• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎంపీపీ

SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో సోమవారం సీసీ రోడ్డును ఎంపీపీ మొదలవలస చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.5 లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో ఈ నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రతీ గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి దుంప చిన్నారెడ్డి ఉన్నారు.

April 13, 2026 / 11:00 AM IST

ఎమ్మిగనూరులో పన్నుపై రాయితీ అవకాశం

KRNL: ఎమ్మిగనూరు పట్టణ ప్రజలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి, ఖాళీ స్థలాల పన్నును ఒకేసారి చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని ఇవాళ మున్సిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి తెలిపారు. గత మార్చి 31 వరకు ఉన్న పాత బకాయిలను ఏకమొత్తంగా చెల్లిస్తే వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తామని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 13, 2026 / 10:45 AM IST

నిజరూప దర్శనంలో స్వయంభు జంబుకేశ్వరుడు

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఉదయాన్నే స్వామివారికి పురోహితులు రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రదేశం నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

April 13, 2026 / 10:43 AM IST

‘రామతీర్థం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి’

VZM: ఏపీలో కూటమి ప్రభుత్వం రామతీర్థం అభివృద్ధిపై ప్రత్యకంగా దృష్టి సారించిందని నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి తెలిపారు. సోమవారం రామతీర్థంలో పాత శ్రీరాముడి విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వంలో జరిగిన ఘటనపై సరైన న్యాయం జరగలేదన్నారు.

April 13, 2026 / 10:42 AM IST

రామతీర్థం విగ్రహాల నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: గత ప్రభుత్వ హయాంలో రామతీర్థం క్షేత్రంలో జరిగిన విగ్రహ ధ్వంస ఘటన హిందూ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు పేర్కొన్నారు. రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాలను ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రంగా నిమజ్జనం చేసే కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. గత పాలకుల కాలంలో హిందూ ధర్మంపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.

April 13, 2026 / 10:35 AM IST

లాడ్జీలు, లాక్డ్ హౌస్‌లపై ప్రత్యేక నిఘా

KDP: జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు గస్తీ విధులు నిర్వహిస్తూ లాక్డ్ హౌస్‌లు, లాడ్జీలు, దేవాలయాలు, ఎటీఎంల వద్ద ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేస్తూ అక్రమ కార్యకలాపాలపై కట్టడి చేస్తున్నారు.

April 13, 2026 / 10:33 AM IST

బౌద్ధ విహార్ ప్రారంభానికి ఎంపీకి ఆహ్వానం

E.G: ఉండ్రాజవరంలో సర్వహంగులతో అధునాతనంగా నిర్మించిన ‘బుద్ధవిహార్’ మే నెల 1వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బౌద్ధ పీఠాధిపతి పూజ్య అనాలియో రాజమహేంద్రవ ఎంపీ పురందేశ్వరికి ఆహ్వాన పత్రాన్ని అందించారు. సోమవారం రాజమండ్రి ఎంపీ పార్టీ కార్యాలయంలో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సీపల్లి హరిక, తదితరులు పాల్గొన్నారు.

April 13, 2026 / 10:30 AM IST

మదనపల్లె ఆర్‌వోకు పల్లవి అరెస్ట్ వారెంట్

అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ జీవి పల్లవికి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోలేదనే ఆరోపణలపై దాఖలైన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు ధిక్కారంగా భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఆమెను అరెస్ట్ చేసి ఈనెల 30న కోర్టులో హాజరుపరచాలని ఎస్పీకి ఆదేశాలు జారీ అయ్యాయి.

April 13, 2026 / 10:25 AM IST

భారీగా పోలీసు అధికారుల బదిలీలు: డీఐజీ

KRNL: కర్నూలు రేంజ్ పరిధిలో అర్ధరాత్రి భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. 25 మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ డా. కోయప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఈ పోస్టింగ్లు ఇచ్చినట్లు వెల్లడించారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు కొందరిని వీఆర్‌కు పంపామన్నారు.

April 13, 2026 / 10:20 AM IST

యువకుడి అదృశ్యం.. కేసు నమోదు

TPT: పాతనాలపాడు పంచాయతీ రామరాజుపల్లిలోని హరి రాము (22) మూడు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన కుమారుడు అల్లిగడ్డకు వెళ్లాడని అతని తండ్రి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేసినట్లు ఇన్‌ఛార్జ్ ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

April 13, 2026 / 10:19 AM IST

సోలార్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే థామస్ తెలిపారు. జీడీ నెల్లూరు ఎస్సీ కాలనీలో కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి సోమవారం ఆయన పథకాన్ని ప్రారంభించారు. సుమారు 5 వేల మంది లబ్ధిదారులకు రూ. 60 కోట్ల అంచనా వ్యయంతో దీనిని అమలు చేస్తున్నామని వెల్లడించారు.

April 13, 2026 / 10:17 AM IST

‘నవ నారసింహ క్షేత్రాల’ సైకిల్ యాత్ర

W.G: పాలకొల్లుకు చెందిన మరుధూరి నర్సింహాచార్యులు, బొచ్చు రవికుమార్ ‘నవ నారసింహ క్షేత్రాల’ సైకిల్ యాత్రకు బయలుదేరారు. ఇవాళ ఉదయం శ్రీ దాసోహ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. 20 రోజులపాటు 1800 కి.మీ. ఈ యాత్ర సాగనుందని, మంగళగిరి, వేదాద్రి, పెంచలకోన, అహోబిలం, కదిరి, ధర్మపురి, యాదగిరిగుట్ట నారసింహ క్షేత్రాలు దర్శించుకుంటామన్నారు.

April 13, 2026 / 10:13 AM IST

సాలూరు బీజేపీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా హేమానాయక్

PPM: సాలూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జిగా డాక్టర్ హేమా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. వైజాగ్ భాజపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పీవీ ఎన్ మాధవ్ చేతులమీదుగా నియామకపత్రం అందుకున్నారు. పార్టీ అభి వృద్ధికి కృషి చేస్తానని, కూటమి పాలనలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని హేమానాయక్ అన్నారు.

April 13, 2026 / 10:11 AM IST

వ్యవసాయానికి పగలు 9 గంటల విద్యుత్: ఏఈ

NDL: కోవెలకుంట్ల మండల పరిధిలో వివిధ సబ్ స్టేషన్‌లలో వ్యవసాయ రంగానికి పగలు 9 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏఈ రామమోహన్ తెలిపారు. కొప్పర్ల, ఆమడాల, కలుగొట్ల, హరివరం వంటి పలు గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ అందుబాటులో ఉంటుందన్నారు. రైతులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

April 13, 2026 / 10:08 AM IST

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

GNTR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో పర్యటనపై సమీక్షించిన కలెక్టర్, ఈ నెల 15న జరిగే కార్యక్రమం విజయవంతం కావాలంటే శాఖల మధ్య సమన్వయం కీలకమని పేర్కొన్నారు.

April 13, 2026 / 10:05 AM IST