళ్లాలని, సాయంత్రం 4 గంటల తర్వాత బయటికి రావాలని సూచించారు.

April 19, 2026 / 10:37 AM IST

ఆమడుగూరు మండలంలో వైసీపీకి షాక్

సత్యసాయి: అమడగూరు మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పల్లె రఘునాథ్ రెడ్డి నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

April 19, 2026 / 10:31 AM IST

హెల్మెట్ వాడకం తప్పనిసరి: డీటీసీ

BPT: బాపట్లలో రోడ్డు భద్రతా నిబంధనలపై రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. డీటీసీ పరంధామయ్య రెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణ కోసమే ఈ చర్యలన్నారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా అధికారులు పరిశీలించారు.

April 19, 2026 / 10:30 AM IST

ఒంగోలులో కార్డెన్ సర్చ్

ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని బాలాజీ నగర్‌లో ఆదివారం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్థానిక ప్రజలకు మత్తు పదార్థాలపై పోలీసులు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు DSP తెలిపారు.

April 19, 2026 / 10:28 AM IST

పిఠాపురంలో చికెన్ ధర ఎంతంటే?

KKD: పిఠాపురంలో ఆదివారం చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. సాధారణ చికెన్ కిలో రూ.180 ఉండగా, స్కిన్‌లెస్ రూ.250-280, స్కిన్ చికెన్ రూ.240గా ఉంది. బోన్‌లెస్ కిలో రూ.300, నాటుకోడి రూ.400-450 వరకు పలుకుతోంది. నాణ్యతను బట్టి ధరల్లో రూ.10-20 వ్యత్యాసం ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. చికెన్ కొనుగోలు చేసేందుకు మాంసం ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరారు.

April 19, 2026 / 10:25 AM IST

27 నుంచి సంజీవరాయ స్వామి బ్రహ్మోత్సవాలు

కడప: రాజుపాలెం మండలం వెల్లాలలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంజీవరాయ స్వామి, చెన్నకేశవ స్వామి, భీమలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ప్రతిరోజు వివిధ అలంకరణలతో స్వామి వారి ఊరేగింపు చేయనున్నారు. ఇక్కడికి, శ్రీరామచంద్రుడు సీతమ్మతో అరణ్యవాసంలో భాగంగా వచ్చినట్లు ప్రతీతి.

April 19, 2026 / 10:22 AM IST